సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

10-05-2024 శుక్రవారం దినఫలాలు - సంఘంలో మీ గౌరవప్రతిష్టలు ఇనుమడిస్తాయి...

astro11
శ్రీ క్రోధినామ సం|| వైశాఖ శు॥ విదియ తె.5.45 తదియ తె.4.55 రోహిణి ప.12.35. ఉ.శే.వ.6.19కు సా. 6. 10ల 7.45 ఉ.దు. 8.08 ల 8. 59 ప. దు. 12.21 ల 1.11.
 
మేషం :- కొన్ని పనులు విసుగు కలిగించినా మొండిగా పూర్తి చేస్తారు. మీ శ్రీమతి ఆకస్మిక ప్రయాణం నిరుత్సాహం కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు అదనపు బాధ్యతల నుంచి విముక్తి లభిస్తుంది. వైద్య రంగాల్లో వారు శస్త్రచికిత్సలు చేయునపుడు మెళకువ అవసరం. మీ కందిన చెక్కులు చెల్లక ఇబ్బందులెదుర్కుంటారు.
 
వృషభం :- పెద్దమొత్తం ధనంతో ప్రయాణాలు క్షేమం కాదని గమనించండి. పోస్టల్, టెలిగ్రాఫ్ రంగాల్లో వారికి ఒత్తిడితప్పదు. రాజకీయాల్లో వారికి ప్రత్యర్థులతో అప్రమత్తత అవసరం. మీ సంతానం విద్యా విషయాల పట్ల ప్రత్యేక శ్రద్ధ వహిస్తారు. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు. 
 
మిథునం :- ప్రయాణ లక్ష్యం నెరవేరుతుంది. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత ఎంతో ముఖ్యం. గృహానికి కావలసిన వస్తువులను సమకూర్చుకుంటారు. ప్రేమికులకు పెద్దలతో సమస్యలు తలెత్తే ఆస్కారంఉంది. రాజకీయాల్లో వారికి ఒత్తిడి, చికాకులు అధికం. శ్రమాధిక్యత, అకాల భోజనం వల్ల అస్వస్థతకు గురవుతారు.
 
కర్కాటకం :- రచయితలకు, పత్రికా రంగంలో వారికి ప్రోత్సాహకరం. షాపింగ్ వ్యవహరాల్లో ఏకాగ్రత అవసరం. బంధు మిత్రుల కోసం ధనం విరివిగా వ్యయం చేస్తారు. భాగస్వామిక చర్చలు, ఆస్తి వ్యవహారాలు వాయిదా పడటం మంచిది. ముఖ్యుల పట్ల ఆరాధన పెరుగుతుంది. చిన్ననాటి వ్యక్తుల కలయిక సంతోషం కలిగిస్తుంది.
 
సింహం :- స్టేషనరీ, ఫ్యాన్సీ, సుగంధ ద్రవ్య వ్యాపారులకు కలిసి వచ్చేకాలం. కోర్టు వ్యవహారాల్లో ఫ్లీడర్ల ధోరణి ఆందోళన కలిగిస్తుంది. మీపై శకునాలు, ఇతరుల వ్యాఖ్యల ప్రభావం అధికమవుతుంది. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. చేపట్టిన పనులు విసుకుగు కలిగించినా మొండిగా పూర్తి చేస్తారు.
 
కన్య :- ఇంటికి చిన్న చిన్న మరమ్మత్తులు చేయించే అవకాశం ఉంది. నూతన ప్రదేశ సందర్శనల పట్లఆసక్తి పెరుగుతుంది. వాహన చోదకులకు ఏకాగ్రత ప్రధానం. స్త్రీలకు ఆరోగ్య సంతృప్తి, శారీరక పటుత్వం నెలకొంటాయి. నిరుత్సాహం వీడి ఉద్యోగయత్నాలు సాగించండి. రాబోయే ఖర్చులను తలుచుకుని ఆందోళన చెందుతారు.
 
తుల :- గృహోపకరణాలను అమర్చుకోవటంలో మునిగిపోతారు. స్త్రీలు నరాలు, ఉదరానికి సంబంధించిన చికాకులను ఎదుర్కుంటారు. ఆలయ సందర్శనాలలో ఇబ్బందులను ఎదుర్కొంటారు. హోటల్, తినుబండారాలు, కేటరింగ్ రంగాలలో వారికి పురోభివృద్ధి కానవస్తుంది. భార్యా, బిడ్డలతో స్వల్పంగా మనస్ఫర్థలు తలెత్తగలవు.
 
వృశ్చికం :- స్త్రీలకు తమ మాటే నెగ్గాలన్న పట్టుదల అధికమవుతుంది. సమయానికి కావలసిన వస్తువు కనిపించకపోయే ఆస్కారం ఉంది. మీపై వచ్చిన నిందలను పోగొట్టుకోవటానికి బాగా శ్రమించాలి. పెంపుడు జంతువుల గురించి ఆందోళన చెందుతారు. రవాణా రంగంలోని వారికి చికాకులు అధికమవుతాయి.
 
ధనస్సు :- వ్యాపారాల్లో ఆటంకాలు అధిగమించటంతో పాటు అనుభవం గడిస్తారు. ఉద్యోగస్తులకు మార్పులకై చేయుప్రయత్నాలు అనుకూలించవు. రాజకీయనాయకులకు ప్రయాణాలలో మెళుకువ అవసరం. శత్రువులు మిత్రులుగా మారతారు. చేపట్టిన పనులలో స్త్రీలు ఒత్తిడి, శ్రమాధిక్యత ఎదుర్కుంటారు.
 
మకరం :- ఆదాయ వ్యాయలు సమానంగా ఉంటాయి. బ్యాంక్ వ్యవహారాలు మందకోడిగా సాగుతాయి. కోళ్ళ, మత్స, పాడి పరిశ్రమల వారికి సామాన్యంగా ఉంటుంది. ఒక కార్యం నిమిత్తం ఆకస్మికంగా ప్రయాణం చేస్తారు. సంఘంలో మీ గౌరవప్రతిష్టలు ఇనుమడిస్తాయి. స్త్రీలకు ఆరోగ్య విషయంలో నిర్లక్ష్యం కూడదు.
 
కుంభం :- ప్రముఖుల ప్రమేయంతో ప్రభుత్వ కార్యాలయాల్లోని పనులు సానుకూలమవుతాయి. ఉద్యోగస్తుల దైనందిన కార్యకలాపాలు యధావిధిగా సాగుతాయి. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, ప్రోత్సాహం లభిస్తాయి. దీర్ఘకాలిక పెట్టుబడుల విషయంలో ఒక నిర్ణయానికి వస్తారు. గతంలో ఆగిపోయిన పనులు పునఃప్రారంభిస్తారు.
 
మీనం :- రిప్రజెంటేటివ్‌లకు సదావకాశాలు లభిస్తాయి. పన్నులు, బీమా, బిల్లులు పరిష్కారం అవుతాయి. శాస్త్ర, సాంకేతిక రంగాల వారికి సదావకాశాలు లభిస్తాయి. ప్రయాణాల్లో కొంత అసౌకర్యానికి గురవుతారు. ఉద్యోగస్తులకు విధినిర్వహణలో ఏకాగ్రత ఎంతో ముఖ్యం. ప్రభుత్వ సంస్థల్లో వారు జాప్యం, ఒత్తిడి ఎదుర్కొనక తప్పదు.