శనివారం, 4 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

13-05-2024 సోమవారం దినఫలాలు - హామీలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమం...

horoscope
శ్రీ క్రోధినామ సం|| వైశాఖ శు॥ షష్టి తె.4.56 పునర్వసు ప.1.44 రా.వ.10.12 ల 11.53. ప.దు. 12.21 ల 1.12, పు. దు. 2. 54 ల 3.44.
 
మేషం :- వస్త్ర, బంగారు, వెండి రంగాల పట్ల ఆసక్తి పెరుగును. ప్రయాణాల వ్యవహారాలలో మెళకువ వహించండి. రాజకీయ నాయకులకు ఊహించని మార్పులు చోటుచేసుకుంటాయి. బంధువులను కలుసుకుంటారు. హామీలు మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండటం క్షేమదాయకం. దంపతుల మధ్య అవగాహనా లోపం తప్పదు.
 
వృషభం :- ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తిన మిత్రుల సహకారం వల్ల సమసిపోగలవు. పోస్టల్, కొరియర్ రంగాల వారు ఒత్తిడి ఎదుర్కొంటారు. క్రీడా, కళా, సాంస్కృక రంగాల పట్ల ఆశక్తి పెరుగుతుంది. స్త్రీలకు చుట్టుపక్కల వారిలో మంచి గుర్తింపు, గౌరవం లభిస్తాయి. సోదరీ, సోదరుల మధ్య ఏకీభావం కుదరదు.
 
మిథునం :- కొత్త కొత్త పథకాలతో కొనుగోలుదార్లను ఆకట్టుకుంటారు. ప్రయాణాల్లో అసౌకర్యానికి లోనవుతారు. వైద్య, ఇంజనీరింగ్, శాస్త్ర, వాణిజ్య రంగాల్లో వారికి ఆశించినంత ఫలితం ఉండదు. ఏదైనా అమ్మకానికై చేయుప్రయత్నాలు ఒక కొలిక్కి రాగలవు. సన్నిహితుల మధ్య రహస్యాలు దాచడం వల్లవిభేదాలు తలెత్తవచ్చు. 
 
కర్కాటకం :- వ్యాపారాల్లో పెరిగిన పోటీ ఆందోళన కలిగిస్తుంది. విదేశాల్లోని ఆత్మీయుల క్షేమసమాచారం తెలుసుకుంటారు. దూర ప్రయాణాలలో బంధు మిత్రులను కలుసుకుంటారు. ఇసుక క్వారీ కాంట్రాక్టర్లకు అధికారులు నుంచి అభ్యంతరాలు ఎదుర్కోవలసి వస్తుంది. రుణ విముక్తులు కావటంతో పాటు తాకట్టులు విడిపించుకుంటారు.
 
సింహం :- ఉద్యోగ విరమణ చేసిన వారికి తోటివారు సాదర వీడ్కోలు పలుకుతారు. సంస్థల నుంచి పారితోషికం అందుతాయి. సోదరులతో ఏకీభవించలేరు. నిరుద్యోగులకు బోగస్ ప్రకటనల పట్ల అప్రమత్తత అవసరం. సన్నిహితుల ఆర్థిక పరిస్థితులు మనస్తాపం కలిగిస్తాయి. ప్రముఖులతో పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి.
 
కన్య :- పట్టుదల, ఓర్పుతోనే అనుకున్నది సాధించగలుగుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తాడు. వైద్య రంగాల వారికి శస్త్రచికిత్సల సమయంలో ఏకాగ్రత ముఖ్యం. గృహ నిర్మాణాలు, మరమ్మతులు మందకొడిగా సాగుతాయి. కొన్ని అనుకోని సంఘటనలు ఇరకాటానికి దారితీస్తాయి. ఆదాయానికి మించిన ఖర్చులున్నా భారమనిపించవు. 
 
తుల :- ఏ.సి, కూలర్లు, ఇన్వెర్టర్ రంగాలలో వారికి శుభదాయకంగా ఉంటుంది. ఆకస్మిక ఖర్చులెదురైనా కావలసిన ధనం సర్దుబాటు కాగలదు. ప్రయాణాలు అనుకూలిస్తాయి. బంధువుల రాకపోకలు పునఃప్రారంభమవుతాయి. చేపట్టిన పనులు సకాలంలో పూర్తి కాగలవు. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి ఏర్పడుతుంది.
 
వృశ్చికం :- కొబ్బరి, పండ్లు, చల్లనిపానీయ వ్యాపారస్తులకు కలసివచ్చేకాలం. ఒక స్థిరాస్తి అమర్చుకోవాలనే మీ కోరిక నెరవేరుతుంది. రియల్ ఎస్టేట్, మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి పెరుగుతుంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. పొదుపు పథకాలు, పెట్టుబడులపై దృష్టి సారిస్తారు. గత తప్పిదాలు పునరావృతమయ్యే ఆస్కారం ఉంది.
 
ధనస్సు :- సందర్భం లేకుండా నవ్వడం వల్ల కలహాలు ఎదుర్కొవలసి వస్తుంది. రాజకీయ, పారిశ్రమిక రంగాలవారికి విదేశీపర్యటనలు అధికమవుతాయి. జీవితభాగస్వామి సలహాలతో ముదుకుసాగుతారు. ఉద్యోగస్తులకు నగదు బహుమతి, ప్రత్యేక ఇంక్రిమెంట్ వంటి శుభపరిణామాలున్నాయి. ఖర్చులు అధికమవుతాయి. 
 
మకరం :- ఉమ్మడి వ్యవహారాలు, ఆర్థిక లావాదేవీల్లో ఏకాగ్రత అవసరం. రచయితలకు, పత్రికారంగంలో వారికి వారి స్థాయి పెరుగుతుంది. దంపతుల మధ్య కొత్త కొత్త ఆలోచనలు స్ఫూరిస్తాయి. డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. ప్రేమికులకు ఎడబాటు, చికాకులు తప్పవు. ప్రముఖులను కలుసుకుంటారు.
 
కుంభం :- ఉద్యోగస్తులకు అధికారుల వైఖరి మనస్తాపం కలిగిస్తుంది. స్త్రీలకు నరాలు, వెన్నెముక, దంతాలకు సంబంధించిన చికాకులు అధికమవుతాయి. మిత్రుల సహాయంతో కొన్ని పనులు పూర్తి చేస్తారు. మితిమీరిన శరీర శ్రమ, అకాల భోజనం వల్ల ఆరోగ్యం మందగిస్తుంది. చేబదుళ్ళ కోసం తీవ్రంగా యత్నాలు సాగిస్తారు.
 
మీనం :- మీ గౌరవానికి భంగం కలుగకుండా మెలగండి. కొత్త వ్యక్తులతో మితంగా సంభాషించండి. భాగస్వామిక సమావేశాలు అర్థాంతంగా ముగుస్తాయి. లీజు, నూతన పెట్టుబడులు, టెండర్ల వ్యవహారాల్లో పునరాలోచన మంచిది. వృత్తుల వారికి శ్రమాధిక్యత మినహా ఆదాయం అంతంత మాత్రంగా ఉంటుంది.