శుక్రవారం, 3 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

15-08-2023 శుక్రవారం రాశిఫలాలు - లలిత సహస్రనామం చదివినా లేక విన్నా శుభం...

Libra
శ్రీ శోభకృత్ నామ సం|| నిజ శ్రావణ బ॥ అమావాస్య ఉ.6.07 ఉత్తర పూర్తి ప.వ.1.04 ల 2.50. ఉ.దు. 8.17 ల 9.07 ప. దు. 12. 25 ల 1.15.
 
లలిత సహస్రనామం చదివినా లేక విన్నా శుభం, జయం చేకూరుతుంది.
 
మేషం :- కుటుంబ సమేతంగా దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. నిరుద్యోగులకు రాత, మౌఖిక పరీక్షలు నిరుత్సాహపరుస్తాయి. ఆకస్మికంగా ప్రయాణాలు చేయవలసి వస్తుంది. వ్యాపారాభివృద్ధికి చేయుప్రయత్నాలలో సఫలీకృతులౌతారు.
 
వృషభం :- నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. మీరు చేయదల్చుకున్న ముఖ్యమైన పనులు అనుకున్న విధంగా సాగవు. ఏ యత్నం కలిసిరాక పోవటంతో నిరుత్సాహం చెందుతారు. ఫ్యాన్సీ, స్టేషనరీ, వస్త్ర వ్యాపారులకు కలిసిరాగలదు. కార్యదీక్షతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు.
 
మిథునం :- నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో విజయం సాధిస్తారు. విలువైన కానుక ఇచ్చి మీ శ్రీమతిని ప్రసన్నం చేసుకుంటారు. ఆప్తుల రాకతో మానసికంగా కుదుటపడతారు. మీ ఉన్నతిని చాటుకోవడం కోసం ధనం విరివిగా ఖర్చు చేస్తారు. విజ్ఞతాయుతంగా వ్యవహరించి మీ గౌరవాన్ని కాపాడుకోండి.
 
కర్కాటకం :- ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన సమసిపోగలవు. ఇతరుల సహాయం అర్థించటానికి మొహమ్మాటం అడ్డు వస్తుంది. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, కంప్యూటర్ రంగాల వారికి సామాన్యం. ఎంతటి క్లిష్ట సమస్యనైనా ధైర్యంగా ఎదుర్కుంటారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలలో నూతన పరిచయాలు ఏర్పడతాయి.
 
సింహం :- ఓరిమితో ప్రయత్నిస్తే సులభంగా లక్ష్యాలు సాధిస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ప్లీడరు, ప్లీడరు గుమాస్తాలకు వృత్తిపరమైన చికాకులను ఎదుర్కొంటారు. నూతన వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఒత్తిడి తప్పదు. క్రయ విక్రయాలు లాభసాటిగా ఉంటాయి. 
 
కన్య :- స్త్రీల ఆరోగ్యం క్రమేణా మెరుగుపడుతుంది. విద్యార్థులు ఉన్నత చదువుల కోసం దూర ప్రాంతాలకు వెళ్ళవలసి ఉంటుంది. నూతన రుణాల కోసం అన్వేషిస్తారు. చిన్నారుల, విద్య, ఖరీదైన వస్తువుల కొనుగోలు విషయాలో ఖర్చులు అంచనాలు మించుతాయి. కాంట్రాక్టర్లకు చేతిలో పని పూర్తి కావడంతో ఒకింతకుదుటపడతారు.
 
తుల :- బంధుమిత్రుల కలయిక మీకెంతో సంతృప్తి నిస్తుంది. వాగ్వివాదాలకు సరైన సమయం కాదని గమనించండి. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. ఇంట్లో మార్పులు చేర్పులు అసౌకర్యం కలిగిస్తాయి. వాహనచోదకులు జరిమానాలు చెల్లించవలసి వస్తుంది. విదేశీయ వస్తువులు పట్ల ఆకర్షితులవుతారు.
 
వృశ్చికం :- హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. చేపట్టిన పనులు విసుకుగు కలిగించినా మొండిగా పూర్తి చేస్తారు. హామీలు, చెక్కుల జారీల్లో ఏకాగ్రత వహించండి. ఉద్యోగ, వ్యాపారులకు అధికారుల నుండి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. మిమ్మల్నిపొగిడే వారే కానీ సహకరించే వారుండరు.
 
ధనస్సు :- బ్యాంకు వ్యవహారాలలో, ప్రయాణాలలో మెళకువ అవసరం. దైవ దర్శనాలకై చేయుప్రయత్నాలు ఫలిస్తాయి. స్త్రీల పట్టుదల వల్ల కుటుంబ సౌఖ్యం అంతగా ఉండదు. వాతావరణంలో మార్పులు ఎంతో ఆందోళన కలిగిస్తాయి. నిరుద్యోగులు ఇంటర్వ్యూల్లో రాణిస్తారు. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగాఉంటుంది.
 
మకరం :- తల, కాళ్లు, చేతులు, నరాలకు సంబంధించిన చికాకులు అధికమ వుతాయి. విద్యార్థులకు విశ్రాంతి లోపం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. తాపీ పనివారికి ఆందోళనలు తప్పవు. స్త్రీలకు టి.వి ఛానెళ్ళ నుంచి ఆహ్వానాలు, సమాచారం అందుతుంది. మీ ప్రమేయం లేకుండానే కొన్ని చిక్కు సమస్యలు పరిష్కారమవుతాయి.
 
కుంభం :- దైవకార్య సమావేశాల్లో ప్రముఖంగా పాల్గొంటారు. స్త్రీలకు టి.వి ఛానెళ్ళ నుంచి ఆహ్వానాలు, సమాచారం అందుతుంది. మీ నిజాయితీపై అందరికి నమ్మకం కలుగుతుంది. బంధువులతో సంబంధాలు బలపడతాయి. విద్యార్థులు ఉపాధ్యాయులతో ఏకీభవించలేకపోతారు. ప్రముఖుల కలయిక వాయిదాపడుతుంది.
 
మీనం :- మీ ప్రమేయం లేకుండానే కొన్ని చిక్కు సమస్యలు పరిష్కారమవుతాయి. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో జయం పొందుతారు. కొబ్బరి, పండ్లు, పూలు చిరు వ్యాపారులకు లాభదాయకం. మిమ్మల్నిచూసి అసూయపడేవారు అధికమవుతున్నారని గ్రహించండి. మిత్రుల నుండి ఒక ముఖ్యసమాచారం అందుకుంటారు.