సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. దినఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 16 ఏప్రియల్ 2022 (22:47 IST)

17-04-2022 నుంచి 23-04-2022 వరకు మీ వార రాశిఫలాలు (video)

Weekly Astrology
మేషం :- అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము 
వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం నిరుత్సాహపరుస్తుంది. ఆశావహ దృక్పథంతో వ్యవహరించండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ఆదాయ వ్యయాలకు పొందన ఉండదు. రుణ ఒత్తిళ్లతో సతమతమవుతారు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. సన్నిహితులతో సంభాషణ ఉత్తేజపరుస్తుంది. వాయిదా పడిన పనులు పూర్తి చేస్తారు. కొత్త పరిచయాలేర్పడతాయి. మంగళ, బుధవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. అవగాహన లేని విషయాల్లో జోక్యం తగదు. సంతానం మొండితనం ఇబ్బంది కలిగిస్తుంది. సామరస్యంగా మెలగండి. గృహోపకరణాలు మరమ్మతుకు గురవుతాయి. మీపై శకునాల ప్రభావం అధికం. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. వ్యాపారాభివృద్ధికి మరింత శ్రమించాలి. కొనుగోలుదార్లతో జాగ్రత్త. ఉపాధి పథకాలు కలిసివస్తాయి. 
 
వృషభం :- కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు 
వ్యవహారాలతో తీరిక ఉండదు. ఆలోచనలతో సతమతమవుతారు. ఏకపక్ష నిర్ణయాలు తగవు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. ఖర్చులు అంచనాలను మించుతాయి. రుణాలు, చేబదుళ్లు స్వీకరిస్తారు. శుక్ర, శనివారాల్లో పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. మీ శ్రీమతి సాయంతో ఒక సమస్య సద్దుమణుగుతుంది. ఆహ్వానం అందుకుంటారు. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. గృహంలో మార్పు చేర్పులకు అనుకూలం. చిన్ననాటి పరిచయస్తులు తారసపడతారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. వృత్తి వ్యాపారాలు పురోగతిన సాగుతాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు కష్టసమయం. మార్కెట్ రంగాల వారికి మార్పులు అనుకూలిస్తాయి. ఏజెన్సీలు దక్కించుకుంటారు. షేర్ల క్రయ విక్రయాలు లాభిస్తాయి. 
 
మిథునం :- మృగశిర 3, 4 పాదములు, ఆర్థ, పునర్వసు 1, 2, 3 పాదములు 
ఈ వారం అన్ని రంగాల వారికీ శుభదాయకం. కార్యక్రమాలు విజయవంతమవుతాయి. ఉల్లాసంగా గడుపుతారు. అందరితో సత్సంబంధాలు నెలకొంటాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. గుట్టుగా వ్యవహరించండి. పనుల్లో ఒత్తిడి అధికం. ఖర్చులు అదుపులో ఉండవు. విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. మీ ప్రమేయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. ఆధ్మాతిక, యోగాలపై ఆసక్తి పెంపొందుతుంది. సేవా సంస్థలకు విరాళాలు అందిస్తారు. సంతానం దూకుడు అదుపుచేయండి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. పెద్దమొత్తం సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగ బాధ్యతల్లో తప్పిదాలను సరిదిద్దుకుంటారు. అధికారులు, ఉపాధ్యాయులకు స్థానచలనం, వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు 
కార్యసిద్ధికి ఓర్పు, కృషి ప్రధానం. నిరుత్సాహం వీడి యత్నాలు సాగించండి. సహాయం ఆశించవద్దు. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. ఒక సమాచారం తీవ్రంగా ఆలోచింపచేస్తుంది. ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. తెలియని వెలితి వెన్నాడుతుంది. మీ శ్రీమతి సలహా పాటించండి. ఇంటి విషయాలపై శ్రద్ధ అవసరం. గృహమార్పు కలిసివస్తుంది. వివాహ యత్నాలు తీవ్రంగా సాగిస్తారు. దళారులను ఆశ్రయించవద్దు. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. నగదు డ్రా చేసేటప్పుడు జాగ్రత్త, బ్యాంకు వివరాలు వెల్లడించవద్దు. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఏమంత సంతృప్తినీయవు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. బెట్టింగుకు పాల్పడవద్దు. 
 
