గురువారం, 9 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

17-12-2023 ఆదివారం రాశిఫలాలు - సూర్యస్తుతి ఆరాధించిన శుభం...

Surya Deva
శ్రీ శోభకృత్ నామ సం|| మార్గశిర శు॥ పంచమి రా.8.46 శ్రవణం ఉ.8.08 ప.వ.11.52 ల 1.22. సా.దు. 3.51 ల 4.35. సూర్యస్తుతి ఆరాధించిన శుభం కలుగుతుంది.
 
మేషం:- ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ సమస్యలు ఒక కొలిక్కి రాగలవు. అందరితో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. ప్రముఖుల కలయిక సంతృప్తినిస్తుంది. ఫ్యాన్సీ, సుగంధ ద్రవ్య, రసాయన వ్యాపారస్తులకు లాభదాయకం. కుటుంబీకుల నుండి ఊహించని సమస్యలు తలెత్తవచ్చు జాగ్రత్త వహించండి.
 
వృషభం:- నిరుద్యోగుల ఆలోచనలు ఉపాధి పథకాల దిశగా సాగుతాయి. దంపతుల మధ్య అనురాగ వాత్సల్యాలు బలపడతాయి. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఒక వ్యవహారం నిమిత్తం న్యాయవాదులతో సంప్రదింపులు జరుపుతారు. నేడు అనుకూలించని యత్నం రేపు ఫలిస్తుంది.
 
మిథునం:- మీ సంతానం మొండివైఖరి చికాకు కలిగిస్తుంది. వృత్తులు, ఏజెంట్లు, బ్రోకర్లకు శ్రమించిన కొలదీ ఆదాయం. వేళకాని వేళలో బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. ఉపాధ్యాయులు విశ్రాంతి పొందుతారు. ఖర్చులు అదుపు కాకపోగా మరింత ధనవ్యయం అవుతుంది. పెద్దల ఆరోగ్యం గురించి ఆందోళన చెందుతారు. 
 
కర్కాటకం:- హోటల్ తినుబండ, కేటరింగ్ రంగాల్లో వారికి కలిసి వచ్చే కాలం. ప్రయాణాలు ఇబ్బంది కలిగిస్తాయి. గృహోపకరణాలు, వాహనం సమకూర్చుకుంటారు. మీ రాక సన్నిహితులకు సంతోషం కలిగిస్తుంది. స్త్రీలకు ఇంటర్వ్యూ సమాచారం, ఉద్యోగావకాశం లభిస్తుంది. మీ సంతానం మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది.
 
సింహం:- లీజు, ఏజెన్సీలు, నూతన కాంట్రాక్టుల అనుకూలతకు మరి కొంత సమయం పడుతుంది. ఉద్యోగ యత్నంలో బిడియం, నిరుత్సాహం విడనాడండి. చిట్స్, ఫైనాన్సు, బ్యాంకింగ్ రంగాల వారికి చికాకులు అధికమవుతాయి. రాజకీయ నాయకులు పార్టీలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు.
 
కన్య:- స్త్రీలకు తల, కాళ్లు, నరాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. ఆలయాలను సందర్శిస్తారు. మీకు నచ్చని విషయాలను సున్నితంగా తెలియజేయండి. ఉపాధ్యాయులకు పని భారం అధికం. స్థిరచరాస్థుల విషయంలో ఏకీభావం కుదరదు. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి ఒత్తిడి అధికమవుతాయి.
 
తుల:- అర్ధిక, కుటుంబ సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. దూర ప్రయాణాలలో నూతన పరిచయా లేర్పడతాయి. పట్టుదలతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. మీ శ్రీమతి సలహాను తేలికగా కొట్టివేయకండి. స్త్రీలకు పనివారలతో చికాకులను ఎదుర్కుంటారు. పెద్దల ఆరోగ్యములో సంతృప్తి కానవస్తుంది. పాత రుణాలు తీరుస్తారు.
 
వృశ్చికం:- చేపట్టిన పనులలో జాప్యం, స్వల్ప ఆటంకాలు తప్పవు. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. దూర ప్రయాణాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రైవేట్ విద్యా సంస్థలలోని వారికి ఒత్తిడి, త్రిప్పట, అదనపు పనిభారం వంటి చికాకులు తప్పవు. కొత్త ఆలోచనలు, పథకాలతో వ్యాపారాల్లో కొంత పురోగతి సాధిస్తారు.
 
ధనస్సు:- గత తప్పిదాలు పునరావృతమయ్యే సూచనలున్నాయి. ప్రత్యర్థుల తీరును గమనించి తదనుగుణంగా మెలగండి. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకం. స్థిరాస్తి క్రయ విక్రయాలువాయిదా వేయండి. కుటుంబ సమస్యలు పరిష్కార దిశగా సాగుతాయి. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
 
మకరం:- విద్యార్థులు క్రీడలపట్ల ఆసక్తి చూపుతారు. స్త్రీలకు పనివారితో చికాకులు అధికమవుతాయి. ప్రముఖులతో ఇంటర్వ్యూలు అనుకూలిస్తాయి. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయు ప్రయత్నాలు ఫలిస్తాయి. ఆత్మీయులకు విలువైన కానుకలు సమర్పించుకుంటారు. మీ సంతానం కోసంధనం అధికంగా వ్యయం చేస్తారు.
 
కుంభం:- సన్నిహితులతో కలిసి చేపట్టినపనులు సమీక్షిస్తారు. నిరుద్యోగులకు తాత్కాలిక అవకాశాలు లభిస్తాయి. ముఖ్యమైన వ్యవహారాల్లో బిజీగా ఉంటారు. కళ, క్రీడా, కంప్యూటర్ రంగాల వారికి అన్ని విధాల కలిసిరాగలదు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ముఖ్యం. బ్యాంకు అపరిచిత వ్యవహారాలలో మెళుకువ అవసరం.
 
మీనం:- గృహమునకు కావలసిన వస్తువులను కొనుగోలు చేస్తారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్త్రీలకు టీవీ ఛానెళ్లు, పత్రికాసంస్థల నుంచి పారితోషికం అందుతుంది. ప్రైవేటు సంస్థలలోని వారికి బరువు బాధ్యతల నుంచి విశ్రాంతి పొందుతారు. ఆత్మీయుల ఆకస్మిక రాక సంతోషం కలిగిస్తుంది.