గురువారం, 25 జులై 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

20-05-202 సోమవారం దినఫలాలు - ఒక స్థిరాస్తి కొనుగోలు అనుకూలిస్తుంది...

Weekly Astrology
శ్రీ క్రోధినామ సం|| వైశాఖ శు॥ ద్వాదశి ప.3.00 చిత్త తె.5.09 ప.11.34 ల 1.19. ప.దు. 12.21 ల 1.12, పు. దు. 2. 54 ల 3. 44.
 
మేషం :- ఉద్యోగస్తులకు స్థానమార్పిడి, కొత్త బాధ్యతలు చేపట్టే ఆస్కారం ఉంది. కుటుంబీకులు మీ అభిప్రాయాలతో ఏకీభవిస్తారు. సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాలపట్ల ఆసక్తి పెరుగుతుంది. వాదోపవాదాలకు, హామీలకు దూరంగా ఉండటం శ్రేయస్కరం. దైవ సేవా, పుణ్యకార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు.
 
వృషభం :- ఉపాధ్యాయులకు యాజమాన్యం ఒత్తిడి అధికంగా ఉంటుంది. ట్రాన్సుపోర్టు, ఆటోమొబెల్ రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. ఉద్యోగస్తులకు బరువు బాధ్యతలు అధికం కావడంతో శ్రమాధిక్యత తప్పదు. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. పొదుపు ఆవశ్యకతను గుర్తిస్తారు. 
 
మిథునం :- వస్త్ర, బంగారు, వెండి, లోహ వ్యాపారస్తులకు పనివారితో విభేదాలు తలెత్తుతాయి. రేపటి సమస్య గురించి అధికంగా ఆలోచిస్తారు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి కలిసివచ్చే కాలం. మీ సంతానం ఉన్నత విద్య గురించి మంచి మంచి ఆలోచనలు, పథకాలు వేస్తారు. మిమ్మల్ని పొగిడే వారే కానీ సహకరించే వారుండరు.
 
కర్కాటకం :- మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు. వాహనం కొనుగోలుకై చేయుప్రయత్నాలు అనుకూలిస్తాయి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్, ఇన్వెర్టర్ రంగాల్లో వారికి పనిభారం అధికం. మనుషుల మనస్తత్వం తెలిసి మసలుకొనుట మంచిది. పలుకుబడి కలిగిన వ్యక్తులుపరిచయమవుతారు.
 
సింహం :- ఆర్థిక వ్యవహారాలు, ఒప్పందాల్లో సముచిత నిర్ణయం తీసుకుంటారు. ప్రముఖులను కలుసుకుంటారు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. మీ వాక్చాతుర్యంతో అందరినీ ఆకట్టుకుంటారు. ఉద్యోగస్తుల దైనందిన కార్యకలాపాలు ప్రశాంతంగా సాగుతాయి. ఒక్కొసారి మీ జీవిత భాగస్వామి మనస్తత్వం అర్థం చేసుకోవడం కష్టమవుతుంది.
 
కన్య :- రిప్రజెంటేటివ్‌లకు, ప్రైవేటు సంస్థలలోని వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. పెద్దల సలహాను పాటించి మీ గౌరవాన్ని నిలబెట్టుకుంటారు. మీ శ్రీమతి, సంతానం గొంతెమ్మ కోరికలు చికాకు పరుస్తాయి. సభ్యత్వాలు, బాధ్యతలు స్వీకరిస్తారు. రాజకీయ, వైద్య రంగాల వారికి అనుకొని అవకాశాలు లభిస్తాయి.
 
తుల :- విదేశాల్లోని ఆత్మీయులకు ప్రియమైన వస్తువులు అందజేస్తారు. పెద్దమొత్తం నగదుతో ప్రయాణాలు మంచిది కాదు. తలపెట్టిన పనులు అనుకున్న విధంగా పూర్తి కాగలవు. వ్యాపారాభివృద్ధికి కొత్త కొత్త పథకాలు అమలు చేస్తారు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణం మంచిది కాదు. సభలు, సమావేశాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు.
 
వృశ్చికం :- ఆదాయ వ్యయాలు, వ్యాపారాల అభివృద్ధికి చక్కని ప్రణాళికలు రూపొందిస్తారు. ఒక స్థిరాస్తి కొనుగోలు అనుకూలిస్తుంది. కుటుంబ సభ్యులతో స్వల్ప విభేదాలు తలెత్తుతాయి. పత్రికా సిబ్బందికి ఓర్పు, పునఃపరిశీలన ముఖ్యం. సాహస ప్రయత్నాలు విరమించండి. ఆపత్సమయంలో ఆత్మీయులు ఆసరాగా నిలుస్తారు. 
 
ధనస్సు :- జాయింట్ వెంచర్లు, వాణిజ్య ఒప్పందాల్లో ఏకాగ్రత అవసరం. గృహ నిర్మాణాలు, మరమ్మతులు మందకొడిగా సాగుతాయి. స్త్రీల ప్రతిభకు తగిన అవకాశాలు లభిస్తాయి. కోర్టు వ్యవహారాలు విచారణకు వస్తాయి. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం.
 
మకరం :- కిరణా, ఫ్యాన్సీ, నిత్యావసర వస్తు వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు కలిసిరాగలదు. ఖర్చులు, సమయానికి ధనం సర్దుబాటు కాకపోవటం వల్ల ఒకింత ఇబ్బందులు తప్పవు. బంధువుల ఆకస్మిక రాక ఆశ్చర్యం కలిగిస్తుంది. బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తుల పట్ల అవసరం. ఏ వ్యక్తికీ అతి చనువు ఇవ్వటం మంచిదికాదు.
 
కుంభం :- ఆర్థిక విషయాలలో కొంత పురోభివృద్ధి కానవస్తుంది. ఎలక్ట్రానిక్ వస్తువుల పట్ల ఆకర్షితులవుతారు. స్థిర బుద్ధి లేకపోవడం వల్ల ఇబ్బందులను ఎదుర్కుంటారు. రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు చోటు చేసుకుంటాయి. వాహనం నడుపునపుడు మెళుకువ అవసరం. సోదరీ, సోదరుల మధ్య విభేదాలు తలెత్తుతాయి.
 
మీనం :- ఏ.సి. కూలర్లు మెకానికల్ రంగాలలోవారికి సంతృప్తి కానవచ్చును. మిమ్మల్ని చూసి అసూయపడేవారు అధికమవుతున్నారు గమనించడం. ఎవరికైనా ధన సహాయం చేసినా తిరిగిరాజాలదు. నేడు చేజారిన అవకాశం రేపు కలిసివస్తుంది. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధవహించండి.