వృషభ రాశి 2025 రాశి ఫలితాలు - అమ్మవారికి కుంకుమార్చనలు చేస్తే?
వృషభ రాశి : కృత్తిక 2, 3, 4 పాదాలు, రోహిణి, మృగశిర 1, 2, పాదాలు
ఆదాయం: 11
వ్యయం: 5
మీ రాజపూజ్యం: 1
అవమానం: 3
ఈ సంవత్సరం వీరి గురు సంచారం అనుకూలంగా ఉంది. నిర్దిష్ట ప్రణాళికలతో యత్నాలు సాగిస్తారు. శ్రమకు తగిన ఫలితాలున్నాయి. సంఘంలో పేరు ప్రతిష్టలు గడిస్తారు. ఆదాయం బాగుంటుంది. ఆలయాలు, ఆపన్నులకు సహాయ సహకారాలు అందిస్తారు. పెట్టుబడులకు అనుకూలం. పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. పదవులు, సభ్యత్వాలు స్వీకరిస్తారు. ప్రత్యర్థులతో జాగ్రత్తగా ఉండాలి.
ఎవరినీ తక్కువ అంచనా వేయొద్దు. వ్యవహారాలు మీ సమక్షంలో సాగుతాయి. దంపతుల మధ్య అనురాగ వాత్సల్యాలు వెల్లివిరుస్తాయి. వివాహయత్నం ఫలిస్తుంది. శుభకార్యాలను ఆర్భాటంగా చేస్తారు. ఒక సమాచారం ఉత్సాహాన్నిస్తుంది. గృహంలో మార్పుచేర్పులు చేపడతారు.
ముఖ్యమైన వస్తువులు జాగ్రత్త. మీ సిఫార్సుతో ఒకరికి ఉద్యోగం లభిస్తుంది. ప్రైవేట్ సంస్థల ఉద్యోగస్తులకు మార్పులు అనుకూలిస్తాయి. ఉద్యోగపరంగా మంచి ఫలితాలున్నాయి. ప్రలోభాలకు లొంగవద్దు. అధికారులకు కొత్త సమస్యలెదురవుతాయి. ఉపాధ్యాయులకు పదవీయోగం, కోరుకున్న చోటికి బదిలీ. పారిశ్రామిక రంగాల వారికి ప్రోత్సాహకరం. వృత్తుల వారికి ఆదాయం బాగుంటుంది.
హోల్సేల్ వ్యాపారులు, స్టాకిస్టులకు పురోభివృద్ధి. వస్త్రవ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. షాపుల స్థలమార్పు అనివార్యం. భవన నిర్మాణాలు ఊపందుకుంటాయి. బిల్డర్లు, కార్మికులకు ఆశాజనకం. ఉపాధి పథకాలు కలిసివస్తాయి. తరుచు ప్రయాణం చేయవలసి వస్తుంది. ఆరోగ్యం జాగ్రత్త.
తరచు వైద్యపరీక్షలు చేయించుకోవటం శ్రేయస్కరం. పెద్దల గురించి ఆందోళన చెందుతారు. ప్రేమ వ్యవహారాలు వికటిస్తాయి. వివాదాల్లో మీ ప్రమేయం లేకుండా చూసుకోండి. భూ సంబంధిత వివాదాలు కొలిక్కివస్తాయి. ప్రశాంతతకు అమ్మవారికి కుంకుమార్చనలు, లలితాసహస్రనామ స్తోత్ర పారాయణం చేయండి.