శనివారం, 21 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్

10-09-2021- శుక్రవారం మీ రాశి ఫలితాలు.. వినాయకుడిని గరికెతో..?

వినాయకుడిని గరికెతో పూజించినట్లైతే శుభం కలుగుతుంది. 
 
మేషం: భాగస్వామ్యుల మధ్య నూతన ఆలోచనలు స్ఫురిస్తాయి. మీ పెద్దల మొండివైఖరి మీకెంతో చికాకు కలిగిస్తుంది. ఇతరులను అతిగా విశ్వసించడం వల్ల నష్టపోయే ప్రమాదం వుంది. జాగ్రత్త వహించండి. సిమెంట్, కలప, ఐరన్, ఇటుక వ్యాపారులకు మిశ్రమ ఫలితం. స్త్రీలు పనివారలతో ఒత్తిడి, చికాకులను ఎదుర్కొంటారు. 
 
వృషభం: కళాకారులకు, రచయితలకు, పత్రికా రంగంలో వారికి అనుకూలమైన కాలం. క్రయ విక్రయాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగస్తులకు పై అధికారుల నుంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. పాత మిత్రుల కలయిక సంతృప్తినిస్తుంది. వాహనం నడుపుతున్నప్పుడు జాగ్రత్త అవసరం. బంధువుల రాకతో ఖర్చులు అధికమవుతాయి. 
 
మిథునం: ఉపాధ్యాయులకు రిప్రజెంటేటివ్‌లకు సదవకాశాలు లభిస్తాయి. దూరమైన ఆప్తులు దగ్గరవుతారు. చేజారిన అవకాశాలు సైతం తిరిగి దక్కించుకుంటారు. ప్రయాణాలు అనుకూలం. బ్యాంకింగ్ రంగాల వారికి ఒత్తిడి, పనిభారం అధికమవుతుంది. వైద్యులకు చికిత్సల సమయంలో ఓర్పు, ఏకాగ్రత ఎంతో అవసరం. 
 
కర్కాటకం: ట్రాన్స్‌పోర్టు, ఎక్స్‌పోర్ట్, కంప్యూటర్ రంగాల్లో వారికి సామాన్యంగా ఉండగలదు. దైవ దర్శనాలు అనుకూలిస్తాయి. కోర్టు వ్యవహారాల్లో మెళకువ అవసరం. అనుకున్న పనులు వాయిదా పడతాయి. ఉద్యోగస్తులకు అధికారుల నుంచి ఒత్తిడి పెరుగుతుంది. ఓర్పు, నేర్పుతో ప్రత్యర్థులను సైతం ఆకట్టుకుంటారు. 
 
సింహం: సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ అవసరాలకు ధనం సమకూరుతుంది. కోర్టు వ్యవహారాలు వాయిదా పడతాయి. ఉద్యోగ యత్నాలు అనుకూలం. చిరకాలపు సమస్యలు పరిష్కారమయ్యే అవకాశం వుంది. సంఘంలో కీర్తి గౌరవాలు ఇనుమడిస్తాయి. కిరాణా, ఫ్యాన్సీ, నిత్యావసర వస్తు వ్యాపారులకు కలిసిరాగలదు.
 
కన్య: వృత్తి, వ్యాపారాల్లో లక్ష్యాలు సాధిస్తారు. మీ ప్రతిభ వెలుగులోనికి వస్తుంది. ఒకేసారి అనేక పనులు మీద పడటంతో అసహనానికి గురవుతారు. స్త్రీలు అపరిచిత వ్యక్తుల పట్ల మెళకువ అవసరం. స్టేషనరీ, ప్రింటింగ్ రంగంలో వారికి సదవకాశాలు లభిస్తాయి. సోదరీ, సోదరుల మధ్య సంబంధ బాంధవ్యాలు బలపడతాయి.
 
తుల: ఆర్థిక లావాదేవీలు అనుకూలంగా ఉంటాయి. ప్రైవేట్ సంస్థల్లో వారికి ఒత్తిడి, చికాకు తప్పదు. ఒంటెత్తు పోకడ మంచిది కాదని గమనించండి. వ్యాపారులకు పోటీ పెరగడంతో ఆశించినంత పురోభివృద్ధి వుండదు. మీ అభిప్రాయాలకు మంచి స్పందన లభిస్తుంది. ఉపాధ్యాయులకు, రిప్రజెంటేటివ్‌లకు సదవకాశాలు లభిస్తాయి.
 
వృశ్చికం: ఆర్థిక ఒడిదుడుకులు తలెత్తినా మిత్రుల సహకారం లభిస్తుంది. మీ ఆలోచనలు, ప్రణాళికలు గోప్యంగా వుంచడం మంచిది. స్త్రీలకు విదేశీ వస్తువుల పట్ల ఆసక్తి పెరుగుతుంది. ఊహాగానాలతో కాలం వ్యర్థం చేయకండి. జీవిత భాగస్వామితో కలహాలు రాకుండా సంయమనంతో వ్యవహరించాల్సి వుంటుంది. 
 
ధనస్సు: కోళ్ళ, మత్స్య, గొర్రెల వ్యాపారులకు ఆశించినంత పురోభివృద్ధి వుండదు. వాహనం ఇతరులకు ఇచ్చి ఇబ్బందులను ఎదుర్కొంటారు. కోర్టు వ్యవహారాల్లో ప్లీడర్లు, ప్లీడరు గుమాస్తాలకు ఇబ్బందులను ఎదుర్కొంటారు. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల పట్ల ఏకాగ్రత వహిస్తారు. స్త్రీలకు సంపాదన పట్ల ఆసక్తి పెరుగుతుంది. 
 
మకరం: బ్యాంకు వ్యవహారాలు మందకొడిగా సాగుతాయి. ఏ వ్యక్తికీ పూర్తి బాధ్యతలు అప్పగించడం మంచిది కాదని గమనించండి. పెద్దల ఆరోగ్యం అంతంత మాత్రంగా వుంటుంది. ఉద్యోగులకు పనిభారం అధికం. పాత వస్తువులను కొని ఇబ్బందులు ఎదుర్కొంటారు. సతీసమేతంగా ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శిస్తారు. 
 
కుంభం: మీ శ్రీమతికి మీరంటే ప్రత్యేకాభిమానం కలుగుతుంది. బంధుమిత్రులలో మంచి గుర్తింపు, రాణింపు లభిస్తుంది. ఉద్యోగస్తులు తరుచు సభలు, సమావేశాల్లో చురుకుగా పాల్గొంటారు. రాబడికి మించిన ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. కొబ్బరి, పండ్ల, పూల, కూరగాయలు, చిరు వ్యాపారులకు కలిసిరాగలదు. 
 
మీనం: ఉద్యోగస్తులకు కొత్త బాధ్యతల వల్ల చికాకులు, పనిభారం తప్పవు. మీ పట్ల ముభావంగా వుండే వ్యక్తులు మీకు దగ్గరయ్యేందుకు ప్రయత్నిస్తారు. స్త్రీలకు షాపింగ్ వ్యవహారాల్లో, చెల్లింపుల్లో అప్రమత్తత చాలా అవసరం. మీ హోదాకు తగినట్లుగా ధన వ్యయం చేయాల్సి వస్తుంది. ప్రయాణాలు సుఖవంతంగా సాగుతాయి.