సింహం :- మఖ, పుబ్బ 1, 2, 3, 4 పాదములు, ఉత్తర 1వ పాదము 
ఆర్థికస్థితి నిరాశాజనకం. ఏ పురోగతి లేక నిస్తేజానికి లోనవుతారు. ఆలోచనలు చికాకుపరుస్తాయి. ఏ పనీ చేయబుద్ది కాదు. అన్యమస్కంగా గడుపుతారు. సన్నిహితుల కలయికతో ఊరట లభిస్తుంది. నోటీసులు అందుకుంటారు. కుటంబీకుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సోమ, మంగళవారాల్లో పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. పెద్దల సలహా పాటిస్తారు. కనిపించకుండా పోయిన వస్తువులు లభ్యమవుతాయి. ఇంటి విషయాలపై దృష్టి పెడతారు. గృహమార్పు ఫలితం నిదానంగా కనిపిస్తుంది. వివాహయత్నాలకు శ్రీకారం చుడతారు. ఏజెన్సీలు, దళారులతో జాగ్రత్త వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. వృత్తి ఉద్యోగ బాధ్యతల్లో, ఏకాగ్రత వహించండి. అధికారులకు అదనపు బాధ్యతలు, ముఖ్యులకు వీడ్కోలు పలుకుతారు. ఆస్తి వివాదాలు కొత్త మలుపు తిరుగుతాయి. 
 
కన్య :- ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు 
ప్రతికూలతలు తొలగుతాయి. సమర్ధతను చాటుకుంటారు. కొత్త పరిచయాలేర్పడతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. రోజువారీ ఖర్చులే ఉంటాయి. కొంత మొత్తం ధనం అందుతుంది. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. పనులు సామరస్యంగా పూర్తి చేస్తారు. ఆదివారం నాడు కావలసిన వ్యక్తుల కలయిక వీలుపడదు. మీ శ్రీమతి ధోరణి అసహనం కలిగిస్తుంది. ఆధిపత్యం ప్రదర్శించవద్దు. గృహోపకరణాలు మరమ్మతుకు గురవుతాయి. సంతానం పై చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. ఒక ఆహ్వానం సందిగ్దానికి గురిచేస్తుంది. సోదరులతో విభేదిస్తారు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. హోల్‌సేల్ వ్యాపారులకు సామాన్యం. ఉద్యోగస్తులకు పనిభారం. ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. కంప్యూటర్, ప్రింటింగ్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి.
 
తుల :- చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు 
వ్యవహార ఒప్పందాల్లో ఏకాగ్రత వహించండి. అనాలోచిత నిర్ణయాలు తీసుకోవద్దు. అనుభవజ్ఞుల సలహా పాటించండి. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. పనుల సానుకూలతకు మరింత శ్రమించాలి. అవకాశాలను తక్షణం సద్వినియోగం చేసుకోండి. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. సోమ, మంగళవారాల్లో ఆశ్చర్యకరమైన సంఘటనల బాధ్యతలు అప్పగించవద్దు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ శ్రీమతి విషయంలో దాపరికం తగదు. ఆత్మీయుల ఆహ్వానం సంతోషాన్నిస్తుంది. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఏమంత సంతృప్తినీయవు. న్యాయ, వైద్య, సేవా రంగాల వారికి ఆదాయాభివృద్ధి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. వేడుకల్లో అత్యుత్సాహం తగదు. 
 
వృశ్చికం :- విశాఖ 4వ పాదము. అనూరాధ, జ్యేష్ఠ 1,2,3,4 పాదములు 
లక్ష్య సాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. మీ నమ్మకం వమ్ముకాదు. కొన్ని విషయాలు ఊహించినట్లే జరుగుతాయి. రావలసిన ధనం అందుతుంది. సకాలంలో చెల్లింపులు జరుపుతారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. మీ ప్రమేయంతో శుభకార్యం నిశ్చయమవుతుంది. బుధవారం నాడు పనులు సాగవు. మీపై శకునాల ప్రభావం అధికం. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. స్థిరాస్తి కొనుగోలు దిశగా యత్నాలు సాగిస్తారు. సంతానం దూకుడు అదుపు చేయండి. వేడుకకు హాజరవుతారు. మీ రాక బంధుమిత్రులకు సంతోషం కలిగిస్తుంది. ఉద్యోగస్తులకు శుభయోగం. ప్రశంసలు, పురస్కారాలు అందుకుంటారు. వ్యాపారాలు
ప్రోత్సాహకరంగా సాగుతాయి, ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. వృత్తి ఉపాధి పథకాల్లో రాణింపు, అనుభవం గడిస్తారు. 
 
