సోమవారం, 13 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By సెల్వి

23-12-2024 సోమవారం దినఫలితాలు-పొగిడే వ్యక్తులతో జాగ్రత్త

Astrology
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
శ్రమతో కూడిన విజయాలుంటాయి. అవకాశాలను చేజిక్కించుకుంటారు. ఖర్చులు సామాన్యం. కొంతమొత్తం పొదుపు చేస్తారు. ఆత్మీయులతో సంభాషిస్తారు. పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోండి. ఒత్తిడికి గురికావద్దు. ఏకాగ్రతతో వాహనం నడపండి. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
సన్నిహితుల వ్యాఖ్యలు కార్యోన్ముఖులను చేస్తాయి. పనులు సావకాశంగా పూర్తి చేస్తారు. ఖర్చులు అధికం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. గృహమరమ్మతులు చేపడతారు. సోదరుల నుంచి అభ్యంతరాలెదురవుతాయి. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. 
 
మిధునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ధ్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. రోజువారీ ఖర్చులే ఉంటాయి. పరిచయస్తులు సాయం అర్ధిస్తారు. బంధువుల రాక ఇబ్బంది కలిగిస్తుంది. కార్యక్రమాలు ముందుకు సాగవు. పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
గత అనుభవంతో జాగ్రత్త వహిస్తారు. ప్రముఖులతో పరిచయాలు బలపడతాయి, ఆశించిన పదవులు దక్కవు. బాధ్యతల నుంచి తప్పుకుంటారు. ఖర్చులు విపరీతం. రాబడిపై దృష్టి పెడతారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. 
 
సింహం మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
శుభకార్యాన్ని ఆర్భాటంగా చేస్తారు. మీ ఉన్నతి కొందరికి అపోహ కలిగిస్తుంది. పనులు వేగవంతమవుతాయి. ఖర్చులు విపరీతం. సంస్థల స్థాపనలపై దృష్టి పెడతారు. వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహిండి. అప్రమత్తంగా ఉండాలి. అనవసర జోక్యం తగదు. 
 
కన్య: ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు
సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. మాటతీరుతో ఆకట్టుకుంటారు. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. విలాసాలకు వ్యయం చేస్తారు. పనుల్లో ఒత్తిడి, జాప్యం అధికం. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. పొగిడే వ్యక్తులతో జాగ్రత్త. 
 
తుల: చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. ధృఢసంకల్పంతో ముందుకు సాగుతారు. రావలసిన ధనం అందుతుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. మీపై వచ్చిన అభియోగాలు సమసిపోగలవు. ప్రముఖులకు సన్నిహితులవుతారు. పనులు, బాధ్యతలు పురమాయించవద్దు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఓర్పుతో యత్నాలు సాగించండి. సాయం ఆశించవద్దు. పరిచయస్తులు మీ ఆలోచనలను నీరుగార్చేందుకు యత్నిస్తారు. పట్టుదలతో పనులు పూర్తి చేస్తారు. ఖర్చులు విపరీతం. సాయం చేసేందుకు అయిన వారే వెనుకాడుతారు. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. 
 
ధనస్సు మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
సంకల్పబలంతో అనుకున్నది సాధిస్తారు. ఖర్చులు విపరీతం. పొదుపు ధనం ముందుగానే గ్రహిస్తారు. పనులు ఒక పట్టాన సాగవు. కీలక పత్రాలు అందుకుంటారు. అయిన వారితో సంద్రింపులు జరుపుతారు. ద్విచక్ర వాహనంపై దూరప్రయాణం తగదు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
మాటతీరు ఆకట్టుకుంటుంది. లక్ష్యాన్ని సాధిస్తారు. వ్యవహార జయం, ధనలాభం ఉన్నాయి. చెల్లింపులు, నగదు స్వీకరణలో జాగ్రత్త. సకాలంలో పనులు పూర్తిచేస్తారు. ప్రముఖులతో పరిచయాలేర్పడతాయి. ఆరోగ్యం సంతృప్తికరం. ఉల్లాసంగా గడుపుతారు.
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
ధైర్యంగా యత్నాలు సాగిస్తారు. ప్రలోభాలకు లొంగవద్దు. ఖర్చలు విపరీతం. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. శుభకార్యానికి హాజరవుతారు. ఇంటిని నిర్లక్ష్యంగా వదిలివేసి వెళ్లకండి. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. 
 
మీనం: పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
సంద్రింపులు పురోగతిన సాగుతాయి. ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. ఫోన్ సందేశాలను పట్టించుకోవద్దు. సన్నిహితులకు మీ సమస్యలు తెలియజేయండి. పనులు మందకొడిగా సాగుతాయి. బెట్టింగ్లకు పాల్పడవద్దు.