1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

11-05-2024 శనివారం దినఫలాలు - ఉద్యోగ, విదేశీయాన యత్నాలు అనుకూలిస్తాయి...

astro12
శ్రీ క్రోధినామ సం|| వైశాఖ శు॥ చవితి తె.4.26 మృగశిర ప.12.29 రా.వ.9.01 ల 10.39. ఉ.దు.5.37 ల 7.18.
 
మేషం : హోటల్, తినుబండారాలు, క్యాటరింగ్ పనివారలకు సదావకాశాలు లభిస్తాయి. స్థిరాస్తి క్రయవిక్రయాలకు సంబంధించి ప్రముఖులతో సంప్రదింపులు జరుపుతారు. రాబడి పెంచుకునే మార్గాలపై దృష్టి సారిస్తారు. మీ సంతానం, కళత్ర మొండివైఖరి వల్ల కుటుంబంలో కలహాలు, చికాకులు అధికమవుతాయి. 
 
వృషభం :- నూతన పెట్టుబడులు పెట్టునపుడు మెళకువ వహించండి. విద్యార్థినులు ప్రేమికుల వల్ల మోసపోయే ఆస్కారంఉంది. స్వర్ణకార పనివారలు, వ్యాపారులకు ఊహించని చికాకులెదురవుతాయి. మిత్రులతో ఉల్లాసంగా గడుపుతారు. నిరుద్యోగులకు సన్నిహితుల ద్వారా అందిన ఒక సమాచారం ఎంతో ఉపకరిస్తుంది.
 
మిథునం :- ఇతరుల విషయాల్లో అతిగా వ్యవహరించటం వల్ల మాటపడక తప్పదు. ఖర్చులు, చెల్లింపులు ప్రయోజనకరం. మందులు, కిరాణా, ఫ్యాన్సీ వ్యాపారస్తులకు మంచి లాభదాయకంగా ఉంటుంది. మీ బంధువుల కారణంగా మాటపడవలసివస్తుంది. ఉద్యోగ స్తులు అంకితభావంతో పనిచేసి అధికారులను మెప్పిస్తారు.
 
కర్కాటకం :- ఉపాధ్యాయులకు నూతన అవకాశాలు లభిస్తాయి. ఉద్యోగ, విదేశీయాన యత్నాలు అనుకూలిస్తాయి. కొత్త ప్రదేశ సందర్శనలు, దైవదర్శనాలు ఉత్సాహాన్నిస్తాయి. ఏదైనా స్థిరాస్తి అమ్మకం చేయాలనే మీ ఆలోచన నెరవేరుతుంది. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానికల్స్, కంప్యూటర్, సాంకేతిక రంగాల వారికి కలిసివస్తుంది.
 
సింహం :- ఆర్థిక విషయాలలో కొన్ని ఒడిదుడుకులు ఎదుర్కొన్నప్పటికీ ముఖ్యుల సహకారం వలన సమసిపోతాయి. బంధువుల నుంచి ఒక ముఖ్య సమాచారం అందుతుంది. బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. సంఘంలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. అదనపు సంపాదన పట్ల దృష్టిసారిస్తారు.
 
కన్య :-శుత్రువులు మిత్రులుగా మారతారు. దైవకార్యాల్లో చురుకుగా వ్యవహరిస్తారు. సమయానికి కావలసిన వస్తువు కనిపించకపోయే ఆస్కారం ఉంది. కిరాణా, ఫ్యాన్సీ, మందులు, రసాయన సుగంధ ద్రవ్య వ్యాపారులకు పురోభివృద్ధి. భాగస్వామిక చర్చలు వాయిదా పడతాయి. మీ సంతానం కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు.
 
తుల :- మీ ఆర్థిక పరిస్థితులు ఎలాంటి ఒడిదుడుకులకు లోనుకాకుండా సాఫీగా సాగిపోతాయి. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. పాత అలవాట్లకు స్వస్తి చెప్పి నూతన జీవితాన్ని ప్రారంభించండి. విద్యార్థులకు వాహనం నడుపుతున్నపుడు ఏకాగ్రత ముఖ్యం. ఆపద సమయంలో సన్నిహితులు అండగా నిలుస్తారు.
 
వృశ్చికం :- ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతలు, పనిభారం వంటి చికాకులు అధికం. ఆస్తి పంపకాల విషయంలో సోదరులతో ఒప్పందం కుదుర్చుకుంటారు. ప్రయాణాల్లో కొంత అసౌకర్యానికి గురవుతారు. రవాణా, ఆటోమొబైల్, మెకానికల్ రంగాల వారికి చికాకులు అధికమవుతాయి. స్త్రీలకు ఆరోగ్యంలో చికాకులు తప్పవు.
 
ధనస్సు :- గృహ మరమ్మతుల వ్యయం మీ అంచనాలను మించుతుంది. దంపతుల మధ్య కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ఆదాయ వ్యయాలు మీ బడ్జెట్కు విభిన్నంగా ఉంటాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. స్త్రీలకు వస్త్రప్రాప్తి, వాహనయోగం వంటి శుభఫలితాలున్నాయి. మీ అవసరాలు, కోరికలు వాయిదా వేసుకోవలసివస్తుంది.
 
మకరం :- ఆర్థిక లావాదేవీలు అనుకూలిస్తాయి. నిరుద్యోగులు ప్రకటనల పట్ల ఆకర్షితులవుతారు. అనుభవజ్ఞులైన పెద్దల సలహాలను పాటించటం వల్ల ఒక సమస్య నుంచి క్షేమంగా బయటపడతారు. అనుకున్న లక్ష్యం సాధించడంతో మానసిక ప్రశాంతతను పొందుతారు. వృత్తులు, ప్రింటింగ్ రంగాల వారికి లాభదాయకం.
 
కుంభం :- దైవ కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ చిన్నారుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. సన్నిహితుల రాక సంతోషం కలిగిస్తుంది. తలపెట్టిన పనులు మందకొడిగా పూర్తి చేస్తారు. ఉదోగ్య రీత్యా దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి మార్పులు అనుకూలిస్తాయి.
 
మీనం :- పారిశ్రామిక రంగాల్లో వారికి ప్రతికూల వాతావరణం నెలకొని ఉంటుంది. తాపీపనివారు, నిరుద్యోగులు తొందరపాటు తనంవల్ల సదావకాశాలు జారవిడుచుకుంటారు. రాజకీయ నాయకులు తరచూ సభలు, సమావేశాలలో పాల్గొంటారు. ఊహించని ఖర్చుల వల్ల ఒకింత ఒడిదుడుకులు ఎదుర్కుంటారు.