ధనస్సు :- మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము 
ఆర్థికంగా పురోగమిస్తారు. రుణసమస్యలు పరిష్కారమవుతాయి. మానసికంగా కుదుటపడతారు. ఖర్చులు సామాన్యం. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఏజెన్సీలు, మధ్యవర్తులను విశ్వసించవద్దు. నిలిచిపోయిన పనులు పూర్తి చేస్తారు. బంధువులతో అభిప్రాయభేదాలు తలెత్తుతాయి. మీ మాటతీరు అదుపులో ఉంచుకోండి. గురు, శుక్రవారాల్లో సంతానం గురించి ఆందోళన చెందుతారు. కుటుంబీకుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. పెద్దల సలహా పాటించండి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. వ్యాపారాల్లో స్వల్ప లాభాలు గడిస్తారు. నూత వ్యాపారాలకు అనుకూలం. మార్కెట్ రంగాల వారికి ఒత్తిడి అధికం. ఉపాధ్యాయులకు స్థానచలనం. ప్రైవేట్ విద్యాసంస్థలకు కొత్త సమస్యలెదురవుతాయి. లైసెన్సుల రెన్యువ‌ల్‌లో మెలకువ వహించండి.  
 
మకరం :- ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు 
ఓర్పు, పట్టుదలతో కృషి చేయండి. అవకాశాలు చేజారినా నిరుత్సాహపడవద్దు. ఆత్మీయుల హితవు మీపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. శనివారం నాడు పెద్ద ఖర్చు తగిలే ఆస్కారం ఉంది. తల పెట్టిన పనులు ఒక పట్టాన పూర్తి కావు. మీపై శకునాల ప్రభావం అధికం. ఏ విషయాన్ని తీవ్రంగా పరిగణించవద్దు. పరిస్థితులు నిదానంగా మెరుగుపడతాయి. గృహంలో మార్పు చేర్పులు అనివార్యం. నిర్మాణాలు మందకొడిగా సాగుతాయి. బిల్డర్లకు ఒత్తిడి అధికం. కార్మికులకు నిరాశాజనకం. ఉద్యోగ బాధ్యతల్లో ఏకాగ్రత వహించండి. యాదృచ్ఛికంగా తప్పులు దొర్లే ఆస్కారం ఉంది. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. చిన్న వ్యాపారులకు ఆశాజనకం. అస్వస్థతకు గురవుతారు. వైద్య సేవలు అవసరమవుతాయి. 
 
కుంభం :- ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదములు 
ఆర్థికస్థితి సామాన్యం. రోజులు భారంగా గడుస్తున్నట్టనిపిస్తాయి. నిస్తేజానికి లోనవుతారు. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. మనస్సుకు నచ్చిన వ్యక్తులతో కాలక్షేపం చేయండి. వ్యాపకాలు సృష్టించుకోవటం ఉత్తమం. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. కుటుంబీకుల మీ అశక్తతను అర్థం చేసుకుంటారు. ఆత్మీయుల రాక ఉపశమనం కలిగిస్తుంది. ఆది, సోమవారాల్లో ఖర్చులు అధికం. రాబడిపై దృష్టి పెడతారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ ఇష్టాయిష్టాలను ఖచ్చితంగా తెలియజేయండి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. పెద్దమొత్తం సరుకు నిల్వ తగదు. ఉద్యోగస్తులకు పనిభారం. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. షేర్ల క్రయ విక్రయాలు పెద్దగా లాభించవు.
 
మీనం :- పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు 
ప్రతికూలతలు అధికం. ఆశావహదృక్పథంతో వ్యవహరించండి. పట్టుదలతో శ్రమించినగాని పనులు పూర్తి కావు. కావలసిన వ్యక్తుల కలయిక వీలుపడదు. ఖర్చులు అధికం. ప్రయోజనకరం. పొదుపు పథకాల పట్ల ఆకర్షితులవుతారు. పెద్దమొత్తం ధనసహాయం తగదు. మంగళ, బుధవారాల్లో అప్రియమైన వార్తలు వింటారు. దంపతుల మధ్య కొత్త విషయాలు ప్రస్తావనకు వస్తాయి. ఆలోచనల్లో మార్పు వస్తుంది. సంతానం భవిష్యత్తు గురించి ఆలోచిస్తారు. గృహమార్పు చికాకుపరుస్తుంది. విలువైన వస్తువులు మరమ్మతులకు గురవుతాయి. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. ఉపాధ్యాయులకు కొత్త సమస్యలెదురవుతాయి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. బిల్డర్లకు ఒత్తిడి అధికం. న్యాయ, సేవా రంగాల వారికి ఆదాయాభివృద్ధి. ప్రయాణంలో ఇబ్బందులు పడుతారు.