గురువారం, 12 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. వార్షిక ఫలం
Written By రామన్
Last Updated : సోమవారం, 9 డిశెంబరు 2024 (21:06 IST)

2025 మేష రాశి- ఆదాయం : 2, వ్యయం : 14, రాజపూజ్యం: 5, అవమానం : 7

Aries
Aries


మేష రాశి : అశ్వని, భరణి 1, 2, 3, 4 పాదములు, కృత్తిక 1వ పాదం

ఆదాయం  : 2
వ్యయం : 14
రాజపూజ్యం: 5
అవమానం : 7
 
ఈ రాశివారి గ్రహస్థితి పరిశీలించగా ఈ సంవత్సరం మిశ్రమ ఫలితాలు గోచచిస్తున్నాయి. ఆదాయ వ్యయాలకు పొంతన ఉండదు. తరచు ధనసమస్యలెదుర్కుంటారు. ఖర్చులు నియంత్రించుకోవాలసిన అవసరం ఎంతైనా ఉంది. ఆత్మీయుల సాయంతో ఇబ్బందులు తొలగుతుంటాయి. 
 
వ్యవహార లావాదేవాదేవీల్లో అప్రమత్తంగా ఉండాలి. వివాహయత్నాలు తీవ్రంగా సాగిస్తారు. ఒక సంబంధం కలిసివచ్చే సూచనలున్నాయి. స్థిరాస్తి అమర్చుకోవాలనే ఆశయం నిదానంగా ఫలిస్తుంది. దంపతుల మధ్య అకారణ కలహాలు. సామరస్యంగా సమస్యలు పరిష్కరించుకోవాలి. ఒకరు ఎక్కువ, మరొకరు తక్కువ అనే న్యూనతాభావానికి గురికావద్దు. బంధుత్వాలు, పరిచయాలు బలపడతాయి. 
 
సోదరీ సోదరుల మధ్య అవగహన నెలకొంటుంది. ఆస్తి వివాదాలు పరిష్కార దిశగా సాగుతాయి. నిరుద్యోగులకు ఉద్యోగయోగం. అధికారులకు స్థానచలనం. వ్యాపారాలు ప్రోత్సాహకరంగా సాగుతాయి. భాగస్వామిక వ్యాపారాల విషయంలో పునరాలోచన మంచిది. 
 
పరిశ్రమలు, గృహ నిర్మాణాలకు అనుమతులు మంజూరవుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షల్లో సామాన్య ఫలితలే సాధిస్తారు. మరింత శ్రద్ధ వహిస్తే ఆశించిన ఫలితాలు సాధించగలరు. ఆరోగ్యం పట్ల తగు జాగ్రత్తలు తీసుకోండి. తరుచు వేడుకలు, శుభకార్యాల్లో పాల్గొంటారు. దూరప్రయాణం చేయవలసి వస్తుంది. 
 
ఆధ్మాత్మిక విషయాలపై ఆసక్తి కలిగిస్తుంది. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వాహనం నడిపేటపుడు జాగ్రత్తగా ఉండాలి. న్యాయ, వైద్య, సాంకేతిక రంగాల వారికి ఆదాయం బాగుంటుంది. సంఘంలో పలుకుబడి కలిగిన వ్యక్తులతో పరిచయాలేర్పడతాయి. ఆశయసిద్ధికి శనీశ్వరునికి తైలాభిషేకం, సుబ్రహ్మణ్య ఆరాధన శుభదాయకం.