శుక్రవారం, 29 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

12-09-2024 గురువారం దినఫలితాలు - సకాలంలో పనులు పూర్తి చేస్తారు....

horoscope
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
ముఖ్యుల సందర్శనం కోసం పడిగాపులు తప్పవు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. అన్యమస్కంగా గడుపుతారు. స్నేహితుల సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. సంతానం యత్నాలు ఫలిస్తాయి. పత్రాలు అందుకుంటారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
సముచిత నిర్ణయాలు తీసుకుంటారు. యత్నాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ఆహ్వానం అందుకుంటారు. ఆరోగ్యం జాగ్రత్త. ఉపాధి పథకాలు చేపడతారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
కొత్త పరిచయాలు బలపడతాయి. సంతోషంగా గడుపుతారు. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. ధనలాభం ఉంది. ఇంటి విషయాలు పట్టించుకుంటారు. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ప్రయణం తలపెడతారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
శుభకార్యానికి యత్నాలు ప్రారంభిస్తారు. దూరపు బంధుత్వాలు బలపడతాయి. ఒక సమాచారం ఆలోచింప చేస్తుంది. మీ శ్రీమతితో సంప్రదింపులు జరుపుతాయి. నగదు, పత్రాలు జాగ్రత్త. పనులు పురమాయించవద్దు. సంతానం దూకుడు ఇబ్బంది కలిగిస్తుంది. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
అవకాశాలు చేజారిపోతాయి. ఆందోళనకు గురికావద్దు. స్థిమితంగా ఉండండి. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పనులు సాగవు. పాతపరిచయస్తులతో సంభాషిస్తారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. ముఖ్యులకు ఆత్మీయ వీడ్కోలు పలుకుతారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
ఖర్చులు విపరీతం. చేబదుళ్లు తప్పవు. ఆప్తులు సాయం అందిస్తారు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. వివాహయత్నాలు సాగిస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. మధ్యవర్తులను నమ్మవద్దు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఆలోచనలు నిలకడగా ఉండవు. ప్రతి విషయానికీ చికాకుపడతారు. ఆప్తులతో కాలక్షేపం చేయండి. వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండాలి. పనులు పురమాయించవద్దు. కుటుంబీకులు మీ అశక్తతను అర్ధం చేసుకుంటారు. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఫోన్ సందేశాలను నమ్మవద్దు. అజ్ఞాత వ్యక్తులు మోసగించే ఆస్కారం ఉంది. పత్రాలు సమయానికి కనిపించవు. పనులు హడావుడిగా సాగుతాయి. సంతానం కృషి ఫలిస్తుంది. ఉద్యోగస్తులు అధికారులను ప్రసన్నం చేసుకుంటారు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. పెద్దలతో కీలక విషయాలు చర్చిస్తారు. ధనలాభం ఉంది. ఉద్యోగస్తులకు పదవీయోగం. అధికారులకు సమస్యలెదురవుతాయి. వాహనం నడిపేటపుడు జాగ్రత్త. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. వాహనం నడిపేటపుడు జాగ్రత్త.
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
తలపెట్టిన కార్యం నెరవేరుతుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. దుబారా ఖర్చులు విపరీతం. పనులు చురుకుగా సాగుతాయ. కీలక విషయాలపై దృష్టిపెడతారు. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. పట్టుదలకు పోవద్దు. సన్నిహితులతో సంభాషిస్తారు.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. తొందరపాటు నిర్ణయాలు తగవు. అవిశ్రాంతంగా శ్రమిస్తారు. అకాలభోజనం, విశ్రాంతిలోపం. పొదుపు పథకాలపై దృష్టి సారిస్తారు. చేపట్టిన పనులు ఒకపట్టాన సాగవు. ఉద్యోగస్తులకు పనిభారం. దూరప్రయాణం తలపెడతారు.
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
మితంగా సంభాషించండి. మీ వ్యాఖ్యలను కొందరు తప్పుపడతారు. విమర్శలు పట్టించుకోవద్దు. గృహమరమ్మతులు చేపడతారు. విలువైన వస్తువులు జాగ్రత్త. ఉద్యోగపరంగా మార్పులుంటాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త