శనివారం, 11 జనవరి 2025
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వారఫలం
Written By రామన్
Last Updated : శనివారం, 26 మార్చి 2022 (22:59 IST)

27-03-2022 నుంచి 02-04-2022 వరకు మీ వార రాశిఫలాలు

మేషం : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు. కృత్తిక 1వ పాదము 
ఆదాయ వ్యయాలు సంతృప్తికరం. ప్రణాళికలు వేసుకుంటారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. సలహాలు, సహాయం ఆశించవద్దు. స్వయంకృషితోనే రాణిస్తారు. పనులు అస్తవ్యస్తంగా సాగుతాయి. ఆత్మీయులను విందులు, వేడుకలకు ఆహ్వానిస్తారు. మంగళ, బుధ వారాల్లో ఒక సమాచారం ఆందోళన కలిగిస్తుంది. పెద్దలతో సంప్రదింపులు జరుపుతారు. మీ శ్రీమతి వైఖరి అసహనం కలిగిస్తుంది. ఓర్పుతో మెలగండి. ఏ విషయాన్ని తీవ్రంగా పరిగణించవద్దు. ఎదురుచూస్తున్న పత్రాలు అందుతాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. ప్రస్తుత వ్యాపారాలే శ్రేయస్కరం. దస్త్రం వేడుకను ఘనంగా చేస్తారు. ఉద్యోగస్తులకు ఒత్తిడి, పనిభారం. అధికారులకు హోదామార్పు, స్థానచలనం. వృత్తి ఉపాధి పథకాలు సామాన్యంగా సాగుతాయి. 
 
వృషభం : కృత్తిక 2, 3, 4 పాదములు, రోహిణి, మృగశిర 1, 2, పాదములు 
ప్రతిభాపాటవాలు వెలుగులోకి వస్తాయి. వ్యవహారాలను సమర్థంగా నిర్వహిస్తారు. ధనలాభం ఉంది. ఖర్చులు అదుపులో ఉండవు, విలాసాలకు విపరీతంగా వ్యయం చేస్తారు. గురువారం నాడు చేసిన పనులే చేయవలసి వస్తుంది. పదవుల కోసం యత్నాలు సాగిస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్త. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. ఒక ఆహ్వానం ఉత్సాహాన్నిస్తుంది. బంధువులతో సత్సంబంధాలు నెలకొంటాయి. వాస్తుదోష నివారణ చర్యలు చేపడతారు. విలువైన వస్తువులు, పత్రాలు జాగ్రత్త. నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కలిసివస్తాయి. మార్కెట్ రంగాల వారికి ఆదాయాభివృద్ధి. బిల్డర్లు, కార్మికులకు సదవకాశాలు లభిస్తాయి. వ్యాపారాల్లో లాభనష్టాలు సమీక్షించుకుంటారు. నూతన వ్యాపారాలకు అనుకూలం. ధార్మిక, యోగాలపై ఆసక్తి పెంపొందుతుంది. ఆలయాలు సందర్శిస్తారు. 
 
మిథునం : మృగశిర 3, 4 పాదములు, ఆర్ద్ర, పునర్వసు 1, 2, 3 పాదములు 
పరిస్థితులు క్రమంగా మెరుగుపడతాయి. ఆలోచనల్లో మార్పు వస్తుంది. చాకచక్యంగా వ్యవహరిస్తారు. ఆదాయం సంతృప్తికరం. ఊహించిన ఖర్చులే ఉంటాయి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం నిరుత్సాహపరుస్తుంది. ఏది జరిగినా ఒకందుకు మంచిదే. పనులు మొండిగా పూర్తి చేస్తారు. సోమ, మంగళవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. మీ పెద్దరికానికి భంగం కలుగకుండా మెలగండి. దంపతుల మధ్య అకారణ కలహం. పంతాలకు పోవద్దు. సంతానం విషయంలో శుభ పరిణామాలున్నాయి. వృత్తి వ్యాపారాల్లో నిలదొక్కుకుంటారు. హోల్‌సేల్ వ్యాపారులకు ఆదాయాభివృద్ధి,
ప్రైవేట్ సంస్థ ఉద్యోగస్తులకు కొత్త సమస్యలెదురవుతాయి. ఉపాధ్యాయులకు స్థానచలనం. కీలక సమావేశాల్లో పాల్గొంటారు. 
 
