సోమవారం, 2 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

26-10-2022 బుధవారం దినఫలాలు - అనంతపద్మనాభస్వామిని ఆరాధించిన మనోసిద్ధి...

Astrology
మేషం :- ఉద్యోగస్తుల సమర్థత, పనితీరు అధికారులను ఆకట్టుకుంటాయి. ప్రముఖులను కలుసుకుంటారు. ఉపాధ్యాయులకు, విద్యార్థుల మధ్య అవగాహనం లోపం వల్ల ఇబ్బందులను ఎదుర్కుంటారు. స్త్రీలకు పనిభారం అధికమవుతుంది. పెరిగిన ధరలు, చాలీచాలని ఆదాయంతో సతమతమవుతారు. కోర్టు వ్యవహారాలు విచారణకు వస్తాయి. 
 
వృషభం :- డాక్టర్లు శస్త్రచికిత్సలు విజయవంతంగా పూర్తిచేస్తారు. సోదరీ, సోదరులు, బంధువుల మధ్య బాంధవ్యాలు మరింత బలపడతాయి. లీజు, ఏజెన్సీలు, నూతన కాంట్రాక్టులు అనుకూలిస్తాయి. ఆత్మీయులు దూరమవుతున్నారనే భావం నిరుత్సాహం కలిగిస్తుంది. రవాణా రంగంలో వారు చికాకులను ఎదుర్కొంటారు.
 
మిథునం :- మత్స్య కోళ్ళ వ్యాపారస్తులకు లాభదాయకంగా ఉంటుంది. ఇతరుల కుటుంబ విషయాలలో తలదూర్చి సమస్యలు తెచ్చుకోకండి. ఉత్తర ప్రత్యుత్తరాలు సంతృప్తినిస్తాయి. మంచిమాటలతో ఎదుటివారిని ప్రసన్నం చేసుకోవటానికి యత్నించండి. వాతావరణంలోని మార్పు మీకు ఎంతో ఆందోళన కలిగిస్తుంది.
 
కర్కాటకం :- చేపట్టిన వ్యాపారంలో నిలకడగా సాగుతాయి. నిరుద్యోగులకు తాత్కలిక అవకాశాలు లభిస్తాయి. ప్రతి చిన్న విషయానికి ఇతరులపై ఆధారపడటం మంచిది కాదు. పెద్దల మాటను శిరసా వహిస్తారు. ఎప్పటి నుంచో వాయిదా పడుతూ వస్తున్న పనులు పునఃప్రారంభిస్తారు. అతిధి మర్యాదలు బాగుగా నిర్వహిస్తారు.
 
సింహం :- గృహంలో ఏదైనా వస్తువులు పోవడానికి ఆస్కారం కలదు. మిత్రులతో సంభాషించేటపుడు సంయమనం పాటించడం మంచిది. వృత్తి, వ్యాపారాలు ప్రశాంతంగా సాగుతాయి. నిరుద్యోగులు ఇంటర్వ్యూలలో విజయం సాధిస్తారు. సభలు, సమావేశాలలో హుందాగా వ్యవహరించి అందరినీ ఆకట్టుకుంటారు.
 
కన్య :- రాజకీయనాయకులకు అపరిచిత వ్యక్తులపట్ల మెళుకువ అవసరం. దైవ సేవా కార్యక్రమాల్లో మీ గౌరవ ప్రతిష్టలకు భంగం కలుగకుండా వ్యవహరించండి. పాత బిల్లులు చెల్లిస్తారు. విదేశాలు వెళ్ళటానికి చేయుయత్నాలు ఫలిస్తాయి. స్త్రీలు బంధువుల కోసం షాపింగ్ చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు ఇబ్బందులు కలిగిస్తాయి.
 
తుల :- ఆర్థిక వ్యవహారాలు నిరాశ కలిగిస్తాయి. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయ రంగాలలో వారికి అనుకూలం. తరచూ సభలు, సమావేశాల్లో పాల్గొంటారు. పత్రికా సిబ్బందికి వార్తల ప్రచురణలో పునరాలోచన మంచిది. విద్యార్థుల మొండి వైఖరి ఉపాధ్యాయులకు చికాకు కలిగిస్తుంది. ప్రముఖుల కలయిక సాధ్యం కాదు.
 
వృశ్చికం :- ప్రైవేటు సంస్థలలోని వారికి ఓర్పు, పనియందు ధ్యాస ముఖ్యం. ప్రయాణాలు, వ్యూహాల అమలులో జాగ్రత్త అవసరం. బ్యాంకు పనులు వాయిదా పడతాయి. ఒప్పందాలు, ఇచ్చిపుచ్చుకునే వ్యవహారాల్లో ఏకాగ్రత అవసరం. కోర్టు వ్యావహారాలలో ప్లీడర్లు చికాకులను ఎదుర్కొంటారు. స్త్రీలకు షాపింగుల్లో నాణ్యతను గయనించాలి.
 
ధనస్సు :- ఆర్థిక సమస్యలు తలెత్తిన నెమ్మదిగా సమసిపోతాయి. స్త్రీలు అభిప్రాయాలకు ఆమోదం లభించదు. ఉద్యోగస్తులు అధికారులకు మరింత చేరువవుతారు. రేపటి గురించి ఆలోచనలు సాగిస్తారు. సంఘంలో మీ మాటకు మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. విద్యార్థులకు చదువుల పట్ల ఏకాగ్రత ఎంతో ముఖ్యం.
 
మకరం :- బ్యాంకులు, ఏ.టి.ఎం.ల నుంచి ధనం డ్రా చేసే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించండి. బకాయిలు, ఇంటి అద్దెల వసూలులో సౌమ్యంగా మెలగాలి. ప్రింటింగ్ రంగాల వారు పురోభివృద్ధి పొందుతారు. మీ అవసరాలకు కావలసిన ధనం కోసం ఇబ్బందులెదుర్కుంటారు. అదనపు సంపాదన కోసం మార్గాలు అన్వేషిస్తారు.
 
కుంభం :- తలపెట్టిన పనుల్లో ఒత్తిడి, హడావుడి ఎదుర్కుంటారు. కొత్త వ్యక్తులతో పరిచయాలు, వ్యాపకాలు అధికమవుతాయి. ఒక వ్యవహారం నిమిత్తం ప్లీడర్లతో సంప్రదింపులు జరుపుతారు. వ్యాపారాభివృద్ధికి షాపుల అలంకరణ, కొత్త పథకాలు రూపొందిస్తారు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు.
 
మీనం :- ప్రభుత్వ కార్యాలయాల్లో మీ పనుల సానుకూలతకు బాగా శ్రమించాలి. వృత్తిపరంగా ఎదురైన ఆటంకాలను ధీటుగా ఎదుర్కుంటారు. ఎంతో కొంత పొదుపు చేద్దామనుకున్న మీ ఆశ నెరవేరదు. ఆలయాలను సందర్శిస్తారు. ఏ యత్నం కలిసిరాక నిరుద్యోగులు నిస్తేజానికి లోనవుతారు. చిన్ననాటి పరిచయస్తులను కలుసుకుంటారు.