గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : సోమవారం, 25 నవంబరు 2024 (19:50 IST)

2025 మేషరాశి వారికి విద్యావకాశాలు ఎలా వుంటాయంటే?

Education
2025 మేష రాశి వారికి విద్యావకాశాలు ఎలా వుంటాయో తెలుసుకుందాం..
 
2025లో మేషరాశి వారు ఉన్నత చదువుల కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటే మంచే జరుగుతుంది. 2025 మొదటి అర్ధ భాగంలో విదేశాలకు వెళ్లే అవకాశాలు లభిస్తాయి. జనవరి 2025 నుండి 31 మార్చి 2025 వరకు విద్యార్థులు కాస్త విద్యలో రాణించడం కష్టం. నిర్లక్ష్యం, అశ్రద్ధ ఆవహిస్తుంది. ఫిబ్రవరి మధ్య నుండి, ప్రాథమిక విద్యను అభ్యసించే విద్యార్థులు చదువుల కోసం ఎక్కువ సమయాన్ని వెచ్చించడం ప్రారంభిస్తారు. ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు చక్కని సలహాలు లభిస్తాయి.
 
రెండవ త్రైమాసికం
- ఏప్రిల్ 1 2025 నుండి 30 జూన్ 2025 వరకు: గ్రాడ్యుయేషన్ వంటి ప్రాథమిక విద్యను అభ్యసించే విద్యార్థులకు కలిసివచ్చే కాలం. ప్రతిభను కనబరుస్తారు. గ్రాడ్యుయేషన్ చేస్తున్న విద్యార్థులు ప్రోత్సాహకరంగా పురోగతిని సాధిస్తారు. పరీక్షలో రాణిస్తారు.
 
మూడవ త్రైమాసికం జూలై 
1 2025 నుండి 30 సెప్టెంబర్ 2025 వరకు: గ్రాడ్యుయేషన్ చేస్తున్న విద్యార్థులు చదువుతున్నప్పుడు ఎక్కువ గంటలు బాగా ఏకాగ్రతతో చదవగలరని గ్రహాల కదలిక సూచిస్తుంది.
 
నాల్గవ త్రైమాసికం
 అక్టోబర్ 1 2025 నుండి 31 డిసెంబర్ 2025 వరకు: ప్రాథమిక విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు అధిక సమయాన్ని విద్య కోసం కేటాయిస్తారు. విద్యార్థులు ఈ కాలంలో  అధ్యయనాల కోసం తగినంత సమయాన్ని వెచ్చిస్తారు. తద్వారా పురోగతిని సాధించగలుగుతారు.