బుధవారం, 22 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

14-12-2023 గురువారం రాశిఫలాలు - లక్ష్మీకుబేరుడిని ఆరాధించిన శుభం జయం...

Astrology
శ్రీ శోభకృత్ నామ సం|| మార్గశిర శు|| విదియ రా.2.39 మూల ఉ. 11.33 ఉ.వ.9.58 ల 11.33 రా.వ.8.48 ల 10.20. ఉ. దు. 10.01 ల 10.45 పు.దు. 2.25 ల3.09. లక్ష్మీకుబేరుడిని ఆరాధించిన శుభం జయం చేకూరుతుంది.
 
మేషం :- భాగస్వామిక సమావేశాల్లో కొత్త విషయాలు చర్చకు వస్తాయి. రిప్రజెంటేటివ్‌లకు సంతృప్తి కానవస్తుంది. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలలో మెళుకువ అవసరం. ఉద్యోగస్తులు అవిశ్రాంతంగా శ్రమంచి పెండింగ్ పనులు పూర్తిచేస్తారు. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులు వంటివి ఎదుర్కొంటారు. 
 
వృషభం :- రాజకీయనాయకులు పార్టీలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. వైద్యులకు శస్త్రచికిత్సలలో ఏకాగ్రత, మెళుకువ చాలా అవసరం. ఉద్యోగస్తులు పై అధికారుల నుంచి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. వస్త్ర వ్యాపారులు పనివారలను ఓ కంట కనిపెట్టుకుని ఉండటం శ్రేయస్కరం. 
 
మిథునం :- ఇతరులతో అతిగా మాట్లాడటం మీ శ్రీమతికి నచ్చకపోవచ్చు. ప్లీడర్లకు, ప్లీడరు గుమాస్తాలకు సదావకాశాలు లభిస్తాయి. దైవ దర్శనాలవల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఆత్మస్థయిర్యంతో శ్రమించి అనుకున్నది సాధిస్తారు. ప్రముఖుల ఇంటర్వ్యూ కోసం పడిగాపులు తప్పవు. సోదరీ సోదరులతో ఉల్లాసంగా గడుపుతారు.
 
కర్కాటకం :- సంఘంలో మీ మాటకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఉద్యోగ రీత్యా దూర ప్రయాణాలు చేయవలసివస్తుంది. సినిమ, సంగీత, నృత్య కళాకారులకు సన్మానాలు వంటివి విజరుగుతాయి. కుటుంబ సమస్యల నుంచి బయటపడతారు. స్త్రీలకు టి.వి. కార్యక్రమాలకు సంబంధించిన ఆహ్వానాలు అందుతాయి.
 
సింహం :- బ్యాంకుల్లో మీ పనులకు స్వల్ప ఆటంకాలు ఎదురవుతాయి. ఇతరులకు వాహనం ఇవ్వటం వల్ల సమస్యలు తలెత్తుతాయి. అకాల భోజనం, విశ్రాంతి లోపం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. స్థిరాస్తి విక్రయానికి ఆటంకాలు తొలగిపోగలవు. చెప్పుడు మాటలకు ప్రాధాన్యమివ్వటం మంచిది కాదని గ్రహించండి.
 
కన్య :- వ్యాపారాల అభివృద్ధికి బాగా శ్రమిస్తారు. ప్రముఖుల కలయిక వల్ల ఏమంత ప్రయోజనం ఉండదు. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తితో పాటు అవకాశాలు కలిసిరాగలవు. రుణం తీర్చి తాకట్టు వస్తువులను విడిపిస్తారు. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలు పెంచుకుంటారు. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి.
 
తుల :- మీ కళత్ర మొండి వైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. పాత వస్తువులను కొనిసమస్యలు తెచ్చుకోకండి. స్త్రీలకు అయిన వారి ఆరోగ్యం కలవరపరుస్తుంది. ముఖ్యమైన వ్యవహారాల్లో బిజీగా ఉంటారు. బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. రుణాలు, చేబదుళ్లు ఇచ్చే విషయంలో జాగ్రత్త వహించండి.
 
వృశ్చికం :- కాంట్రాక్టర్లకు ఏకాగ్రత లోపం వల్ల చికాకులు తప్పవు. రవాణా, ఎక్స్‌పోర్టు రంగాల్లో వారు పనివారి వల్ల ఇబ్బందులకు గురవుతారు. వ్యాపారాల్లో పోటీని తట్టుకుంటారు. మీ కార్యక్రమాలలో స్వల్ప మార్పులుంటాయి. ఎదైనా వస్తువు కొనుగోలుకు షాపింగ్ చేస్తారు. మీ సంతానం కోసం ధనం బాగా వెచ్చిస్తారు.
 
ధనస్సు :- నిరుద్యోగులు నిరుత్సాహం వీడి ఆత్మవిశ్వాసంతో యత్నాలు కొనసాగించటం మంచిది. పెద్దలను, ప్రముఖులను కలుసుకొని వారికి బహుమతులు అందజేస్తారు. ప్రింటింగ్, స్టేషనరీ రంగాల వారికి పనివారితో చికాకులు తలెత్తుతాయి. స్త్రీలకు నరాలు, పొట్ట, కాళ్లకి సంబంధించిన చికాకులు ఎదుర్కొనకతప్పదు.
 
మకరం :- ఖర్చులు, చెల్లింపులు ప్రయోజనకరంగా ఉంటాయి. విదేశీయానం కోసం చేసే యత్నాల్లో స్వల్ప చికాకులు ఎదుర్కుంటారు. ప్రముఖులతో పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. స్త్రీ మూలకంగా వివాదాలు ఎదుర్కుంటారు. మిత్రులతో కలిసి విందులలో పాల్గొంటారు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లకు చికాకులు తప్పవు.
 
కుంభం :- చేపట్టిన పనులు సక్రమంగా సాగక విసుగు కలిగిస్తాయి. ఖర్చులు అధికం, రుణాలు, చేబదుళ్ళు తప్పకపోవచ్చు. వృత్తి ఉద్యోగాల్లో తలెత్తిన ఆటంకాలు తొలగిపోగలవు. దైవ సేవ, పుణ్యకార్యాల్లో పాల్గొంటారు. ఉపాధ్యాయులకు సదావకాశాలు లభిస్తాయి. కోర్టు వ్యవహారాలు అనుకున్నంత సాఫీగా సాగవు.
 
మీనం :- ధనం ఏ మాత్రం పొదుపు చేయకపోయినప్పటికీ ఆర్థిక ఇబ్బంది అంటూ ఏది ఉండదు. బంధువులను కసులుసుకుంటారు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించండి. పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. హోటల్, కేటరింగ్ రంగాల్లోవారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు.