ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్
Last Updated : గురువారం, 4 జులై 2024 (09:42 IST)

04-07-2024 గురువారం రాశిఫలాలు - భావాలను సున్నితంగా వ్యక్తం చేయండి...

Astrology
శ్రీ క్రోధినామ సం|| జ్యేష్ట ఐ|| త్రయోదశి ఉ.5.34 చతుర్ధశి తె.4.40. మృగశిర తె.4.21 ఉ.వ.10.10 ల 11.45. ఉ.దు. 9.53 ల 10.45 ప.దు. 3.06ల 3.58.
 
మేషం :- బంధువుల రాక మీకు ఎంతో ఆనందాన్ని కలిగిస్తుంది. నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు లభించిన జారవిడుచుకుంటారు. మీ సంతాన కోసం ధనం వెచ్చిస్తారు. కమ్యూనికేషన్, కంప్యూటర్, వైజ్ఞానిక రంగాలలో వారికి నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. 
 
వృషభం :- ప్రయాణాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయ రంగాలలో వారికి అనుకూలమైనకాలం. దంపతుల మధ్య పరస్పర అవగాహనా లోపం. ప్రేమికుల మధ్య మనస్పర్థలు తొలగిపోతాయి. కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు పై అధికారుల నుండి ఒత్తిడి చికాకులు తప్పవు.
 
మిథునం :- పెద్దలను, ప్రముఖులను కలుసుకోగలుగుతారు. ఒంటరిగానే లక్ష్యాలను సాధిస్తారు. ఇతరులకు వాహనం ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. అలౌకిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్త్రీలకు ఉపాధిపథకాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. బ్యాంకు లావాదేవీలు, ఋణ ప్రయత్నాలకు అడ్డంకులు ఎదురయ్యే అవకాశంఉంది.
 
కర్కాటకం :- మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. వృత్తుల వారికి ఎంత శ్రమించినా ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. గౌరవ ప్రతిష్ఠలు పెరిగే అవకాశం ఉంది. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించండి. బంధువుల రాకతో గృహంలో సందడి నెలకొంటుంది.
 
సింహం :- స్త్రీలు వాహనం నడుపునపుడు జాగ్రత్త వహించవలెను. ఆధ్యాత్మిక, సేవా కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విలువైన పత్రాలు అందుకుంటారు. వైద్యులకు శస్త్రచికిత్స చేయునపుడు మెళుకువ అవసరం. ప్రభుత్వ సంస్థలతో పనులు పూర్తవుతాయి. అధికారులతో సంభాషించేటప్పుడు జాగ్రత్త వహించండి.
 
కన్య :- మీ అభిప్రాయాలు, భావాలను సున్నితంగా వ్యక్తం చేయండి. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. మీ పరోపకార బుద్ధి మీకు సమస్యలను తెచ్చిపెడుతుంది. సహోద్యోగులతో కళా సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లోను, వస్తు నాణ్యతలోను మెళుకువ అవసరం.
 
తుల :- శ్రీవారు, శ్రీమతి విషయాలలో శుభపరిణామాలు సంభవం. బదిలీలు, మార్పులు, చేర్పులకు సంబంధించి ప్రణాళికలు రూపొందుంచుకుంటారు. రుణం ఏ కొంతైనా తీర్చాలన్న మీ సంకల్పం నెరవేరుతుంది. నిరుద్యోగులకు సదావకాశాలు లభిస్తాయి. స్త్రీల మాటకు వ్యతిరేకత ఎదురుకావటంతో కుటుంబ సౌఖ్యం లోపిస్తుంది.
 
వృశ్చికం :- బంధువుల నుంచి ఒత్తిడి, మొహమ్మాటాలు ఎదుర్కుంటారు. కొంతమంది మీ పలుకుబడిని దుర్వినియోగం చేయటం వల్ల మాటపడవలసి వస్తుంది. విద్యార్థుల్లో మందకొడితనం, నిర్లక్ష్యం చోటుచేసుకుంటాయి. గతకొంత కాలంగా అనుభవిస్తున్న చికాకులు తొలగిపోయి ప్రశాంతత చేకూరుతుంది.
 
ధనస్సు :- వాయిదా పడిన మొక్కుబడులు తీర్చుకుంటారు. ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి, చికాకులు అధికమతాయి. భవిష్యత్తులో ఖర్చులు, ఇతరత్రా చెల్లింపులు అధికంగా ఉంటాయి. బంధువులపై మీరు పెట్టుకున్న ఆశలు అడియాసలవుతాయి. స్త్రీలకు అకాల భోజనం, శారీరశ్రమ వల్ల ఆరోగ్యం మందగిస్తుంది.
 
మకరం :- రావలసిన ధనం గురించి ఆలోచనలు చేస్తారు. వాతావరణంలో మార్పుతో స్వల్ప అస్వస్థతకు గురవుతారు. చేపట్టిన పనులు వేగవంతమవుతాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. పత్రిక, వార్తా మీడియావారికి ఊహించని చికాకులు లెదురవుతాయి. పొదుపు ఆవశ్యకతను గుర్తిస్తారు.
 
కుంభం :- విందులలో పరిమితి పాటించండి. ఏదో ఒక స్థిరాస్తి విక్రయించాలనే ఆలోచన స్ఫురిస్తుంది. సోదరీ, సోదరుల మధ్య ప్రేమానుబంధాలు బలపడతాయి. ఉపాధ్యాయులకు ఆర్థిక ప్రగతితో కూడిన అవకాశాలు లభిస్తాయి. గృహమునకు కావలసిన వస్తువులు అమర్చుకోగలుగుతారు. దంపతుల మధ్య మనస్పర్థలుతలెత్తుతాయి.
 
మీనం :- ఆర్థికంగా నిలదొక్కుకోవటంతో పాటు రుణాలు తీరుస్తారు. నిరుద్యోగులు, వృత్తుల వారికి అన్ని విధాలా కలిసిరాగలదు. మీ చిన్నారుల కోసం నూతన పథకాలు వేసి జయం పొందగలుగుతారు. మీ సంకల్పనికి నిరంతర శ్రమ, పట్టుదల చాలా అవసరమని గమించండి. మీ కళత్ర విపరీతధోరణి చికాకు పరుస్తుంది.