ఇది అసలైన భారతదేశపు ఫేస్‌బుక్.... ShareChat App
ఎవరిచేత గుర్తించబడని ప్రేక్షకుల అవసరాలని తీర్చాలని ShareChat App నిశ్చయించుకుంది. ప్రాంతీయ భాషలు వాడే వారికోసం భారతదేశపు మొట్టమొదటి సోషల్ నెట్వర్క్, ShareChat నిర్మిస్తుంది. ప్రస్తుతానికి హిందీ, తెలుగ
ఎవరిచేత గుర్తించబడని ప్రేక్షకుల అవసరాలని తీర్చాలని ShareChat App నిశ్చయించుకుంది. ప్రాంతీయ భాషలు వాడే వారికోసం భారతదేశపు మొట్టమొదటి సోషల్ నెట్వర్క్, ShareChat నిర్మిస్తుంది. ప్రస్తుతానికి హిందీ, తెలుగు, మరాఠీ, మలయాళ భాషల్లో సేవలు అందిస్తున్న ShareChat త్వరలోనే మరిన్ని భాషల్లో రానుంది. 5,00,000 మంది నెలసరి ఆక్టివ్ యూసర్స్‌తో అప్పుడే మిలియన్ డౌన్లోడ్స్ చేరువలో ఉన్న ShareChat శరవేగంగా తమ యూసర్ బేస్ పెంచుకుంటూ పోతుంది.
ముగ్గురి ఐఐటి కాన్పూర్ పూర్వ విద్యార్థులు, Farid Ahsan, Bhanu Singh మరియు Ankush Sachdeva 2015లో ShareChatని ప్రారంభించారు. మన దేశంలో ఇంగ్లీష్ రాని వారి సంఖ్య ఎక్కువని అర్థం చేసుకోడానికి చిన్న పట్టణాలలో పెరిగిన ఈ ముగ్గురుకి ఎక్కువ సమయం పట్టలేదు. వీరి ఇంటర్నెట్ అవసరాలు మెట్రో ప్రేక్షకుల కంటే భిన్నంగా ఉంటాయని గమనించిన వీరు తమ చదువు పూర్తయిన వెంటనే యాప్ అభివృద్ధిని ప్రారంభించారు.
ShareChat Appలో యూసర్స్ తమ మాతృభాషలో కంటెంట్ పొందవచ్చు, పోస్ట్ చేయవచ్చు, మంచి కంటెంట్ పోస్ట్ చేసేవారిని ఫాలో అవ్వచ్చు మరియు నచ్చిన కంటెంట్‌ని అన్ని చాటింగ్ యాప్స్ లోకి షేర్ చేసుకోవచ్చు. ఫన్ ఫర్ వాట్సాప్‌లా మొదలైన ShareChat App, మొదటి సంవత్సరంలోపే ప్రతి రోజు లక్షకు పైగా కంటెంట్ పీసులు ఇతర యాప్స్ లోకి షేర్ అవుతున్నాయంటే, ఇలాంటి ఒక సామజిక వేదిక కోసం ShareChat యూసర్స్ ఎదురుచూస్తున్నారన్న దానికి ప్రతీక. అతి త్వరలోనే తమిళ, గుజరాతి, బెంగాలీ మరియు పంజాబీ భాషల్లో విడుదల చేసి పూర్తిస్థాయి సామాజిక వేదికగా అవతరించనుంది.
ఇటీవలే Google LaunchPad Accelerator programmeకి భారతదేశం తరపున ShareChat App సెలెక్ట్ అవ్వడం వీరి ప్రయత్నంలో గల సామర్థ్యాన్ని తెలుపుతుంది, $ 50000 నగదు బహుమతితో పాటు ఆరు నెలలు మెంటర్‌గా గూగుల్ సహాయం చేయనుంది. పశ్చిమ దేశాలకు ట్విట్టర్ ఎలానో మన భారతదేశానికి ShareChat అలా అవ్వనుంది. వివిధ రకాల యూసర్స్‌ని అన్ని సామాజిక నెట్వర్క్స్ కంటే వేగంగా ఆకర్షిస్తున్నందు వలన ఇది అసలైన భారతదేశపు ఫేస్‌బుక్‌గా అవతరించనుంది.