శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

29-11-2024 శుక్రవారం ఫలితాలు - సంకల్పబలంతోనే కార్యం సిద్ధిస్తుంది...

simha raasi
మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం
సంకల్పబలంతోనే కార్యం సిద్ధిస్తుంది. మీ సామర్ధ్యాలపై నమ్మకం పెంచుకోండి. యత్నాలు విరమించుకోవద్దు. పరిచయస్తులు ధనసహాయం అర్థిస్తారు. కొత్త పనులు చేపడతారు. ప్రముఖుల సందర్శనం వీలుపడదు. సన్మాన, సంస్కరణ సభల్లో పాల్గొంటారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
లావాదేవీలు ముగుస్తాయి. సముచిత నిర్ణయం తీసుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. సకాలంలో పనులు పూర్తి చేస్తారు. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. ఆత్మీయులతో సంభాషిస్తారు. పోగొట్టుకున్న వస్తువులు లభ్యమవుతాయి. వాహనం ఇతరులకివ్వవద్దు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదాలు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదాలు
సంకల్పం సిద్ధిస్తుంది. సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. మాటతీరుతో అందరినీ ఆకట్టుకుంటారు. ఆశించిన పదవులు దక్కవు. బాధ్యతల నుంచి తప్పుకుంటారు. ఖర్చులు అదుపులో ఉండవు. పనులు హడావుడిగా సాగుతాయి. ఆకస్మిక ప్రయాణం తలపెడతారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
ప్రతికూలతలను ధీటుగా ఎదుర్కుంటారు. కష్టమనుకున్న పనులు తేలికగా పూర్తి చేస్తారు. ఖర్చులు అధికం. వివాహయత్నం ఫలించే సూచనలున్నాయి. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. పెద్దలను సంప్రదిస్తారు. ఆప్తులను విందులు, వేడుకలకు ఆహ్వానిస్తారు. 
 
సింహం : మఖ, పుబ్బ, ఉత్తర 1వ పాదం
మనోధైర్యంతో యత్నాలు సాగిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. కీలక వ్యవహారాల్లో ఏకాగ్రత వహించండి. పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. పిల్లల దూకుడు ఇబ్బంది కలిగిస్తుంది.
 
కన్య : ఉత్తర 2, 3, 4 పాదాలు, హస్త, చిత్త1,2 పాదాలు
ప్రతికూలతలు అధికం. శ్రమించినా ఫలితం అంతంతమాత్రమే. మీ సామర్ధ్యంపై నమ్మకం తగ్గుతుంది. పొదుపు ధనం గ్రహిస్తారు. ఆరోగ్యం బాగుంటుంది. పనులు మందకొడిగా సాగుతాయి. సంతానం ఉద్యోగయత్నం ఫలిస్తుంది. మానసికంగా కుదుటపడతారు. 
 
తుల : చిత్త 3, 4 పాదాలు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదాలు
ఆప్తులకు మీ సమస్యలను తెలియజేయండి. దంపతుల మధ్య చీటికిమాటికి కలహాలు. ఖర్చులు అదుపులో ఉండవు. ఒక సమాచారం ఉత్తేజపరుస్తుంది. ఆత్మీయులతో కాలక్షేపం చేస్తారు. నగదు డ్రా చేసేటపుడు జాగ్రత్త. ద్విచక్రవాహనంపై దూర ప్రయాణం క్షేమం కాదు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదం. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు
ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. కొత్త యత్నాలు ప్రారంభిస్తారు. ఖర్చులు అదుపులో ఉండవు. అప్రియమైన వార్త వింటారు.. పనులు, కార్యక్రమాలు సాగవు. సోదరులను సంప్రదిస్తారు. దంపతుల మధ్య దాపరికం తగదు. పత్రాల్లో మార్పులు అనుకూలించవు.
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదం
కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. పనులు సకాలంలో పూర్తి చేస్తారు. మొండి బాకీలు వసూలవుతాయి. ఖర్చులు అధికం, ప్రముఖులకు సన్నిహితులవుతారు. అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. బాధ్యతలు అప్పదించవద్దు. ప్రయాణం తలపెడతారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదాలు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదాలు
వ్యవహార ఒప్పదాల్లో ఏకాగ్రత వహించండి. అనాలోచిత నిర్ణయాలు నష్టం కలిగిస్తాయి. మీ సమస్యలను సన్నిహితులకు తెలియజేయండి. ఖర్చులు అదుపులో ఉండవు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదాలు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదాలు
శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. ధైర్యంగా యత్నాలు సాగించండి. సాయం ఆశించవద్దు. ఆదాయం బాగుంటుంది. పెద్దఖర్చు తగిలే ఆస్కారం ఉంది. పనులు ఒక పట్టాన పూర్తికావు. చిన్న విషయానికే చికాకుపడతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదం, ఉత్తరాబాద్ర, రేవతి
మీ పనితీరు ప్రశంనీయమవుతుంది. కీలక అంశాలపై పట్టు సాధిస్తారు. సభ్యత్వాల స్వీకరణకు అనుకూలం. ఇతరుల కోసం విపరీతంగా వ్యయం చేస్తారు. పిల్లల దూకుడు అదుపుచేయండి. ఏ విషయాన్నీ తేలికగా తీసుకోవద్దు. కీలక చర్చల్లో పాల్గొంటారు.