గురువారం, 31 అక్టోబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

18-03-2023 తేదీ శనివారం దినఫలాలు - శ్రీమన్నారాయణుడిని తులసీదళాలతో...

Virgo
మేషం :- ఆర్థిక విషయాల్లో ఒకడుగు ముందుకు వేస్తారు. స్త్రీలకు అప్పుడప్పుడు ఆరోగ్యంలో సమస్యలు తలెత్తగలవు. కార్యసాధననలో పట్టుదల, ఓర్పు చాలా ముఖ్యమని గమనించండి. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్, కంప్యూటర్ రంగాలలో వారికి చికాకులు తప్పవు.
 
వృషభం :- స్త్రీలకు తల, మెడ, నడుము, నరాలకు సంబంధించిన చికాకులు ఎదుర్కొనక తప్పదు. రాజకీయ నాయకులు సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. ఇతరుల సలహాను పాటించుట వలన సమస్యలు తప్పవు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
మిథునం :- ఆర్థిక విషయాల్లో సంతృప్తి, పురోభివృద్ధి కానవస్తుంది. కాంట్రాక్టర్లు, క్యాటరింగ్ పనివారలకు పనిభారం అధికమవుతుంది. వాహనం అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. చివరి క్షణంలో చేతిలో ధనం ఆడక ఇబ్బందులు కొన్ని తెచ్చుకుంటారు. ఆకస్మిక ప్రయాణాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
కర్కాటకం :- మొండి బాకీలు సైతం వసూలు కాగలవు. రవాణా రంగాలలోని వారికి ఇబ్బందులు తప్పవు. నిరుద్యోగులకు ప్రముఖుల సహకారంతో నదావకాశాలు లభిస్తాయి. పాత సమస్యలు పరిష్కారమార్గంలో నడుస్తాయి. దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడతాయి. మిత్రులతో కలిసి విందు వినోదాలలో పాల్గొంటారు. 
 
సింహం :- వ్యాపారాభివృద్ధికి చేపట్టిన పథకాలు సామాన్య ఫలితాలనే ఇస్తాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి గుర్తింపు లభిస్తుంది. హోటల్, కేటరింగ్ రంగాల్లో వారు పనివారితో ఇబ్బందులు ఎదుర్కొంటారు. మీ సంతానం విద్యా విషయాల పట్ల శ్రద్ధ వహిస్తారు. గృహంలో మార్పులు, చేర్పులు వాయిదా పడతాయి.
 
కన్య :- విద్యార్థులు విద్యా విషయాల పట్ల శ్రద్ధ వహించిన సత్ఫలితాలు పొందగలరు. ప్రేమికుల మధ్య అనురాగ వాత్సల్యాలు పెంపొందుతాయి. సిమెంటు, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు సామాన్యం. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. కష్టసమయంలో ఆత్మీయులు తోడుగా నిలుస్తారు.
 
తుల :- పుణ్య, సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. నిరుద్యోగులు నిరుత్సాహం విడనాడి శ్రమించిన సత్ఫలితాలు లభిస్తాయి. మీ సంతానం మొండితనం వల్ల అసహనానికి గురవుతారు. రాజకీయనాయకులు సభ, సమావేశాలలో పాల్గొంటారు. ఇంటర్వ్యూలలో జయం మిమ్మల్ని వరిస్తుంది. రావలసిన ధనం చేతికందుతుంది.
 
వృశ్చికం :- ముఖ్యుల వైఖరి మీకెంతో ఆందోళన కలిగిస్తుంది. శత్రువులు మిత్రులుగా మారి సహాయాన్ని అందిస్తారు. కోర్టు వ్యవహారాలలో ప్లీడర్లకు ఒత్తిడి చికాకులు అధికమవుతాయి. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులతో ఆచితూచి సంభాషించండి. ప్రభుత్వ కార్యాలయాలలోని పనులు సకాలంలో పూర్తవుతాయి.
 
ధనస్సు :- గృహంలో నెలకొన్న అశాంతి తొలగిపోయి ప్రశాంతత నెలకొంటుంది. సహోద్యోగులతో అభిప్రాయభేధాలు తలెత్తే ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. రాబడికి మించిన ఖర్చుల వల్ల స్వల్పఇబ్బందు లెదుర్కొంటారు. ఉద్యోగ రీత్యా ఆకస్మికంగా ప్రయాణాలు చేస్తారు. మిత్రుల కలయికతో మనసు కుదుటపడుతుంది.
 
మకరం :- కాంట్రాక్టర్లకు పనివారివల్ల సమస్యలకు, ఇబ్బందికి లోనవుతారు. ప్రతి క్షణం కుటుంబీకుల క్షేమం గురించి ఆలోచిస్తారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. కొబ్బరి, పండ్లు, పూల వ్యాపారులకు లాభదాయకంగా ఉంటుంది.
 
కుంభం :- మీ కళత్ర మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. అధికారులకు బదిలీ వార్తా ఉద్యోగస్తులకు సంతోషం కలిగిస్తుంది. ఆకస్మికంగా దూరప్రయాణాలు వాయిదా పడతాయి. ఒక అవసరానికి ఉంచిన ధనం మరో ఖర్చుకు వినియోగించవలసి వస్తుంది. ముఖ్యులతో సంభాషించేటపుడు మెలకువవహించండి.
 
మీనం :- వస్త్ర, వెండి, బంగారు లోహ వ్యాపారస్తులకు పనివారితో సమస్యలు తలెత్తుతాయి. దంపతుల మధ్య ముఖ్యమైన విషయాలు చర్చకు వస్తాయి. సోదరీ, సోదరుల మధ్య ప్రేమానుబంధాలు బలపడతాయి. పారిశ్రామిక, రాజకీయవర్గాలకు విదేశీ పర్యటనలు వాయిదాపడతాయి. ఒంటెత్తు పోకడ మంచిది కాదని గమనించండి.