బుధవారం, 4 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

02-07-202 మంగళవారం రాశిఫలాలు - ఖర్చులు అధికంగా ఉన్నా డబ్బుకు కొదవ ఉండదు...

Weekly astrology
శ్రీ క్రోధినామ సం|| జ్యేష్ట ఐ|| ఏకాదశి ఉ.8.54 భరణి ఉ.6.18 కృత్తిక తె.5.20 సా.వ.5.49 ల 7.21. ఉదు. 8.09 9.01 రా.దు. 10. 57 ల 11.41.
 
మేషం :- ఊహించని లాభాల్ని సొంతం చేసుకుంటారు. ఆహార వ్యవహారాల్లో మెళుకువ వహించండి. ముఖ్యులలో ఒకరి వైఖరి మీకెంతో చికాకు కలిగిస్తుంది. దంపతుల మధ్య ఏకాగ్రత లోపం అధికమవుతుంది. దంపతుల మధ్య ఏకాగ్రత లోపం అధికమవుతుంది. గతంలో నిలిచిపోయిన కార్యక్రమాలు తిరిగి ప్రారంభిస్తారు. 
 
వృషభం :- విద్యార్థులకు మెడికల్, ఇంజనీరింగ్, కోర్సులలో ప్రవేశం లభిస్తుంది. స్త్రీలకు విదేశీ వస్తువులపై మక్కువ పెరుగుతుంది. ఐరన్, సిమెంట్, కలప, ఇనుము, ఇసుక, ఇటుక వ్యాపారస్తులకు లాభదాయకం. ఖర్చులు అధికంగా ఉన్నా డబ్బుకు కొదవ ఉండదు. సభలు, సమావేశాల్లో చురుకుగా పాల్గొంటారు.
 
మిథునం :- ఉపాధ్యాయులు, మార్కెట్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. బ్యాంకింగ్, ఫైనాన్సు, చిట్స్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. దైవ కార్యాల పట్ల ఆసక్తి ఏర్పడుతుంది. ఓర్పు, సర్దుబాటు ధోరణితోనే పరిస్థితులు సర్దుకుంటాయి. స్థిరాస్తి అమ్మే విషయంలో పునరాలోచన అవసరం.
 
కర్కాటకం :- గృహంలో ఏవన్నా వస్తువులు పోవుటకు ఆస్కారం కలదు, జాగ్రత్త వహించండి. స్త్రీల తెలివితేటలకు మంచి గుర్తింపు లభిస్తుంది. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమసమాచారాలు సంతృప్తినిస్తాయి. ఏ వ్యవహారంలోనూ ఇతరులపై అతిగా ఆధారపడటం మంచిది కాదు. కోర్టు వ్యవహారాలు వాయిదా పడటంమంచిది.
 
సింహం :- ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన నెమ్మదిగా సమసిపోగలవు. ప్రైవేటు సంస్థలలో వారికి తోటి వారి కారణంగా సమస్యలు తలెత్తగలవు. మధ్యవర్తిత్వం వహించడం వలన మాటపడవలసివస్తుంది. కుటుంబంలో ప్రశాంతత నెలకొంటుంది. ప్రతి విషయంలోను నిర్మొహమాటంగా మీ అభిప్రాయాలు తెలియచేయండి.
 
కన్య :- వాహనం నడుపునపుడు మెళుకువ వహించండి. కోర్టు వ్యవహారాలల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమస్తాలకు చికాకులు వంటివి ఎదుర్కొంటారు. ఉద్యోగస్తులు స్త్రీలతో సంభాషించేటపుడు మెళుకువ అవసరం. పారిశ్రామిక కార్మికులలో నెమ్మదిగా మార్పులు కానవస్తాయి. దూరప్రయాణాలలో అపరిచితుల పట్ల మెళుకువ అవసరం.
 
తుల :- ఉద్యోగస్తులు స్త్రీలతో సంభాషించేటపుడు మెళుకువ అవసరం. దైవ, పుణ్య, సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటారు. కొంతమంది మీ నుండి విషయాలు రాబట్టటానికి యత్నిస్తారు. క్రయ విక్రయాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. దేవాలయ, విద్యా సంస్థలకు దానధర్మాలు చేయుట వలన మీ కీర్తి ప్రతిష్టలు ఇనుమడిస్తాయి.
 
వృశ్చికం :- ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తిగా సాగుతాయి. అన్ని రంగాలలోని స్త్రీలకు చాలా యోగప్రదంగా ఉండగలదు. కంప్యూటర్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్ రంగాల్లో వారికి పురోభివృద్ధి. కొబ్బరి, పండ్ల, పూల, పానీయ వ్యాపారులకు లాభదాయకం. సాహిత్య సదస్సులలోను, బృంద కార్యక్రమాల్లోను చురుకుగా పాల్గొంటారు.
 
ధనస్సు :- మీ మిత్రులలో ఒకరి వైఖరి మీకు చికాకులు కలిగించును. మీ సంతానం విద్య, ఆరోగ్య విషయాలు ఆందోళన కలిగిస్తాయి. రాజకీయాల్లో వారికి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. నిర్మాణ పథకాలలో జయం చేకూరును. విద్యా, సాంస్కృతిక విషయాల పట్ల ఆసక్తి పెరుగుతుంది.
 
మకరం :- ఆలయాలను సందర్శిస్తారు. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు. వాహనచోదకులకు ప్రమాదం జరగటానికి ఆస్కారం ఉంది. జాగ్రత్త వహించండి. ఉమ్మడి వ్యాపారస్తులకు అనుకూలమైన రోజు. మీ శ్రీమతి సలహా పాటించటం చిన్నతనంగా భావించకండి. రవాణా రంగాలలో వారికి లాభదాయకం.
 
కుంభం :- పూర్వ పరిచయ వ్యక్తుల కలయిక సంతృప్తినిస్తుంది. విదేశాలు వెళ్లుటకు చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. స్త్రీల మాటకు వ్యతిరేకత ఎదురుకావటంతో కుటుంబ సౌఖ్యం లోపిస్తుంది. వ్యాపారాభివృద్ధికి కొత్త కొత్త ప్రణాళికలు, పథకాలు రూపొందిస్తారు. ఖర్చులు పెరగటంతో కొత్త ఆదాయ మార్గాలు అన్వేషిస్తారు. 
 
మీనం :- చిన్నారులు, ప్రియతముల కోసం విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు. విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. పీచు, ఫోము, లెదర్ వ్యాపారస్థులకు లాభదాయకం. స్త్రీలకు అశాంతి పెరుగును. ఏ మాత్రం పొదుపు సాధ్యంకాదు. కుటుంబ సభ్యుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి.