శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : సోమవారం, 18 నవంబరు 2024 (20:13 IST)

మంగళవారం సంకష్ట హర చతుర్థి.. కుజదోషాలు మటాష్

ganesh
మంగళవారం సంకష్ట హర చతుర్థి (చవితి) కలిసిరావడం చాలా విశేషం. ఈరోజున వినాయక పూజ అంగారక దోషాలను తొలగిస్తుంది. సంకటహర గణపతి పూజ సాధారణంగా సూర్యాస్తమయం తర్వాతనే చేస్తారు. ఈ రోజు సాయంత్రం వేళలో వినాయకుని ఆలయానికి వెళ్లి 21 ప్రదక్షిణలు చేయాలి. 
 
వినాయకుడికి గరిక సమర్పించాలి. శక్తి ఉన్నవారు ఆ రోజు ఆలయంలో గణపతి హోమం జరిపించుకుంటే మంచిది. లేని పక్షంలో వినాయకునికి పంచామృత అభిషేకాలు, అర్చనలు జరిపించుకోవచ్చు. 
 
ముఖ్యంగా సంకష్టహర చతుర్థి ఈ సారి మంగళవారం రావడం గొప్ప విశేషమని పండితులు చెబుతున్నారు. ఈ రోజు గణపతిని శాస్త్రోక్తంగా ఆరాధిస్తే జాతకంలో కుజదోష ప్రభావం కారణంగా వివాహం ఆలస్యం అవుతున్న వారికీ అతి త్వరలో వివాహం అవుతుంది.