శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 22 నవంబరు 2024 (11:51 IST)

2025లో వృషభ రాశి కెరీర్, వ్యాపారం ఎలా వుంటుందంటే?

Taurus Career
Taurus Career
2025లో వృషభ రాశి కెరీర్, వ్యాపారం ఎలా వుంటుందో తెలుసుకుందాం.. 
 
మొదటి త్రైమాసికం.. 
1 జనవరి 2025 నుండి 31 మార్చి 2025 వరకు: గ్రహాల కదలిక ప్రారంభంలో వ్యాపారంలో లాభం వుంటుంది. జనవరి నెలాఖరు నుండి, వ్యాపారంలో పురోగతి వుంటుంది. కెరీర్ పరంగా మెరుగైన అవకాశాలు వెతుక్కుంటూ వస్తాయి. 
 
వృషభం 2025 కెరీర్ రెండవ త్రైమాసికం
1 ఏప్రిల్ 2025 నుండి 30 జూన్ 2025 వరకు: వ్యాపారవేత్తలకు అనుకూలం. ఏప్రిల్ చివరి నుండి వీరికి వ్యాపారంలో అభివృద్ధి చేకూరుతుంది. మే మధ్య నుండి మీ రాశికి అధిపతి అయిన శుక్రుడు మిథునరాశిలో సంచరిస్తున్నాడు. జూన్ చివరి వారం చివరిలో శుక్రుడు తిరోగమనం సమయంలో కొత్త కస్టమర్‌కు క్రెడిట్‌ని అందజేసేటప్పుడు వ్యాపారులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. కుజుడు మేష రాశిలోకి ప్రవేశించి జూన్ చివరి నుండి 12వ ఇంటి గుండా కదులుతాడు. తద్వారా 2025 వృషభ రాశి వారి కెరీర్‌లో అభివృద్ధి వుంటుంది. 
 
మూడవ త్రైమాసికం
- 1 జూలై 2025 నుండి 30 సెప్టెంబర్ 2025 వరకు: ఈ కాలం వ్యాపారవేత్తలకు ఉద్యోగులకు సవాలుగా ఉంటుంది. పెట్టుబడులు పెట్టడం తగ్గించుకోవాలి. వ్యాపారవేత్తలు విదేశీ ఆధారిత కంపెనీతో టై అప్ చేయడానికి మంచి అవకాశం పొందవచ్చు. ఈ టై-అప్ వ్యాపారులకు మంచి ఫలితాలను ఇస్తాయి. అయితే అధిక పని భారం కారణంగా ఉద్యోగులకు ఒత్తిడికి గురవుతారు.
 
నాల్గవ త్రైమాసికం
1 అక్టోబర్ 2025 నుండి 31 డిసెంబర్ 2025 వరకు: భాగస్వామ్యంతో వ్యాపారం చేస్తున్న వ్యాపారులకు కలిసివస్తుంది. కస్టమర్‌తో ఏదైనా సమస్య ఉంటే వ్యూహాత్మకంగా వ్యవహరించాలి. ఉద్యోగులు చేస్తున్న ఉద్యోగంపై పూర్తిగా దృష్టి సారించాలి. సహోద్యోగులతో గాసిప్‌లకు దూరంగా ఉండాలి.