గురువారం, 19 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

19-11-2023 ఆదివారం రాశిఫలాలు - మీ ఇష్టదైవాన్ని ఆరాధించిన ఆర్ధికాభివృద్ధి...

Weekly Horoscope
శ్రీ శోభకృత్ నామ సం|| కార్తీక శు॥ షష్ఠి ఉ.7.48 సప్తమి తె.5.35 శ్రవణం రా.11.51 ఉ.శే.శ.6.33కు
తె..3.34 ల 5.04. సా.దు. 3.54 ల 4.39.
మీ ఇష్టదైవాన్ని ఆరాధించిన ఆర్ధికాభివృద్ధి, పురోభివృద్ధి కానవస్తుంది.
 
మేషం :- కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయల వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. రవాణారంగాల వారికి చికాకులు తలెత్తుతాయి. మీ ఉన్నతిని చూచి అసూయపడేవారు అధికమవుతున్నారని గమనించండి. వన సమారాధనలు, వేడుకలకు ప్రణాళికలు రూపొందిస్తారు. ఉద్యోగస్తులు విశ్రాంతికై చేయుయత్నాలు ఫలిస్తాయి.
 
వృషభం :- వ్యాపారాభివృద్ధికి కొత్త కొత్త పథకాలు ప్రణాళికలు రూపొందిస్తారు. దైవ సేవా కార్యక్రమాలలో చురుకుగా పాల్గొంటారు. విద్యార్థులకు క్రీడలపట్ల ఆసక్తి అధికమవుతుంది. రావలసిన ధనం వాయిదాపడుతుంది. దూర ప్రయాణాలలో వస్తువులపట్ల మెళుకువ అవసరం. స్త్రీలకు పనివారితో ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
మిథునం :- చిట్స్, ఫైనాన్సు వ్యాపారులకు ఖాతాదారులు ఒత్తిడి అధికమవుతుంది. కుటుంబీకులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. మీ పథకాలు, ఆలోచనలు, కార్యరూపం దాల్చుతాయి. ధనం విరివిగా వ్యయం చేసి అపోహలకు గురవుతారు. స్త్రీలకు దూర ప్రయాణాలలో నూతన పరిచయాలు ఏర్పడతాయి.
 
కర్కాటకం :- గృహ నిర్మాణాలు, మరమ్మతులు చేపడతారు. మీ మాటకు కుటుంబీకుల నుంచి మంచి స్పందన లభిస్తుంది. వృత్తి వ్యాపారాలు సంతృప్తికరంగా సాగుతాయి. నూతన టెండర్లు, ఏజెన్సీలకు సంబంధించి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. రుణం ఏ కొంతైనా తీర్చాలన్న మీ సంకల్పం నెరవేరుతుంది.
 
సింహం :- ఇతరుల ముందు వ్యక్తిగత విషయాలు వెల్లడించటం మంచిది కాదని గమనించండి. స్త్రీలకు వస్త్ర, వస్తు ప్రాప్తి, వాహన యోగం వంటి శుభ ఫలితాలుంటాయి. మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. సహోద్యోగులతో విందులు, వినోదాల్లో పాల్గొంటారు.
 
కన్య :- ఇంట పెద్దమొత్తంలో ధనం, నగలు ఉంచుకోవటం క్షేమంకాదని గమనించండి. అనుకున్న పనులు సకాలంలో పూర్తి కావటంతో నిశ్చింతకు లోనవుతారు. విద్యార్థులు క్రీడలు, క్విజ్ పోటీల్లో రాణిస్తారు. బంధు మిత్రులు ఒత్తిడి, మొహమ్మాటాలకు గురి చేస్తారు. నిర్మాణ పనులలో కాంట్రాక్టర్లు, బిల్డర్లకు ఏకాగ్రత ముఖ్యం.
 
తుల :- పుణ్యక్షేత్ర సందర్శనాలకు అనుకూలం. మిత్రులతో కలిసి ఉల్లాసంగా గడుపుతారు. స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్ రంగాల వారికిమిశ్రమ ఫలితం. కుటుంబంలో స్త్రీల ఆధిపత్యం కొనసాగుతుంది. వాహనచోదకులకు ఊహించని చికాకులు తలెత్తుతాయి. దూరపు బంధువుల నుంచి అందిన ఆహ్వానం ఆశ్చర్యం కలిగిస్తుంది.
 
వృశ్చికం :- కలప, సిమెంటు, ఐరన్, ఇటుక వ్యాపారులకు మిశ్రమ ఫలితం. అతిథి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు. మీ వాహనం ఇతరులకిచ్చి ఇబ్బందులకు గురవుతారు. మీ అభిరుచులకు తగినవిధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించండి. 
 
ధనస్సు :- బంధువులను కలుసుకుంటారు. మీ సంతానం విపరీత ధోరణి చికాకు పరుస్తుంది. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణాలు మంచిది కాదని గమనించండి. సోదరీ, సోదరులు సన్నిహితులతో ప్రయాణాలు ఉల్లాసం కలిగిస్తాయి. రాజకీనాయకులు సభ, సమావేశాలలో పాల్గొంటారు. ముఖ్యుల కోసం షాపింగ్ చేస్తారు.
 
మకరం :- మీ అవసరాలకు కావలసిన ధనం ఆత్మీయుల ద్వారా సర్దుబాటు కాగలదు. భాగస్వామిక చర్చల్లో కొంత పురోగతి కనిపిస్తుంది. ఆలయాలను సందర్శిస్తారు. కుటుంబములోని కొన్ని వ్యవహారాలు మీ ప్రమేయం లేకుండానే జరుగుతాయి. స్త్రీలకు షాపింగ్లోను, వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత అవసరం.
 
కుంభం :- మీ జీవితభాగస్వామి పట్ల సౌమ్యంగా వ్యవహరించండి. ఆకస్మిక ఖర్చులెదురైనా సమయానికి ధనం సర్దుబాటు కాగలదు. విద్యార్థులకు, స్త్రీలకు విదేశీ వస్తువులపట్ల ఆసక్తి పెరుగుతుంది. ఉపాధ్యాయులు విశ్రాంతికై చేయుయత్నాలు ఫలిస్తాయి. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది.
 
మీనం :- మీ సంతానం మొండివైఖరి చికాకు కలిగిస్తుంది. స్త్రీలు తమ వాక్చాతుర్యంతో అనుకున్నది సాధిస్తారు. వైవాహిక జీవితంలో అనుకోని చికాకులు తలెత్తుటకు ఆస్కారం ఉంది జాగ్రత్త వహించండి. బంధువుల మధ్య అపోహలు తొలగిపోయి ఆప్యాయతలు మరింత బలపడతాయి. ఎదుటివారితో ముక్తసరిగా సంభాషిస్తారు.