ఆదివారం, 10 నవంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

18-09-2024 బుధవారం దినఫలితాలు : కొత్త యత్నాలు ప్రారంభిస్తారు...

horoscope
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. అయిన వారి ప్రోత్సాహం ఉంటుంది. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ఆప్తులకు సాయం అందిస్తారు. చేపట్టిన పనులు ఒకపట్టాన సాగవు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
రావలసిన ధనం అందుతుంది. సకాలంలో వాయిదాలు చెల్లిస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. గృహమరమ్మతులు చేపడతారు. కార్మికులకు పనులు లభిస్తాయి. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణం తగదు.
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
మీ కృషి ఫలిస్తుంది. ఉల్లాసంగా గడుపుతారు. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. సోదరులతో సంప్రదిస్తారు. సంతానం దూకుడు అదుపు చేయండి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. వివాదాలు కొలిక్కివస్తాయి. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
వస్తులాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఆర్భాటాలకు వ్యయం చేస్తారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. వివాహయత్నం ఫలించే సూచనలున్నాయి. ముఖ్యులను కలుసుకుంటారు. ఉద్యోగస్తులకు పదోన్నతి, కొత్త బాధ్యతలు. ఆప్తులను విందులకు ఆహ్వానిస్తారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
తలపెట్టిన పనులు నిర్విఘ్నంగా సాగుతాయి. ఆప్తులతో సంభాషిస్తారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. ఏ విషయాన్నీ పెద్దగా పట్టించుకోవద్దు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. మీ చొరవతో మేలు జరుగుతుంది. సామాజిక, దైవకారాల్లో పాల్గొంటారు. 
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త 1, 2 పాదాలు
శ్రమించినా ఫలితం ఉండదు. మీపై మీకే నమ్మకం సన్నగిల్లుతుంది. అతిగా ఆలోచింపవద్దు. సన్నిహితులకు మీ సమస్యలు తెలియజేయండి. ఒకరి వద్ద మరొకరి ప్రస్తావన తగదు. ఖర్చులు విపరీతం. అవసరాలు వాయిదా వేసుకుంటారు. ఉద్యోగ బాధ్యతలపై ధ్యాసపెట్టండి. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
సన్నిహితులు సాయం అందిస్తారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. పనులు వేగవంతమవుతాయి. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. పత్రాల్లో సవరణలు సాధ్యపడవు. ఖర్చులు విపరీతం. రాబడిపై దృష్టి పెడతారు. దూరపు బంధువులతో సంభాషిస్తారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
సర్వత్రా ప్రోత్సాహకరం. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. ఖర్చులు సామాన్యం. ఆప్తులకు సాయం అందిస్తారు. అప్రియమైన వార్త వింటారు. పనులు సాగవు. సోదరులను సంప్రదిస్తారు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
రావలసిన ధనం అందుతుంది. విలాసాలకు ఖర్చుచేస్తారు. ప్రముఖులకు సన్నిహితులవుతారు. వ్యతిరేకులతో జాగ్రత్త. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. ఉపాధ్యాయులకు పదోన్నతి, పురస్కారాలు అందుకుంటారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
ధన సమస్యలెదురవుతాయి. ఆలోచనలతో సతమతమవుతారు. సన్నిహితుల సాయం అందుతుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. ఉపాధి పథకాలు చేపడతారు. ప్రైవేట్ ఉద్యోగస్తులకు కష్టసమయం. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. దైవదీక్షలు స్వీకరిస్తారు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
చేపట్టిన పనులు ఒక పట్టాన పూర్తికావు. చీటికిమాటికి చికాకుపడతారు. ఎవరినీ నిందించవద్దు. దంపతుల మధ్య అకారణ కలహం. స్థిమితంగా ఉండటానికి యత్నించండి. పంతాలకు పోవద్దు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. ఏకాగ్రతతో వాహనం నడపండి. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
సభ్యత్వాలు స్వీకరిస్తారు. బాధ్యతగా మెలగండి. ఇతరుల కోసం విపరీతంగా వ్యయం చేస్తారు. ఫోన్ సందేశాలు పట్టించుకోవద్దు. సంతోషకరమైన వార్త వింటారు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. వ్యాపారాభివృద్ధికి అవిశ్రాంతంగా శ్రమిస్తారు.