శుక్రవారం, 3 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

04-05-202 శనివారం దినఫలాలు - సోదరీ, సోదరులతో ఏకీభావం కుదరదు...

astro4
శ్రీ క్రోధినామ సం|| చైత్ర బ॥ ఏకాదశి సా.6.04 పూర్వాభాద్ర రా.7.55 ఉ.వ.8.44 ల 10.14 రా.వ.1.53 ల 3.22. ఉ.దు.5.37 ల 7.18.
 
మేషం :- ఆర్ధిక పరిస్థితి ప్రోత్సాహకరం. వ్యాపారాభివృద్ధికి అహర్నిశలు శ్రమిస్తారు. ప్రముఖుల కలయిక సాధ్యం కాదు. విద్యార్థినులకు ప్రేమ వ్యవహరాల్లో భంగపాటు తప్పదు. టి.వి., మీడియా రంగాలలో వారికి ఒత్తిడి పెరుగుతుంది. సోదరీ, సోదరులతో ఏకీభావం కుదరదు. ఉత్తర, ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి.
 
వృషభం :- స్త్రీలు భేషజాలకు పోకుండా లౌక్యంగా వ్యవహరించాల్సి ఉంటుంది. రిప్రజెంటేటివులకుఅధిక శ్రమ, చికాకులు తప్పవు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. ప్రేమికుల ఆలోచనలు పెడదోవపట్టే ఆస్కారంఉంది. ఆకస్మిక ఖర్చుల వల్ల ఒకింత ఒడిదుడుకులు తప్పవు. ఆకస్మిక ఖర్చులు, తప్పనిసరి చెల్లింపులు ఇబ్బంది కలిగిస్తాయి. 
 
మిథునం :- ఎలక్ట్రానిక్స్, కంప్యూటర్ రంగాల వారికి సదవకాశాలు లభిస్తాయి. రచయితలకు పత్రికా రంగాల వారికి చికాకులు తప్పవు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత అవసరం. నూతన దంపతులకు శుభదాయకం. గృహంలో శుభకార్యానికై చేయు యత్నాలు ఫలిస్తాయి. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు.
 
కర్కాటకం :- ఉద్యోగస్తులు సమర్థంగా పనిచేసి అధికారులను మెప్పిస్తారు. అథ్యాత్మిక చింతన పెరుగుతుంది. ఖాదీ, చేనేత, నూలు వస్త్ర వ్యాపారులకు పురోభివృద్ధి. విదేశీయానం కోసం చేసే యత్నాల్లో సఫలీకృతులవుతారు. స్థిరాస్తి క్రయ విక్రయాల్లో పునరాలోచన అవసరం. నిరుద్యోగులకు సదవకాశాలు లభిస్తాయి.
 
సింహం :- కళా, క్రీడాకారులకు శుభదాయకం. మీ విషయాల్లో ఇతరుల జోక్యం మంచిది కాదు. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. చేతి వృత్తుల వారికి ఆశాజనకం. స్త్రీలకు వస్త్ర, ఆభరణాల కొనుగోలు విషయంలో మెలకువ అవసరం. స్టేషనరీ, ప్రింటింగ్ రంగాల్లో వారికి కలిసిరాగలదు.
 
కన్య :- రచయితలకు పత్రికా రంగాల వారికి చికాకులు తప్పవు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలలో ఏకాగ్రత అవసరం. కొత్తగా చేపట్టిన వ్యాపారాల్లో క్రమేణా నిలదొక్కుకుంటారు. గృహంలో శుభకార్యానికైచేయు యత్నాలు ఫలిస్తాయి. ప్రయాణాల్లో కొంత అసౌకర్యానికి గురవుతారు. దీర్ఘకాలిక రుణాలు తీరి ఊరట చెందుతారు.
 
తుల :- ఏ.సి. కూలర్లు మెకానికల్ రంగాలలోవారికి సంతృప్తి కానవచ్చును. ఒకరికి సహాయం చేసి మరొకరి ఆగ్రహానికి గురవుతారు. వృత్తి, వ్యాపారులకు సమస్యలెదురైనా ఆదాయానికి కొదవ ఉండదు. ఆరోగ్యములో చిన్న చిన్న చికాకులు తప్పవు. డాక్టర్లకు లాభదాయకం, ఆడిటర్లకు పనిభారం పెరుగుతుంది.
 
వృశ్చికం :- ప్రభుత్వ సంస్థల్లో వారు జాప్యం, ఒత్తిడి ఎదుర్కొనక తప్పదు. నూతన ప్రదేశ సందర్శనల పట్ల ఆసక్తి పెరుగుతుంది. నిర్మాణ పనులలో జాప్యం వంటివి తప్పదు. విద్యార్థులకు దూర ప్రాంతాల నుంచి ఉన్నత విద్యావకాశాలు లభిస్తాయి. దైవ, సేవా, సాంఘిక కార్యక్రమాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు.
 
ధనస్సు :- ఉద్యోగస్తులకు అందిన ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది. దంపతులకు ఏ విషయంలోను పొత్తు కుదరదు. షామియాన, సప్లయ్ రంగాలలో వారికి గణనీయమైన పురోభివృద్ధి కానవస్తుంది. కోర్టు వ్యవహరాలు కొత్త మలుపు తిరుగుతాయి. సన్నిహితులను కలుసుకుంటారు. ఆరోగ్యంలో మెళకువ అవసరం.
 
మకరం :- పుణ్యక్షేత్రాలను సందర్శిస్తారు. దూర ప్రయాణాలు అనుకూలిస్తాయి. కలప, ఇటుక, ఐరన్ వ్యాపారులకు అనుకూలం. అదనపు సంపాదన కోసం చేసే యత్నాలు ఫలిస్తాయి. మార్కెటింగ్ రంగాల వారికి, ఏజెంట్లకు, బ్రోకర్లకు యాజమాన్యం నుండి ఒత్తిడి పెరుగుతుంది. చేపట్టిన పనులలో ఏకాగ్రత ఎంతో ముఖ్యం.
 
కుంభం :- ఆర్ధిక లావాదేవీలు అంతంతమాత్రంగా ఉంటాయి. మీ విలువైన వస్తువుల విషయంలో అప్రమత్తత అవసరం. ఉద్యోగస్తులకు ఒక వార్త ఎంతో ఆశ్చర్యం కలిగిస్తుంది. వైద్య రంగాల వారికి చికాకులు అధికమవుతాయి. నూతన వస్తువులు వాహనాలుకొంటారు. స్టాక్ మార్కెట్, రియల్ ఎస్టేట్ రంగాల వారికి ఆందోళన తప్పదు.
 
మీనం :- ఆర్థిక విషయాలలో కొంత పురోభివృద్ధి కానవస్తుంది. కొబ్బరి, పండ్ల, పూల వ్యాపారులకు లాభదాయకం. స్త్రీల తొందరపాటుతనం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. టెక్నికల్, కంప్యూటర్ రంగాలలోని వారికి సత్కాలం. నిరుద్యోగులకు నిరుత్సాహం తప్పదు. స్త్రీలకు వస్త్ర, ఆకస్మిక ధన లాభం వంటి శుభపరిణామాలున్నాయి.