మీది, మీరిచ్చిన అమ్మాయి జాతకాలు బాగున్నాయి(సునీల్-హైదరాబాద్)

బుధవారం, 4 నవంబరు 2015 (19:05 IST)
సునీల్-హైదరాబాద్: మీరు దశమి శుక్రవారం, సింహ లగ్నం, పుబ్బ నక్షత్రం, సింహరాశి నందు జన్మించారు. లగ్నము నందు చంద్ర, కేతువులు ఉండి, భార్య స్థానము నందు రాహువు ఉండి, అష్టమ స్థానము నందు కుజుడు ఉండి, కుజ బంధన దోషం ఏర్పడం వల్ల మీరు ఒక సంబంధం అనుకుని ఆగిన తదుపరి మీకు వివాహం అవుతుంది. వివాహ విషయంలో జాతక పొంతన చాలా అవసరమని గమనించండి. 2016 ఫిబ్రవరి నుంచి 2016 అక్టోబరు లోపు మీకు వివాహం అవుతుంది. యోగ్యురాలైన భార్య లభిస్తుంది. 2012 నవంబరు నుంచి చంద్ర మహర్దశ ప్రారంభమైంది. ఈ చంద్రుడు 2017 నుంచి 2022 వరకూ సత్ఫలితాలను ఇస్తాడు. 2017 వరకు అర్థాష్టమ శనిదోషం ఉన్నందువల్ల ప్రతి శనివారం 20 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి తెల్లని పూలతో శనిని పూజించి, అర్చించినట్లయితే దోషాలు తొలగిపోతాయి. 2022 నుంచి కుజ మహర్దశ 7 సంవత్సరములు మీకు ఉజ్జ్వల భవిష్యత్తు ఉంది. ఏదైనా ఉద్యాన వనాల్లో మోదుగ చెట్టును నాటిన దోషాలు తొలగిపోతాయి. 
 
మీరు ఇచ్చిన అమ్మాయిది దశమి గురువారం మేష లగ్నము, మఖ నక్షత్రం, సింహ రాశి నందు జన్మించారు. లగ్నము నందు రవి, శుక్రులు ఉండటం వల్ల భర్త స్థానము నందు బృహస్పతి ఉండటం వల్ల ఆమె ఇష్టానుసారం వివాహం జరిగే అవకాశం ఉంది. యోగ్యుడు, ఉత్తముడు, విద్యావంతుడైన భర్త లభిస్తాడు. వివాహానంతరం ఆమెకు ఉజ్జ్వల భవిష్యత్తు ఉంది. 2017 వరకూ అర్థాష్టమ శనిదోషం ఉన్నందువల్ల నెలకు ఒక శనివారం నాడు 9 సార్లు నవగ్రహ ప్రదక్షణ చేసి శనిని పూజించి, అర్చించిన సర్వదా శుభం కలుగుతుంది. 2016 నందు మీకు వివాహం అవుతుంది. ఏదైనా దేవాలయంలో మఱ్ఱి చెట్టును నాటి దోషాలు తొలగిపోతాయి. మీ ఇద్దరి జాతకాలు బాగున్నాయి.
 
గమనిక: మీ సందేహాలను editor_telugu@webdunia.net కి పంపండి. పంపేముందు మీ పేరు, మీ పుట్టినతేదీ, పుట్టిన సమయం, పుట్టిన ఊరు రాయడం మర్చిపోవద్దు. జాతక ఫలితాల కోసం అత్యధిక సంఖ్యలో ప్రశ్నలను వీక్షకులు పంపిస్తూ ఉన్నారు. కనుక మీ ఫలితాల కోసం కాస్త వేచి ఉండగలరు. పంపిన వారందరివీ ప్రశ్నలు-సమాధానాలు శీర్షికలో ప్రచురించబడుతాయి. ఒకసారి ప్రశ్న పంపినవారు మళ్లీమళ్లీ అదే ప్రశ్నలను తిరిగి పంపవద్దు.

అన్నీ చూడండి

అసలే ఎండలు.. చాలదన్నట్లు ఏపీ గోదావరి జిల్లాల్లో తాగునీటి కొరత.. అలా చేయకపోతే..?

అమరావతి: స్మార్ట్ క్యాపిటల్ సిటీ కార్యక్రమాలు.. గ్రామాలను స్మార్ట్ గ్రామాలుగా తీర్చిదిద్ధుతాం..

Medical Shops: తెలంగాణలో మెడికల్ షాపుల బంద్

రేపటి నుంచి మీరు వర్క్ ఫ్రమ్ హోమ్ చేయండి అని చెప్పి ఇంటికెళ్లే లోపే పీకేసిన మెటా

సీఎం అయ్యానన్న ఆనందం నుంచి బైటపడక ముందే విజయ్‌కు ఎక్కడలేని నిరుత్సాహం, ఏంటది?

అన్నీ చూడండి

Tamil Nadu: కరుప్పుస్వామి ఆలయం... భక్తులకు ప్రసాదంగా నాణేలు.. వీడియో వైరల్

20-05-06 బుధవారం ఫలితాలు - అన్ని విధాలా శుభమే జరుగుతుంది

Chaturthi vrat: బుధవారం రోజున చతుర్థి వ్రతం పాటిస్తే..?

19-05-2026 మంగళవారం ఫలితాలు- అందరినీ కలుపుకుపోయేందుకు యత్నించండి

Mantra for tuesday: మంగళవారం ఏ మంత్రం జపించాలి.. మంగళ గాయత్రీ పఠనంతో..?

Show comments