ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

16-12-2023 శనివారం రాశిఫలాలు -

Weekly Astrology
శ్రీ శోభకృత్ నామ సం|| మార్గశిర శు॥ చవితి రా.10.57 ఉత్తరాషాఢ ఉ.9.31 ప.వ.1.17 ల 2.47. ఉ. దు. 6.16 ల7.45.
అనంతపద్మనాభస్వామిని పూజించిన మీ సంకల్పం సిద్ధిస్తుంది.
 
మేషం :- మీ శ్రీమతితో అనునయంగా మెలగాలి. రాజకీయనాయకులకు విదేశీయాన ప్రయాణాలు అనుకూలిస్తాయి. మీ బంధువులను సహాయం అర్ధించే బదులు మీరే ప్రత్యామ్నాయం చూసుకోవటం ఉత్తమం. ట్రాన్స్‌పోర్టు, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి కలిసిరాగలదు. సోదరులతో ఏకీభవించలేకపోతారు.
 
వృషభం :- కానివేళలో ఇతరుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. సినిమ, సంగీత, నృత్య కళాకారులకు సన్మానాలు వంటి విజరుగుతాయి. చిన్ననాటి వ్యక్తుల కలయికతో మధురానుభూతి చెందుతారు. నిరుద్యోగులు భవిష్యత్ గురించి పథకాలు వేసిన సత్ఫలితాలు పొందుతారు. కాంట్రాక్టర్లకు రావలసిన బిల్లులు మంజూరవుతాయి.
 
మిథునం :- విదేశీయానం కోసం చేసే యత్నాల్లో ఆటంకాలను ఎదుర్కుంటారు. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయుయత్నాలు ఫలిస్తాయి. వ్యాపారాల్లో ఆటుపోట్లు ఎదురైనా ధైర్యంగా ముందుకు సాగండి. ఎప్పటిసమస్యలు అప్పుడే పరిష్కరించకోవటం ఉత్తమం. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తితో పాటు అవకాశాలు కలిసిరాగలవు.
 
కర్కాటకం :- ప్రైవేటు సంస్థలలోని వారు ఎంత శ్రమించినా యాజమాన్యం గుర్తింపు ఉండదు. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో పునరాలోచన అవసరం. ఉద్యోగ రీత్యా దూర ప్రయాణాలు చేయవలసివస్తుంది. గత విషయాలు జ్ఞప్తికి రాగలవు. చెప్పుడు మాటలకు ప్రాధాన్యమివ్వటం మంచిది కాదని గ్రహించండి.
 
సింహం :- స్త్రీలకు పనివారాలతో చికాకులు తప్పవు. రవాణా, ఎక్స్‌పోర్టు రంగాల్లో వారు పనివారి వల్ల ఇబ్బందులకు గురవుతారు. రుణ విముక్తులు కావడంతో పాటు తాకట్లు విడిపించుకుంటారు. దంపతులకు సంతాన ప్రాప్తికలదు. వాహనం, విలువైన వస్తువులు అమర్చుకోవాలనే మీ కోరిక త్వరలోనే నెరవేరుతుంది.
 
కన్య :- రాజకీయనాయకులు విందు, వినోదాలలో పాల్గొంటారు. స్త్రీలకు అయిన వారి ఆరోగ్యం కలవరపరుస్తుంది. బంగారు, వెండి, వస్త్ర వ్యాపారస్తులకు మిశ్రమ ఫలితం. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. తెలివిగా వ్యవహరిస్తున్నామనుకొని తప్పటడుగు వేస్తారు. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు.
 
తుల :- స్త్రీలకు షాపింగ్ వ్యవహారాలు, అపరిచిత వ్యక్తుల విషయంలోను అప్రమత్తత అవసరం. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ఎటువంటి స్వార్థచింతన లేకుండా ఇతరులకు సహాయం చేస్తారు. సోదరీ సోదరులతో ఉల్లాసంగా గడుపుతారు. కొన్ని విలువైన వస్తువులు అనుకోకుండా కొనుగోలుచేస్తారు.
 
వృశ్చికం :- స్థిరాస్తి క్రయ విక్రయాలకు సంబంధించిన వ్యవహారాలలో మెళకువ అవసరం. దంపతుల మధ్య ప్రేమానుబంధాలు బలపడతాయి. స్త్రీలకు ఆధ్యాత్మిక కార్యక్రమాల పట్ల ఆసక్తి పెరుగుతుంది. విద్యార్థులకు క్రీడలపట్ల ఆసక్తి అధికమవుతుంది. ఖర్చులు అధికమవుతాయి. శుభకార్యాలు, ఇంటి విషయాల పట్ల శ్రద్ధవహిస్తారు.
 
ధనస్సు :- కొబ్బరి, పండ్లు, పూలు చిరు వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది. రాజకీయాల వారికి పార్టీపరంగాను, అన్నివిధాలా గుర్తింపు లభిస్తుంది. పెద్దల ఆరోగ్యంలో మెళుకువ అవసరం. స్త్రీలకు సంపాదపట్ల ఆసక్తి అధికమవుతుంది. నిరుద్యోగులు చేపట్టిన ఉపాధి పథకాలు ఏమంత సంతృప్తినీయవు.
 
మకరం :- దంపతుల మధ్య బంధువుల ప్రస్తావన వస్తుంది. మీ మిత్రుల మొండివైఖరి మీకు చికాకు కలిగిస్తుంది. విద్యార్థులు ప్రేమ వ్యవహారాలకు దూరంగా ఉండాలి. ప్రయాణాల లక్ష్యం నెరవేరుతుంది. ప్రయత్నపూర్వకంగా మొండి బాకీలు వసూలు కాగలవు. కుటుంబీకులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు.
 
కుంభం :- ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయుయత్నాలు ఫలిస్తాయి. స్త్రీలకు పనివారితో ఇబ్బందులు తప్పవు. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త వహించండి. హోటల్, తినుబండ, కేటరింగ్ రంగాల్లో వారికి కలిసిరాగలదు. ఇతరుల ఆంతరంగిక విషయాలలో తలదూర్చకండి. దూర ప్రయాణాలలో వస్తువులపట్ల మెళుకువ అవసరం.
 
మీనం :- ఆలయసందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఉపవాసాలు, విశ్రాంతి లోపం వల్ల స్త్రీల ఆరోగ్యం మందగిస్తుంది. సమయానికి ధనం సర్దుబాటుకాగలదు. చిన్ననాటి పరిచయస్తుల కలయిక సంతోషం కలిగిస్తుంది. మీ సంతానం చదువుల్లో బాగా రాణిస్తారు. నిరుద్యోగులకు ఒక ప్రకటన ఎంతో ఆసక్తి కలిగిస్తుంది.