గురువారం, 20 జూన్ 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

15-05-202 బుధవారం దినఫలాలు - డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది...

Astrology
శ్రీ క్రోధినామ సం|| వైశాఖ శు॥ సప్తమి ఉ.5.51 ఆశ్రేష సా.4.57 ఉ.శే.వ.6.36కు ప.దు. 11.31 ల 12.22.
 
మేషం :- స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల వారికి సంతృప్తి, పురోభివృద్ధి కానవస్తుంది. భాగస్వామిక వ్యాపారాలు, జాయింట్ వెంచర్లకు సంబంధించిన వ్యవహరాలు అనుకూలిస్తాయి. మీ పాత సమస్యలు పరిష్కార దిశగా పయనిస్తాయి. ఉద్యోగస్తుల సమర్థతను అధికారులు గుర్తిస్తారు. ఇచ్చిపుచ్చుకునే వ్యవహరాల్లో ఏకాగ్రత వహించండి. 
 
వృషభం :- వ్యాపారాభివృద్ధికి చేయుకృషిలో మంచి ఫలితాలుంటాయి. రుణ విముక్తులు కావటానికి చేసే యత్నాలు ఫలిస్తాయి. గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. నిర్మాణ పనులలో కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు పనివారలతో సమస్యలు తలెత్తుతాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనులు సానుకూలమవుతాయి.
 
మిథునం :- గృహంలో ఏదైనా వస్తువు పోయేందుకు ఆస్కారం ఉంది, మెళకువ వహించండి. చిన్న తరహా, కుటీర పరిశ్రమలు, చిరు వ్యాపారులకు మిశ్రమ ఫలితం. ఎదుటివారి తీరును గమనించి తదనుగుణంగా వ్యవహరించంటం మంచిది. స్త్రీలకు ఆరోగ్యపరమైన చికాకులు తప్పవు. ఖర్చులు అధికమవుతాయి.
 
కర్కాటకం :- చేపట్టిన పనులలో స్వల్ప అవరోధాలు ఎదుర్కుంటారు. రావలసిన ఆదాయం గురించి ఆందోళన చెందుతారు. పారిశ్రామిక రంగంలో వారికి ఒత్తిడి పెరుగుతుంది. ట్రాన్సుపోర్టు, మెకానికల్ ఆటోమొబైల్ రంగాలలో వారికి సంతృప్తి కనవస్తుంది. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. ఆలయాలను సందర్శిస్తారు.
 
సింహం :- డిపాజిట్ల సొమ్ము చేతికందుతుంది. మీ అవసరాలకు తాకట్టు పెడతారు. చేపట్టిన పనుల పట్ల ఆసక్తి అంతగా ఉండదు. స్త్రీల మాటకు మంచిస్పందన లభిస్తుంది. స్థిరాస్తి నుంచి ఆదాయం వస్తుంది. మొండిబాకీలు వసూలు కాగలవు. బంధువులను కలుసుకుంటారు. వృత్తి పరంగా ఎదురైన సమస్య తొలగిపోతాయి.
 
కన్య :- బంధువుల తాకిడి పెరుగుతుంది. దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కార్యసాధనకు ఓర్పు, పట్టుదల ముఖ్యం. కొన్ని విషయాలలో తెలివిగా వ్యవహరిస్తున్నామనుకుని తప్పటడుగు వేస్తారు. రాబడి బాగున్నప్పటికీ ఏదో ఒక ఖర్చు తగలటంతో పొదుప సాధ్యం కాదు. పెద్దల ఆరోగ్యములో మెళుకువ అవసరం.
 
తుల :- స్త్రీలు టి.వి., ఛానల్స్ కార్యక్రమాలలో రాణిస్తారు. ఉద్యోగ వ్యాపారాల్లో ఒడిదుడుకులను అధికమిస్తారు. వాహనచోదకులకు ఊహించని సమస్యలు ఎదురవుతాయి. విద్యార్థులు విదేశీ చదువుల కోసంచేసే యత్నాల్లో సఫలీకృతులవుతారు. ఆస్థి వ్యవహారాలకు సంబంధించి సోదరులతో ఒక అవగాహన కుదురుతుంది.
 
వృశ్చికం :- ఏజెంట్లకు, బ్రోకర్లకు శ్రమాధిక్యత మినహా ఆదాయం అంతంత మాత్రంగానే ఉంటుంది. ఉపాధ్యాయులకు ప్రమోషన్లు, కోరుకున్న చోటికి 
బదిలీలు వంటి శుభపరిణామాలుంటాయి. పారిశ్రామికరంగాల వారికి అన్ని విధాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. శస్త్రచికిత్సల సమయంలో వైద్యులకు ఏకాగ్రత అవసరం.
 
ధనస్సు :- దైవ సేవా కార్యక్రమాలలో పాల్గొంటారు. కిరాణా, ఫ్యాన్సీ, మందులు, పానీయ, ఆల్కహాలు వ్యాపారస్తులకు పురోభివృద్ధి. ఏ పని తలపెట్టినా తిరిగి మొదటికే వస్తుంది. వ్యాపారాల్లో మొహమ్మాటాలకు తావివ్వకండి. బ్యాంకు లావాదేవీలు, రుణ ప్రయత్నాలకు అడ్డంకులు ఎదురయ్యే అవకాశం ఉంది. 
 
మకరం :- ఉద్యోగస్తులు నూతన బాధ్యతలు చేపట్టే ఆస్కారం ఉంది. ఖర్చులు పెరగడంతో రుణయత్నాలు, చేబదుళ్ళు తప్పవు. నూతన వస్తువులను అమర్చుకుంటారు. ప్రముఖులను కలుసుకుంటారు. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువుల పట్ల మక్కువ పెరుగుతుంది. బంధువుల నుంచి ఒత్తిడి, మొహమ్మాటాలు ఎదుర్కుంటారు.
 
కుంభం :- ఆర్థిక విషయాల్లో ఒకడుగు ముందుకు వేస్తారు. ఓ మంచి వ్యక్తి అభిమానాన్ని పొందుతారు. నిరుద్యోగుల ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఉద్యోగస్తులకు తోటివారి సహాయ సహకారాలు లభిస్తాయి. రచయితలకు పత్రికా రంగాల వారికిచికాకులు తప్పవు. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి కలిసివచ్చేకాలం.
 
మీనం :- బ్యాంకు వ్యవహారాలలో అపరిచిత వ్యక్తులపట్ల మెళకువ అవసరం. దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. గతంలో నిలిపి వేసిన వ్యాపారాలు, పనులు పునఃప్రారంభించటానికి చేసే యత్నాలు ఫలిస్తాయి. నూతన ప్రదేశ సందర్శనల పట్ల ఆసక్తి పెరుగుతుంది. నిర్మాణ పనులలో జాప్యం, అధిక వ్యయం వల్ల ఆందోళనకు గురవుతారు.