కర్కాటకం : పునర్వసు 4వ పాదము, పుష్యమి, ఆశ్లేష 1, 2, 3, 4 పాదములు 
ప్రతికూలతలు అధికం. అప్రమత్తంగా ఉండాలి. అనాలోచిత నిర్ణయాలు తగవు. పెద్దల సలహా పాటించండి. మంచి చేయబోతే చెడు ఎదురవుతుంది. ఊహించని ఖర్చులుంటాయి, ధనం మితంగా వ్యయం చేయండి. మొక్కుబడిగా పనులు పూర్తి చేస్తారు. ఆప్తులతో సంభాషణ ఉపశమనం కలిగిస్తుంది. వ్యాపకాలు సృష్టించుకుంటారు. బుధ, గురువారాల్లో నగదు, పత్రాలు జాగ్రత్త, బాధ్యతలు అప్పగించవద్దు. పిల్లల చదువులపై శ్రద్ధ వహించండి. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. కొత్త యత్నాలకు శ్రీకారం చుడుతారు. అవకాశాలను తక్షణం వినియోగించుకోండి. వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. షాపుల స్థల మార్పు అనివార్యం. వృత్తుల వారికి నిరాశాజనకం. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. వాహనం ఇతరులకివ్వవద్దు. పుణ్యకార్యంలో పాల్గొంటారు. 
 
సింహం : మఖ, పుబ్బ 1, 2, 3, 4, పాదములు, ఉత్తర 1వ పాదము 
అవిశ్రాంతంగా శ్రమిస్తారు. సమర్ధతకు ఏమంత గుర్తింపు ఉండదు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఖర్చులు అదుపులో ఉండవు. పెరిగిన ధరలు ఆందోళన కలిగిస్తాయి. ఒక ఆహ్వానం సందిగ్దానికి గురిచేస్తుంది. పనులు అనుకున్న విధంగా సాగవు. శుక్ర, శనివారాల్లో దంపతుల మధ్య అకారణ కలహం. మీ ఆగ్రహావేశాలు అదుపులో ఉంచుకోండి. ఇంటి విషయాలపై మరింత శ్రద్ధ వహించాలి. ఆరోగ్యం మందగిస్తుంది. వైద్యసేవలు అవసరమవుతాయి. గృహంలో మార్పుచేర్పులకు అనుకూలం. సంతానం విషయంలో శుభపరిణామాలున్నాయి. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. అధికారులకు హోదామార్పు, స్థానచలనం. వ్యాపారాభివృద్ధికి పథకాలు రూపొందిస్తారు. చిరు వ్యాపారులకు కష్టకాలం. వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. 
 
కన్య ఉత్తర 2, 3, 4 పాదములు, హస్త, చిత్త 1, 2 పాదములు 
కొత్త యత్నాలకు శ్రీకారం చుడతారు. అవకాశాలను తక్షణం అందిపుచ్చుకోండి. సలహాలు, సాయం ఆశించవద్దు. కొంతమంది వ్యాఖ్యలు ఉద్రేకపరుస్తాయి. సంయమనంతో మెలగండి. ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. ఆదాయం బాగున్నా సంతృప్తి ఉండదు. ఖర్చులు విపరీతం. పనులు హడావుడిగా పూర్తి చేస్తారు. ఆదివారం నాడు ప్రముఖుల ఇంటర్వ్యూ అనుకూలించదు. మీ ఆలోచనల్లో మార్పు వస్తుంది. సంతానం ఉన్నత చదువులను వారి ఇష్టానికే వదిలేయండి. ఆత్మీయుల ఆహ్వానం సంతోషపరుస్తుంది. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. అవివాహితులకు శుభయోగం. వృత్తి ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. ఉపాధ్యాయులకు ఆకస్మిక స్థానచలనం. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. వేడుకల్లో అత్యుత్సాహం తగదు.
 
