ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

30-06-2024 - ఆదివారం మీ రాశి ఫలితాలు.. సందర్భోచితంగా నిర్ణయాలు..?

horoscope
శ్రీ క్రోధినామ సం|| జ్యేష్ట బ|| నవమి ప.1.18 రేవతి ఉ.9.10 తె.వ. 3.53 ల 5.23. సా.దు. 4.43 ల5.35.
 
మేషం:- నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి. కొబ్బరి, పండ్లు, పూలు, చల్లని పానియ వ్యాపారులకు లాభం. మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. సందర్భోచితంగా నిర్ణయాలు తీసుకోవటం వల్ల కొన్ని వ్యవహారాలు మీకు లాభిస్తాయి. గతంలో వాయిదా వేసిన పనులు పునఃప్రారంభిస్తారు.
 
వృషభం:- వ్యాపారాభివృద్ధికి కొత్త కొత్త ప్రణాళికలు, పథకాలు రూపొందిస్తారు. రాజకీయ నాయకులకు దూర ప్రయాణాలలో మెళుకువ అవసరం. ఉద్యోగస్తులు విశ్రాంతి పొందుతారు. నూతన ప్రదేశాలను సందర్శిస్తారు. పెద్దల ఆరోగ్యములో మెళుకువ అవసరం. ఆర్ధిక వ్యవహారాలలో భాగస్వామి వైఖరి మనస్తాపం కలిగిస్తుంది.
 
మిథునం:- ఆర్ధిక పరిస్థితి సంతృప్తికరంగా ఉంటుంది. ప్రింటింగ్, స్టేషనరీ రంగంలోని వారికి పనివారలతో చికాకులను ఎదుర్కుంటారు. స్త్రీలు టి.వి., ఛానల్స్ కార్యక్రమాలలో రాణిస్తారు. ప్రముఖులను కలుసుకుంటారు. పాత మిత్రుల కలయికతో గత అనుభవాలు జ్ఞప్తికి వస్తాయి. విదేశీ వస్తువుల పట్ల ఆశక్తి పెరుగుతుంది. 
 
కర్కాటకం:- కార్యసాధనలో ఓర్పు, పట్టుదల అవసరం. స్త్రీలు అపరిచిత వ్యక్తులకు వీలైనంత దూరంగా ఉండటం మంచిది. నూతన పరిచయాలేర్పడతాయి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. రుణాలు, పెట్టుబడుల కోసం ప్రయత్నిస్తారు. ఖర్చులు అంతగా లేకున్నా ధనవ్యయం విషయంలో ఏకాగ్రత వహించండి.
 
సింహం:- మీ మాటలు ఇతరులకుచేరవేసే వ్యక్తులున్నారని గమనించండి. దూర ప్రయాణాలలో అసౌకర్యానికి గురౌతారు. నిరుద్యోగులకు ఆశాజనకం. కుటుంబ పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. రావలసిన ధనంలో కొంత మొత్తం వసూలుకాగలదు.
 
కన్య:- కాంట్రాక్టర్లు ప్రముఖుల సహకారంతో పెద్ద పెద్ద కాంట్రాక్టులు చేజిక్కించుకుంటారు. సోదరీ, సోదరుల మధ్య మనస్పర్థలు వంటివి తలెత్తుతాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. మీ సంతానం కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. దూర ప్రయాణాలలో అసౌకర్యానికి గురౌతారు.
 
తుల:- నూతన దంపతుల్లో కొత్త ఉత్సాహం చోటు చేసుకుంటుంది. తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులను ఎదుర్కోవలసి వస్తుంది. విదేశాలకు వెళ్ళటానికి చేయు యత్నాలు ఫలిస్తాయి. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటుంది. వృత్తి వ్యాపారాలు, ఉద్యోగాల్లో పురోభివృద్ధి అంతంత మాత్రంగానే ఉంటాయి.
 
వృశ్చికం:- పాత మిత్రుల కలయికతో మానసికంగా కుదుటపడతారు. ఆర్ధికలావాదేవీలు, కీలకమైన సమస్యలు సమర్ధవంతంగా పరిష్కరిస్తారు. స్త్రీలకు పనివారితో చికాకులు తప్పవు. భాగస్వామిక, సొంత వ్యాపారాలు ఆశించినంత లాభదాయకంగా సాగవు. గృహంలో విలువైన వస్తువులు చోరీకి గురయ్యే ఆస్కారం ఉంది.
 
ధనస్సు: వైద్య శిబిరంలోని వారు తరచు ఒత్తిడులకు గురవుతారు. ఏదైనా అమ్మకానికి చేయు ప్రయత్నాలు వాయిదా పడుటమంచిది. పెద్దల ఆరోగ్యములో మెళుకువ అవసరం. విజ్ఞతతో వ్యవహారించి రుణదాతలను సమాధాన పరుస్తారు. ఒకానొక విషయంలో మీ కళత్ర మొండి వైఖరి నిరుత్సాహం కలిగిస్తుంది.
 
మకరం:- హామీలు, మధ్య వర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. ప్రణాళికాబద్ధంగా వ్యవహరించి కొన్ని లక్ష్యాలు సాధిస్తారు. బంధు మిత్రుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది. విజ్ఞతతో వ్యవహరిస్తారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. ఆదాయం బాగుంటుంది. ఖర్చులు అదుపులో ఉండవు.
 
కుంభం:- నూతన ప్రదేశ సందర్శనల పట్ల ఆసక్తి పెరుగుతుంది. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. ఖర్చులు పెరగటంతో అదనపు రాబడి దిశగా మీ ఆలోచనలు సాగిస్తారు. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. మీ సంతానం కోసం అధికంగా శ్రమిస్తారు.
 
మీనం:- దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొని అందరిని ఆకట్టుకుంటారు. నిత్యావసర వస్తు స్టాకిస్టులు, వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. నిరుద్యోగులకు అవకాశాలు కొన్ని తృటిలో తప్పిపోతాయి. మీ కొత్త పథకాలు ఆచరణలో పెట్టి జయం పొందండి. చేతిలో ధనం నిలవదు. పెద్దఖర్చు తగిలే ఆస్కారం ఉంది.