ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

21-05-2023 ఆదివారం రాశిఫలాలు - సూర్య స్తుతి ఆరాధించిన శుభం...

astrolgy
మేషం :- ధనియాలు, ఆవాలు, పసుపు, ఎండుమిర్చి, నూనె వ్యాపారస్తులకు, స్టాకిస్టులకు అనుకూలంగా వుండగలదు. ప్రింటింగ్ రంగాల వారికి బకాయిల వసూళ్ళలో శ్రమాధిక్యత, ప్రయాసలు తప్పవు. ఊహగానాలతో కాలం వ్యర్ధం చేయక సత్కాలంను సద్వినియోగం చేసుకోండి. బంధువుల  రాకతో దుబారా ఖర్చులు అధికమవుతాయి. 
 
వృషభం :- సొంతంగా వ్యాపారం చేయాలనే ఆలోచనస్ఫురిస్తుంది. రావలసిన ధనం అందటంతో పొదుపు దిశగా మీ ఆలోచన లుంటాయి. ప్రయాణాలు అనుకూలం. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. స్త్రీలకు స్వీయ ఆర్జన పట్ల ఆసక్తి, ప్రోత్సాహం లభిస్తాయి. కుటుంబంలో శుభ కార్యాలకై చేయు యత్నాలు ఫలిస్తాయి. 
 
మిథునం :- ఆలయ సందర్శనాలలో ఇబ్బందులు తప్పవు. స్త్రీలు టి.వి., ఛానల్ కార్యక్రమాలలోఒత్తిడి, చికాకులను ఎదుర్కుంటారు. జాగ్రత్త వహించండి. కుటుంబీకులతో మనస్పర్థలు తలెత్తుతాయి. నిర్మాణ పనులలో నాణ్యత లోపం వల్ల బిల్డర్లు కష్టనష్టాలను ఎదుర్కొంటారు. బంధుమిత్రులను కలుసుకుని ఉల్లాసంగా గడుపుతారు.
 
కర్కాటకం :- స్త్రీలకు ఉదరం, మోకాళ్లు, నరాలకు సంబంధించిన చికాకులు అధికం. శత్రువులు మిత్రులుగామారి సహాయ సహకారాలు అందిస్తారు. వ్యాపారాభివృద్ధికి కావలసిన ప్రణాళికలు అమలు చేస్తారు. ద్విచక్ర వాహనంపై దూర ప్రయాణాలు క్షేమదాయకం కాదు. ప్రేమ వ్యవహారాల్లో తొందరపాటు తనం కూడదు.
 
సింహం :- ఉపాధ్యాయులకు సదావకాశాలు లభిస్తాయి. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లో అప్రమత్తత అవసరం. బంధువులతో మాటపట్టింపులు తలెత్తుతాయి. కుటుంబీకులతో కలిసి విందు, వినోదాలలో పాల్గొంటారు. పుణ్యక్షేత్రాలు, నూతన ప్రదేశ సందర్శనల పట్ల ఆసక్తి పెరుగుతుంది. పత్రిక, ప్రైవేటు సంస్థలలోని వారికి ఒత్తిడి పెరుగుతుంది.
 
కన్య :- నిరుద్యోగులకు ప్రకటనలు పట్ల అవగాహన ముఖ్యం. శ్రీవారు, శ్రీమతికి అవసరమైన వస్తువులు సేకరిస్తారు. రావలసిన ధనం చేతికందటంతో రుణం తీర్చాలనే మీ యత్నం నెరవేరగలదు. పెద్దల ఆశీస్సులు, బంధువుల ప్రశంసలు పొందుతారు. దుబారా ఖర్చులు అధికమవ్వడం వల్ల ధనం ఏమాత్రం నిల్వచేయలేకపోతారు.
 
తుల :- కుటుంబీకుల మధ్య అనురాగవాత్సల్యాలు పెంపొందుతాయి. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులకు గురికాకండి. కొబ్బరి, పండ్లు, హోటల్, చల్లని పానీయ, తినుబండారు వ్యాపారులకు కలిసివస్తుంది. ఖర్చుకు వెనకాడకుండా విలువైన వస్తువులు సేకరిస్తారు.
 
వృశ్చికం :- మీ సంతానం మొండివైఖరి మీకు ఎంతో చికాకు కలిగిస్తుంది. ప్రభుత్వంనందు పనిచేయు ఉద్యోగులకు లాభములు చేకూరును. రాజకీయ, కళా రంగాల్లోవారికి సదావకాశాలు లభిస్తాయి. యాదృచ్ఛికంగా ఒక పుణ్యక్షేత్రం సందర్శిస్తారు. స్త్రీలకు అలంకారాలు, విలాస వస్తువులపై మక్కువ పెరుగుతుంది.
 
ధనస్సు :- పుణ్యక్షేత్రాల దర్శనం వల్ల మానసిక ప్రశాంతత చేకూరుతుంది. బంధు మిత్రుల రాకపోకలు అనినినిరాలలో స్వల్ప ఒత్తిడి, ఆటంకాలు ఎదుర్కోవలసి వస్తుంది. అధిక ఉష్ణం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుంది. స్త్రీలలో నూతన ఉత్సాహం చోటుచేసుకుంటుంది. నిరుద్యోగులకు ఇంటర్వూలలో విజయంసాధిస్తారు.
 
మకరం :- ఆకస్మిక ఖర్చులు, సమయానికి ధనం సర్దుబాటు కాకపోవటం వల్ల ఒకింత ఇబ్బందులు తప్పవు. వైద్యులకు శస్త్రచికిత్స చేయునపుడు మెళుకువ అవసరం. సభలు, సమావేశాల్లో ప్రముఖంగా వ్యవహరిస్తారు. మీ ఉత్సాహాన్ని అదుపులో ఉంచుకోవటం శ్రేయస్కరం. నోరు అదుపులో ఉంచుకోవడం శ్రేయస్కరం.
 
కుంభం :- మార్కెటింగ్ రంగాల వారికి ఒత్తిడి, త్రిప్పట తప్పవు. దేవాలయ, విద్యా సంస్థలకు దానధర్మాలు చేస్తారు. రావలసిన బాకీలు వాయిదా పడతాయి. నిరుద్యోగులు ప్రకటనల పట్ల ఆకర్షితులవుతారు. కొత్త పనులు చేపట్టకుండా ప్రస్తుతం చేస్తున్న వాటి పైనే శ్రద్ధ వహించండి. నేడు చేజారిన అవకాశం రేపు కలిసివస్తుంది.
 
మీనం :- మీ చిన్నారులకు అవసరమైన వస్తువులు సేకరిస్తారు. నూతన ప్రదేశ సందర్శనల పట్ల ఆసక్తి పెరుగుతుంది. స్త్రీలకు పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. వృత్తి వ్యాపారాల్లో కొత్త వ్యూహాల అమలుకు అనుకూలమైన రోజు. ప్రముఖుల కలయికసాధ్యం కాదు. బంధువుల రాకతో గృహంలో సందడి కానవస్తుంది.