శనివారం, 21 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

11-10-2024 శుక్రవారం దినఫలితాలు : ధనలాభం.. ఖర్చులు విపరీతం...

Kanakadurga
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కార్యం సిద్ధిస్తుంది. వస్త్రప్రాప్తి, ధనలాభం ఉన్నాయి. ఖర్చులు విపరీతం. ఉల్లాసంగా గడుపుతారు. కొందరి రాక ఇబ్బంది కలిగిస్తుంది. పనులు సాగవు. ఆహ్వానం అందుకుంటారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. పందాలు, క్రీడా పోటీల్లో విజయం సాధిస్తారు. వేడుకకు సన్నాహాలు సాగిస్తారు. ప్రయాణంలో అవస్థలు తప్పవు.
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ప్రతికూలతలతో సతమతమవుతారు. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. దుబారా ఖర్చులు విపరీతం. అందరితోను మితంగా సంభాషించండి. పనులు పురమాయించవద్దు. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. వ్యాపారాభివృద్ధికి అవిశ్రాంతంగా శ్రమిస్తారు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. చెల్లింపుల్లో జాగ్రత్త. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. అనవసర జోక్యం తగదు. అధికారులకు అదనపు బాధ్యతలు. ఉపాధి పథకాలు చేపడతారు. వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ఓర్పుతో యత్నాలు సాగించండి. మీ తప్పిదాలకు ఇతరులను నిందించవద్దు. పనులు హడావుడిగా సాగుతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆరోగ్యం బాగుంటుంటుంది. కీలక సమావేశాల్లో పాల్గొంటారు.
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
అందరితోనూ కలుపుగోలుగా మెలుగుతారు. పరిచయాలు బలపడతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. పనులు హడావుడిగా సాగుతాయి. దంపతుల మధ్య అన్యోన్యత నెలకొంటుంది. సన్నిహితులను విందులకు ఆహ్వానిస్తారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
కార్యక్రమాలు నిరాటంకంగా సాగుతాయి. మీ సమర్ధతపై ఎదుటివారికి గురి కుదురుతుంది. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. కొత్త పనులు చేపడతారు. ఆలయాలు సందర్శిస్తారు. ద్విచక్రవాహనంపై దూర ప్రయాణం తగదు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. ఖర్చులు అధికం. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. పనులు సానుకూలమవుతాయి. ఫోన్ సందేశాలను నమ్మవద్దు. వ్యాపారాలు సంతృప్తినిస్తాయి. ఉద్యోగస్తులకు పనిభారం, విశ్రాంతిలోపం. బెట్టింగ్ జోలికి పోవద్దు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
నిర్విరామంగా శ్రమిస్తారు. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. సామరస్యంగా మెలగండి. చెల్లింపుల్లో జాగ్రత్త. సోదరులతో సంభాషిస్తారు. పనులు, కార్యక్రమాలు హడావుడిగా సాగుతాయి. ఆలయాలకు విరాళాలు అందిస్తారు. దైవదర్శనాలు సంతృప్తినిస్తాయి. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
కొత్త విషయాలు తెలుసుకుంటారు. మాటతీరు ఆకట్టుకుంటుంది. ఖర్చులు విపరీతం. రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. చేపట్టిన పనులు ఒక పట్టాన సాగవు. కొత్త వ్యక్తులతో జాగ్రత్త. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. ఉపాధి పథకాలు చేపడతారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
వేడుకను ఆర్భాటంగా చేస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. ఖర్చులు అధికం, సంతృప్తికరం. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. ఉద్యోగస్తులకు పదవీయోగం. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
కష్టం ఫలిస్తుంది. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఉల్లాసంగా గడుపుతారు. పనులు నిర్విఘ్నంగా సాగుతాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పత్రాల్లో సవరణలు అనుకూలిస్తాయి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. వాహనదారులకు దూకుడు తగదు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
అవకాశాలను దక్కించుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. మీ ఉన్నతిని చాటుకోవటానికి విపరీతంగా వ్యయం చేస్తారు. పనుల ప్రారంభంలో ఆటంకాలెదురవుతాయి. నోటీసులు అందుకుంటారు. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. దైవదీక్షలు స్వీకరిస్తారు.