ఆదివారం, 1 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 23 అక్టోబరు 2021 (21:41 IST)

24-10-2021 నుంచి 30-10-2021 వరకు మీ వార రాశి ఫలితాలు (video)

మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము 
ప్రతికూలతలతో సతమతమవుతారు. ఆలోచనలు నిలకడగా ఉండవు. ఊహించని ఖర్చులు ఆందోళన కలిగిస్తాయి. ఏ పని మొదలు పెట్టినా మొదటికే వస్తుంది. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. ఆది, మంగళ వారాల్లో కావలసిన వ్యక్తుల కలయిక అనుకూలించదు. ఈ చికాకులు తాత్కాలికమే. పట్టుదలతో ముందుకు సాగండి బాధ్యతలు అప్పగించవద్దు. ఆత్మీయులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. అయిన వారు మీ అశక్తతను అర్థం చేసుకుంటారు. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. ఇంటి విషయాలపై శ్రద్ధ వహిస్తారు. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. ఉద్యోగస్తులకు యూనియన్ వ్యవహారాలతో తీరిక ఉండదు. విద్యాసంస్థలకు కొత్త సమస్యలెదురవుతాయి. స్పెక్యులేషన్ రంగాల వారికి ఆశాజనకం. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు 
సంప్రదింపులు నిరుత్సాహపరుస్తాయి. వ్యవహారాల్లో తప్పటడుగు వేస్తారు. సమర్థతకు ఏమంత గుర్తింపు ఉండదు. పట్టుదలతో యత్నాలు సాగించండి. ఆత్మీయుల రాక ఉత్సాహాన్నిస్తుంది. కొత్త పనులు ప్రారంభిస్తారు. బుధ, శుక్ర వారాల్లో అనవసర జోక్యం తగదు. ఖర్చులు సామాన్యం. పొదుపు పథకాలపై దృష్టి పెడతారు. ప్రైవేట్ సంస్థల్లో మదుపు తగదు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. సంస్థల స్థాపనకు అనుకూలం. వ్యాపారాల్లో పురోగతి, అనుభవం గడిస్తారు. భాగస్వామిక వ్యాపారాలు కలిసిరావు. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. నిరుద్యోగులకు శుభయోగం. న్యాయ, సేవా రంగాల వారికి ఆదాయాభివృద్ధి కనిపించకుండా పోయిన వస్తువులు, పత్రాలు లభ్యమవుతాయి. 
 
మిధునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు 
చాకచక్యంగా వ్యవహరిస్తారు. కష్టానికి తగ్గ ప్రతిఫలం అందుతుంది. అంచనాలు ఫలిస్తాయి. కొన్ని సమస్యల నుంచి బయటపడతారు. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. సోమ, మంగళ వారాల్లో పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. సంతానం ధోరణి చికాకుపరుస్తుంది. సామరస్యంగా మెలగండి. శుభకార్యం నిశ్చయమవుతుంది. వేదికలు అన్వేషిస్తారు. నగదు, విలువైన వస్తువులు జాగ్రత్త. బాధ్యతలు అప్పగించవద్దు. గృహ మరమ్మతులు చేపడతారు. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. ఉద్యోగ బాధ్యతల్లో అలక్ష్యం తగదు. యాదృచ్ఛికంగా తప్పులు దొర్లే ఆస్కారం ఉంది. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణ లభిస్తుంది. ఏజెంట్లు, మార్కెట్ రంగాల వారు టార్గెట్లను అధిగమిస్తారు. 

కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు 
మీ మాటకు ఎదురుండదు. వ్యవహారాలు సమర్థంగా నిర్వహిస్తారు. మీ సలహా ఉభయులకూ ఆమోగయోగ్యమవుతుంది. ఖర్చులు అదుపులో ఉండవు. మీ ఉన్నతిని చాటుకోవటానికి విపరీతంగా వ్యయం చేస్తారు. బుధవారం నాడు అప్రియమైన వార్తలు వలసి వస్తుంది. పనులు అర్ధాంతంగా నిలిపివేస్తారు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. గృహం ప్రశాంతంగా ఉంటుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం ఆసక్తి కలిగిస్తుంది. జాతక పొంతన విషయంలో రాజీ పడొద్దు. పాత పరిచయస్తులను కలుసుకుంటారు. గత సంఘటనలు అనుభూతినిస్తాయి. ఉద్యోగస్తులకు పురస్కార యోగం. అధికారులకు హోదామార్పు, స్థానచలనం. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. వృత్తుల వారికి సామాన్యం. వాహనం ఇతరులకివ్వవద్దు. 
 
