ఆదివారం, 22 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

09-05-2024 గురువారం దినఫలాలు - విద్యార్థులకు క్రీడలపట్ల ఆసక్తి...

astro10
శ్రీ క్రోధినామ సం|| వైశాఖ శు॥ పాఢ్యమి ఉ.7.09 కృత్తిక ప.1.06 తె.వ.4.45 ల ఉ.దు. 9.50 ల 10.40 ప. దు. 2. 53 ల 3.43. 
 
మేషం :- రుణ చెల్లింపులకై చేయుయత్నాలు ఫలిస్తాయి. తలపెట్టిన పనులు త్వరితగతినపూర్తి చేస్తారు. దంపతులకు ఏ విషయంలోను పొత్తు కుదరదు. కాంట్రాక్టర్లకు, బిల్డర్లకు అన్ని విధాలా కలసిరాగలదు. పండ్లు, పూలు, చల్లనిపానీయ వ్యాపారులకు కలిసిరాగలదు. మీ వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులకు గురికాకండి.
 
వృషభం :- ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు పలుమార్లు తిరగవలసి ఉంటుంది. స్త్రీల ఆంతరంగిక వ్యవహారాలు బయటకు వ్యక్తం చేయటం వల్ల ఇబ్బందులు తప్పవు. విద్యా సంస్థలలోనివారికి ఒత్తిడి, పెరుగుతుంది. భార్యా, భర్తల మధ్య అవగాహన లోపిస్తుంది. ప్లీడర్లకు, ప్లీడరు గుమస్తాలకు సామాన్యం.
 
మిథునం :- మీ వాక్చాతుర్యానికి, తెలివితేటలకు మంచి గుర్తింపు లభిస్తుంది. విద్యార్థులకు క్రీడలపట్ల ఆసక్తి పెరుగుతుంది. ప్రయాణాల్లోను, బ్యాంకింగ్ వ్యవహారాల్లో మెళకువ వహించండి. హోదాలు, పదవీయోగాలు దక్కే సూచనలు ఉన్నాయి. రిప్రజెంటేటివ్‌లకు, ప్రైవేటు సంస్థలలోని వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది.
 
కర్కాటకం :- బ్యాంకు రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. రాజకీయ కళా రంగాల వారికి విదేశీ పర్యటనలు. ప్రముఖుల కలయిక ప్రయోజనకరంగా ఉంటాయి. ఏదైనా స్థిరాస్తి కొనుగోలు, అమ్మకం దిశగా మీ ఆలోచనలుంటాయి. ఏదైనా స్థిరాస్తి కొనుగోలు, అమ్మకం దిశగా మీ ఆలోచనలుంటాయి.
 
సింహం :- పారిశ్రామిక రంగంలోని వారికి కార్మిక, విద్యుత్ వంటి సమస్యలను ఎదుర్కొంటారు. మిమ్ములను కలవరపరిచిన సమస్య తేలికగా పరిష్కారమవుతుంది. భాగస్వామిక వ్యాపారాలు, జాయింట్ వెంచర్లు ఆశించినంత లాభదాయకంగా సాగవు. గృహంలో ప్రతి వ్యవహారం మీ ఇష్టానికి అనుగుణంగా సాగుతుంది.
 
కన్య :- నిరుద్యోగులకు ఇంటర్వ్యూ సమాచారం అందుతుంది. తలపెట్టిన పనులు వేగవంతంగా పూర్తిచేస్తారు. చిట్స్, ఫైనాన్స్ రంగాల్లో వారికి ఒత్తిడి, చికాకులు అధికమవుతాయి. కుటుంబీకుల మధ్య అనురాగవాత్సల్యాలు పెంపొందుతాయి. మీ అభిరుచులకు తగిన విధంగా కుటుంబ సభ్యులు మసలుకుంటారు.
 
తుల :- బ్యాంకు పనుల్లో ఒత్తిడి, హాడావుడి వంటివి ఎదుర్కుంటారు. పెద్దల ఆరోగ్య విషయంలో మెళకువ అవసరం. ఉద్యోగస్తు నిరాసక్తత కారణంగా అధికారులతో మాటపడతారు. ఒక స్థిరాస్తి విక్రయించాలనే ఆలోచన విరమించుకోవటం ఉత్తమం. కొత్తగా చేరిన పనివారల విషయంలో జాగ్రత్త వహించండి.
 
వృశ్చికం :- పండ్లు, పూలు, కొబ్బరి, చల్లని పానీయ వ్యాపారులకు కలిసివచ్చే కాలం. ఏ విషయంలోనూ ఒంటెత్తుపోకడ మంచిది కాదు. అధికారులకు మీరంటే ప్రత్యేకాభిమానం ఏర్పడుతుంది. దంపతుల మధ్య సంతానం పై చదువుల విషయం ప్రస్తావనవస్తుంది. విద్యార్థులకు పోటీ పరీక్షలలో ఏకాగ్రత అవసరం.
 
ధనస్సు :- మిమ్ములను వ్యతిరేకించిన వారే మీ సాన్నిత్యం కోరుకుంటారు. ఉన్నతాధికారులు హోదా పెరిగే సూచనలున్నాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాగలవు. కోర్టు వ్యవహారాలు వాయిదాపడటం ఒకందుకు మంచిదేనని గమనించండి. వ్యాపార రంగాల వారికి అధికారుల తనిఖీలు, పనివారల నిర్లక్ష్యం ఆందోళన కలిగిస్తాయి.
 
మకరం :- విదేశాల్లోని ఆత్మీయులకు ప్రియమైన వస్తువులు అందజేస్తారు. ఆదాయ వ్యయాలు సరిసమానంగా ఉంటాయి. ఫిక్సెడ్ డిపాజిట్లు, స్థిరచరాస్తుల మూలక ధనం అందుతుంది. ప్రియతముల రాక, చిన్ననాటి వ్యక్తుల కలయిక సంతోషం కలిగిస్తుంది. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి.
 
కుంభం :- ఆర్థిక, కుటుంబ సమస్యలు ఒక కొలిక్కి వస్తాయి. బ్యాంకుల్లో మీ పనుల్లో స్వల్ప ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. స్త్రీలు టీ.వీ కార్యక్రమాల్లో రాణిస్తారు. వ్యాపారాల అభివృద్ధికి చేపట్టిన స్కీములు మంచి ఫలితాలిస్తాయి. పెద్దల ఆరోగ్యం కుదుటపడుతుంది. ఏజెంట్లు, బ్రోకర్లు, వృత్తుల వారికి శ్రమించిన కొలదీఆదాయం.
 
మీనం :- మీ శ్రీమతి, సంతానం గొంతెమ్మకోరికలు చికాకు పరుస్తాయి. సోదరుల మధ్య సత్సంబంధాలు నెలకొంటాయి. క్రయ విక్రయాలు సామాన్యంగా ఉంటాయి. వివాదాస్పద విషయాలకు దూరంగా ఉండాలి. తలపెట్టిన పనుల్లో ఒత్తిడి, ఆటంకాలు ఎదుర్కుంటారు. నిరుద్యోగులకు ఉద్యోగ నియామక పత్రాలు అందుతాయి.