తుల: చిత్త 3, 4 పాదములు, స్వాతి, విశాఖ 1, 2, 3 పాదములు 
ఆర్ధికంగా నిలదొక్కుకుంటారు. రావలసిన ధనం అందుతుంది. ప్రణాళికలు వేసుకుంటారు. పెట్టుబడులు కలిసిరావు. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం నిరుత్సాహపరుస్తుంది. పనులు మొక్కుబడిగా పూర్తి చేస్తారు. ఆలోచనలు పలు విధాలుగా ఉంటాయి. ఏ విషయంపై ఆసక్తి ఉండదు. మంగళ, బుధవారాల్లో కొత్త వ్యక్తులతో జాగ్రత్త. మీ బలహీనతలను అదుపులో ఉంచుకోండి. మీ శ్రీమతి సలహా పాటించి లబ్ది పొందుతారు. ఆందోళన కలిగించిన సమస్య సద్దుమణుగుతుంది. ఉద్యోగస్తులకు ఏకాగ్రత ప్రధానం. ప్రైవేట్ సంస్థ ఉద్యోగస్తులకు కష్టకాలం. మార్కెట్ రంగాల వారు టార్గెట్లను పూర్తి చేస్తారు. వ్యాపారాలు సామాన్యంగా సాగుతాయి. వృత్తుల వారికి సామాన్యం. పోగొట్టుకున్న వస్తువులు లభ్యం కావు. బెట్టింగ్ జోలికి పోవద్దు. 
 
వృశ్చికం : విశాఖ 4వ పాదము. అనూరాధ, జ్యేష్ట 1,2,3,4 పాదములు 
వ్యవహారానుకూలత ఉంది. అనుకున్నది సాధిస్తారు. పదవుల స్వీకరణకు అనుకూలం. వ్యతిరేకులు సన్నిహితులవుతారు. పరిచయాలు బలపడతాయి. ఖర్చులు అదుపులో ఉండవు. బంధువుల రాకపోకలు అధికమవుతాయి. గురు, శుక్రవారాల్లో పనులు, బాధ్యతలు అప్పగించవద్దు. ఫోన్ సందేశాల పట్ల అప్రమత్తంగా ఉండాలి. బ్యాంకు వివరాలు గోప్యంగా ఉంచండి. ప్రతి విషయం క్షుణ్ణంగా తెలుసుకోవాలి. దంపతుల మధ్య సఖ్యత నెలకొంటుంది. అయిన వారితో ఉల్లాసంగా గడుపుతారు. గృహమార్పు అనివార్యం. ఆరోగ్యం జాగ్రత్త. అతిగా శ్రమించవద్దు. వ్యాపారాలు ఊపందుకుంటాయి. ఆటుపోట్లను ధీటుగా ఎదుర్కుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు ఏమంత సంతృప్తినీయవు. ఉపాధి పథకాల్లో నిలదొక్కుకుంటారు. ఆత్మీయులకు ఘనంగా వీడ్కోలు పలుకుతారు. 
 
ధనస్సు : మూల, పూర్వాషాడ 1 2 3 4 పాదములు, ఉత్తరాషాడ 1వ పాదము
ఈ వారం అన్ని విధాలా శుభదాయకం. ఆశలొదిలేసుకున్న బాకీలు వసూలవుతాయి. ఒత్తిడి తగ్గి కుదుటపడతారు. సమర్ధతకు గుర్తింపు లభిస్తుంది. ఆపన్నులకు సాయం అందిస్తారు. పరిచయాలు ఉన్నతికి తోడ్పడతాయి. కొత్త పనులు ప్రారంభిస్తారు. విలువైన వస్తువులు, నగదు జాగ్రత్త. ఇతరుల విషయాల్లో జోక్యం తగదు. శుభకార్యానికి హాజరవుతారు. సంతానం దూకుడు అదుపు చేయండి. గృహ మరమ్మతులు చేపడతారు. ఉమ్మడి వ్యాపారాలు కలిసివస్తాయి. సరుకు నిల్వలో జాగ్రత్త. ఉద్యోగస్తులకు పదవీయోగం, ఉపాధ్యాయులకు స్థానచలనం, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. కార్మికులకు సదవకాశాలు లభిస్తాయి. ఆధ్యాత్మికత పెంపొందుతుంది. వాయిదా పడిన మొక్కులు తీర్చుకుంటారు. విదేశాల నుంచి ఆత్మీయుల రాక ఉత్సాహాన్నిస్తుంది. 
 
