గురువారం, 12 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వార్షిక ఫలం
Written By రామన్
Last Updated : మంగళవారం, 10 డిశెంబరు 2024 (21:54 IST)

Cancer Zodiac Sign: కర్కాటక రాశి 2025 వార్షిక ఫలితాలు : ఉమ్మడిగా కంటే సొంత వ్యాపారాలే?

Cancer Zodiac Sign
Cancer Zodiac Sign
కర్కాటక రాశి : పునర్వసు 4వ పాదం, పుష్యమి, ఆశ్లేష
 
ఆదాయం 2.
వ్యయం 8
రాజపూజ్యం: 7
అవమానం: 3
 
2025 సంవత్సరం కర్కాటక రాశి వారికి ఖర్చులు అధికమవుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగ ప్రయత్నం సఫలీకృతమవుతుంది. ఉద్యోగస్తులకు పని ఒత్తిళ్ళు, చికాకులు కలుగును. అయినప్పటికి ప్రమోషన్లు వంటివి అనుకూలిస్తాయి. 
 
ఉద్యోగ మార్పు వంటివి కలసివస్తాయి. ఈ సంవత్సరం కర్కాటక రాశి జాతకులు ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండాలి. సర్జరీలు జరిగే అవకాశం ఉన్న కారణంగా మెట్లు ఎక్కేటప్పుడు, దిగేటప్పుడు, నీళ్లలో నడిచేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. 
 
ఈ సంవత్సరం వ్యాపారం ప్రారంభించాలంటే అనుకూలమైన పరిస్థితి ఉంది. కళాకారులకు విశేషించి అనుకూలంగా ఉండబోతోంది. 2025 సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఉన్న ప్రధానమైన సమస్య గురువు వ్యయంలో ఉండడం. దీనివల్ల చిన్నచిన్న ఇబ్బందులు మినహాయించి మిగతా అంతా కర్కాటక రాశి జాతకులకు సజావుగా సాగుతుంది. ఒకరకంగా చెప్పాలంటే కర్కాటక రాశి జాతకులు విపరీతమైన రాజయోగంతో అన్ని రంగాలలోనూ పురోగతిని సాధిస్తారు. ఉమ్మడిగా కంటే సొంత వ్యాపారాలే లాభదాయకం
 
ఈ సంవత్సరం పెట్టుబడి పెట్టవచ్చు. అది మీకు మంచి లాభాలను ఇస్తుంది. అదృష్టం మీకు అనుకూలంగా ఉంటుంది. మీ కృషితో, మీరు మీ కష్ట సమయాలను విజయవంతంగా ఉజ్వల భవిష్యత్తుగా మార్చుకుంటారు. సోమరితనంకు బైబై చెప్పేయండి. 
 
విద్య, ఇంజినీరింగ్, వైద్య రంగానికి సంబంధించిన ఉద్యోగాలు చేస్తున్న వారికి ఈ సంవత్సరం చాలా మంచి అవకాశాలు వస్తాయి. మీ కెరీర్ ఊపందుకుంటుంది. ఇతర రంగాల వారు కూడా వారి చదువును బట్టి ఉద్యోగాలు పొందవచ్చు. టెక్నికల్ రంగంలో ముఖ్యంగా సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ వారికి మంచి ఆఫర్లు వస్తాయి. విదేశాల్లో చదువుకోవాలనుకునే విద్యార్థులు వీసా కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. విష్ణుసహస్రనామ పారాయణం, హనుమాన్ చాలీసా 
పఠనం ఈ రాశివారికి సర్వదా శుభదాయకం.