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము 
మీ కష్టం ఫలిస్తుంది. పదవులు, బాధ్యతలు స్వీకరిస్తారు. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. బాధ్యతగా వ్యవహరించాలి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. గురు, శుక్ర వారాల్లో ఖర్చులు విపరీతం. డబ్బుకు లోటుండదు. సన్నిహితులకు సాయం అందిస్తారు. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. స్వల్ప అస్వస్థతకు గురవుతారు. అతిగా శ్రమించవద్దు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఏజెన్సీలు, మధ్యవర్తులను విశ్వసించవద్దు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. మీ శ్రీమతి సలహా పాటించండి. సంతానం ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. గృహమార్పు కలిసివస్తుంది. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. వృత్తి ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవ దీక్షలు స్వీకరిస్తారు. 
 
కన్య ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు 
ఆర్థిక లావాదేవీలతో తీరిక ఉండదు. చెల్లింపుల్లో జాగ్రత్త. అనుభవజ్ఞుల సలహా పాటించండి. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఒక సమాచారం ఆలోచింపచేస్తుంది. శుక్ర, శని వారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఏ విషయాన్ని తేలికగా తీసుకోవద్దు. పెద్దల జోక్యంతో ఒక సమస్య పరిష్కారమవుతుంది. ఆందోళన తగ్గి కుదుటపడతారు. మీ శ్రీమతి వైఖరిలో మార్పు వస్తుంది. ఉత్సాహంగా పనులు పూర్తి చేస్తారు. గృహంలో ప్రశాంతత నెలకొంటుంది. సంతానం చదువులపై దృష్టి సారించండి. అవివాహతులు శుభవార్తలు వింటారు. నిరుద్యోగుల కృషి ఫలిస్తుంది. ఉద్యోగస్తులకు ఓర్పు, ఏకాగ్రత ప్రధానం. అధికారుల తీరును గమనించి మెలగండి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. షాపు పనివారలతో జాగ్రత్త. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి.
 