మకరం : ఉత్తరాషాడ 2, 3, 4 పాదములు. శ్రవణం, ధనిష్ట 1, 2 పాదములు 
ఆదాయానికి తగ్గట్టుగా ఖర్చులుంటాయి. పొదుపునకు అవకాశం లేదు. కొత్త విషయాలు తెలుసుకుంటారు. ఆలోచనలు కార్యరూపం దాల్చుతాయి. పనుల్లో ఒత్తిడి, శ్రమ అధికం. దంపతుల మధ్య అవగాహన నెలకొంటుంది. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. పరిచయాలు బలపడతాయి. పిల్లల భవిష్యత్తుపై దృష్టి పెడతారు. పెద్దల ఆరోగ్యం మెరుగుపడుతుంది. సోదరులతో సత్సంబంధాలు నెలకొంటాయి. ఆస్తి వివాదాలకు పరిష్కారం గోచరిస్తుంది. రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో మెలకువ వహించండి. ఉద్యోగస్తులకు ఏకాగ్రత, సమయపాలన ప్రధానం. ఉపాధి పథకాలు సంతృప్తినిస్తాయి. వ్యాపారాల్లో స్వల్ప చికాకులు మినహా ఇబ్బందులుండవు. హోల్‌సేల్ వ్యాపారులకు పురోభివృద్ధి. నిర్మాణాలు ఊపందుకుంటాయి. కార్మికులకు కొత్త పనులు లభిస్తాయి. వాహనం నడిపేటప్పుడు జాగ్రత్త. 
 
కుంభం : ధనిష్ట 3, 4 పాదములు, శతభిషం, పూర్వాబాద్ర 1, 2, 3 పాదములు 
ముఖ్యకార్యాల్లో ఏకాగ్రత వహించాలి. ఎవరినీ అతిగా విశ్వసించవద్దు. ఆంతరంగిక విషయాలు గోప్యంగా ఉంచండి. దుబారా ఖర్చులు విపరీతం. ఒక అవసరానికి ఉంచిన ధనం మరోదానికి వ్యయం చేస్తారు. పనుల సానుకూలతకు మరింతగా శ్రమించాలి. సంతానం మొండితనం అసహనం కలిగిస్తుంది. ఆగ్రహావేశాలు ప్రదర్శించవద్దు. ఆది, సోమవారాల్లో కొత్త సమస్యలెదురవుతాయి. అందరితో మితంగా సంభాషించండి. ఆత్మీయుల కలయిక ఉత్సాహాన్నిస్తుంది. వేడుకకు హాజరవుతారు. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. షాపుల స్థలమార్పు కలిసివస్తుంది. నూతన వ్యాపారాలకు యత్నాలు సాగిస్తారు. పర్మిట్లు, లైసెన్సులు మంజూరవుతాయి. ఉద్యోగస్తులకు ధనప్రలోభం తగదు. న్యాయ, సాంకేతిక రంగాల వారికి ఆదాయాభివృద్ధి. కోర్టు వాయిదాలు నిరుత్సాహపరుస్తాయి. 
 
మీనం : పూర్వాబాద్ర 4వ పాదము, ఉత్తరాభాద్ర, రేవతి 1, 2, 3, 4 పాదములు 
కార్యసాధనకు ఓర్పు ప్రధానం. ఆశావహదృక్పథంతో మెలగండి. మీ కృషి త్వరలో ఫలిస్తుంది. ధనలాభం, వస్త్రప్రాప్తి ఉన్నాయి. ఖర్చులు అధికం, ప్రయోజనకరం. ఒక వ్యవహారంలో మీ జోక్యం అనివార్యం. ఆప్తులకు చక్కని సలహాలిస్తారు. పనులు అనుకున్న విధంగా పూర్తవుతాయి. ఆశించిన పదవులు దక్కకపోవచ్చు. ప్రత్యర్థుల తీరు ఆందోళన కలిగిస్తుంది. కొన్ని విషయాలు పెద్దగా పట్టించుకోవద్దు. మంగళ, బుధవారాల్లో అప్రమత్తంగా ఉండాలి. బాధ్యతలు అప్పగించవద్దు. శ్రీమతి ఆరోగ్యం ఆందోళన కలిగిస్తుంది. కార్యక్రమాలు వాయిదా వేసుకుంటారు. ఉద్యోగ బాధ్యతల్లో మెలకువ వహించండి. ఒత్తిళ్లు, ప్రలోభాలకు లొంగవద్దు. వ్యాపారాల్లో లాభాలు గడిస్తారు. ఉమ్మడి వ్యాపారాలు కలిసివస్తాయి. నిర్మాణాలు మందరొడిగా సాగురాయి. బిల్డర్లు, కార్మికులకు కష్ట సమయం.