తుల: చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు 
మీ తప్పిదాలను సరిదిద్దుకోండి. ఎవరినీ నిందించవద్దు. కలిసి వచ్చిన అవకాశాలు చేజారిపోతాయి. ఏ విషయం పై ఆసక్తి ఉండదు. ఆలోచనలతో సతమతమవుతారు. ఆప్తులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. ఖర్చులు అంచనాలను మించుతాయి. అవసరాలకు ధనం సర్దుబాటవుతుంది. ఆది, సోమ వారాల్లో పనులు, బాధ్యతలు స్వయంగా చూసుకోవాలి. దంపతుల మధ్య అవగాహన లోపం. ఇంటి విషయాలపై మరింత శ్రద్ధ వహించాలి. కనిపించకుండా పోయిన పత్రాలు లభ్యమవుతాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. కొత్త పరిచయాలేర్పడతాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. దళారులను విశ్వసించవద్దు. ఉపాధ్యాయులకు కష్టకాలం. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. సరుకు నిల్వలో జాగ్రత్త రవాణా రంగాల వారికి కొత్త సమస్యలెదురవుతాయి. ఆత్మీయుల క్షేమం తెలుసుకుంటారు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు 
ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. ఊహించని ఖర్చులుంటాయి. ధనం మితంగా వ్యయం చేయండి. అయిన వారితో విభేదిస్తారు. బుధ, గురు వారాల్లో ప్రముఖుల సందర్శనం వీలుపడదు. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. పనులు ముందుకు సాగవు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. మీ శ్రీమతి సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. గృహమార్పు అనివార్యం. సంతానం విషయంలో మంచే జరుగుతుంది. ఆరోగ్యం సంతృప్తికరం. ధార్మిక విషయాల పట్ల ఆసక్తి కలుగుతుంది. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. ఉమ్మడి వ్యాపారాలు కలిసిరావు. నిరుద్యోగులకు ఉపాధి శిక్షణావకాశం లభిస్తుంది. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. ఆస్తి వివాదాలు జటిలమవుతాయి. న్యాయ నిపుణులతో సంప్రదింపులు జరుపుతారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము
మీ అభిరుచికి తగ్గ వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. అందరినీ ఆకట్టుకుంటారు. కార్యక్రమాలు నిర్విఘ్నంగా సాగుతాయి. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. గుట్టుగా వ్యవహరించండి. ప్రత్యర్థులతో జాగ్రత్త. ఆదాయం బాగుంటుంది. ఆప్తులకు సాయం అందిస్తారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పనులు సానుకూలమవుతాయి. ఉత్సాహంగా గడుపుతారు. దంపతులకు కొత్త ఆలోచనలు స్ఫురిస్తాయి. వేడకకు సన్నాహాలు సాగిస్తారు. సంతానం అత్యుత్సాహాన్ని అదుపు చేయండి. పనివారల నిర్లక్ష్యం చికాకుపరుస్తుంది. విలువైన వస్తువులు మరమ్మతుకు గురవుతాయి. వ్యాపారాల్లో ఆటుపోట్లను దీటుగా ఎదుర్కుంటారు. షాపుల స్థలమార్పు అనివార్యం. ఉద్యోగస్తుల కార్యక్రమాలు ప్రశాంతంగా సాగుతాయి. సన్మాన, సాహిత్య సభల్లో ప్రముఖంగా పాల్గొంటారు. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు 
ఈ వారం ఆశాజనకం. కార్యసాధనకు అవిశ్రాంతంగా శ్రమిస్తారు. అవకాశాలు కలిసివస్తాయి. కొంత మొత్తం ధనం అందుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. అంచనాలు ఫలిస్తాయి. వ్యాపకాలు సృష్టించుకుంటారు. బంధువులతో తెగిపోయిన సంబంధాలు బలపడతాయి. కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. పనుల్లో ఒత్తిడి, చికాకులు అధికం. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. వ్యవహార ఒప్పందాల్లో మెలకువ వహిచండి. ప్రలోభాలకు లొంగవద్దు. మీ శ్రీమతికి అన్ని విషయాలు తెలియజేయండి. సంతానం ధోరణి చికాకు పరుస్తుంది. అనునయంగా మెలగండి. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. పెట్టుబడులకు తరుణం కాదు. ఉద్యోగస్తులకు యూనియన్‌లో గుర్తింపు లభిస్తుంది. పురస్కారాలు అందుకుంటారు. ద్విచక్ర వాహన చోదకులకు దూకుడు తగదు. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదములు 
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. సమర్థతకు ఏమంత గుర్తింపు ఉండదు. అంచనాలు నిరుత్సాహపరుస్తాయి. పట్టుదలతో మెలగండి. ఏ విషయాన్ని తీవ్రంగా పరిగణించవద్దు. దుబారా ఖర్చులు విపరీతం. సోమ, మంగళ వారాల్లో ఆందోళనకర సంఘటనలెదురవుతాయి. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. పనులు అర్ధాంతంగా నిలిపివేయవలసి వస్తుంది. ఆప్తుల సాయంతో ఒక సమస్య సానుకూలమవుతుంది. ఒత్తిడి తగ్గి కుదుటపడతారు. వ్యాపకాలు అధికమవుతాయి. సంతానం భవిష్యత్తుపై దృష్టి పెడతారు. ఇతరులను మీ విషయాలకు దూరంగా ఉంచండి. ఆరోగ్యం నిలకడగా ఉంటుంది. వ్యాపారాలు అంతంత మాత్రంగా సాగుతాయి. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. విదేశీయాన యత్నాలను విరమించుకుంటారు.
 
 
మీనం : పూర్వాభాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు 
వాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఆశించిన సంబంధం కలిసిరాదు. ఓర్పుతో వ్యవహరించండి. కొన్ని విషయాలు పెద్దగా పట్టించుకోవద్దు. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. రాబోయే ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపునకు అవకాశం తక్కువ. కొత్త పనులకు శ్రీకారం చుడతారు. బుధ, శని వారాల్లో అనవసర జోక్యం తగదు. మీ శ్రీమతి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. అయిన వారితో సంప్రదింపులు జరుపుతారు. మీ ప్రతిపాదనలకు ఆమోదం లభిస్తుంది. సావకాశంగా పనులు పూర్తి చేస్తారు. వ్యాపకాలు అధికమవుతాయి. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. హోల్సేల్ వ్యాపారులకు కొత్త సమస్యలెదురవుతాయి. నిరుద్యోగులకు శుభయోగం. ఉద్యోగస్తులకు పనిభారం. అధికారులకు వీడ్కోలు పలుకుతారు. ఆధ్యాత్మిక చింతన పెరుగుతుంది. దైవదీక్షలు స్వీకరిస్తారు.