శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : సోమవారం, 18 నవంబరు 2024 (21:43 IST)

సంకటహర చతుర్థి వ్రతాన్ని ఆచరించడం వల్ల కలిగే ప్రయోజనాలు ఏంటంటే?

lord ganesh
ఈ సంకటహర చతుర్ధి ప్రతినెల క‌ృష్ణపక్షం అంటే.. పౌర్ణమి తర్వాత మూడు నాలుగు రోజుల్లో చవితినాడు వస్తుంది. ప్రదోషకాలంలో అంటే సూర్యస్తమయం ఏ సమయంలో ఉంటుందో ఆరోజు సంకట హర చతుర్థిగా పరిగణిస్తారు.  
 
ఆ రోజు సూర్యస్తమయం తర్వాత స్నానం చేసి స్వామికి దీపారాధన చేయాలి. అప్పటి వరకు ఉడికించినవి ఏవీ తినకూడదు. పాలు, పండ్లు, పచ్చికూరగాయాలు తినవచ్చు.

ఈ వ్రతాన్ని 3,5,21 నెలలు పాటించాలి. ఆ రోజు సాయంత్రం దీపారాధన చేసి.. ఆ తర్వాత సంకట నాశన స్తోత్రం పఠించాలి. ఇది చదువునేటప్పుడు స్వామివారిని వినాయకుడికి ఇష్టమైన దానిమ్మ, గన్నేరు, సమర్పించాలి. ప్రసాదం పరమాన్నం, కుడుములు అందించాలి. ఆ తర్వాత స్వామివారికి హారతి ఇవ్వాలి. ఆ తర్వాత చంద్రుడికి అర్ఘ్యం ఇవ్వాలి. 
 
సంకటహర చతుర్థి నాడు గణేశుడిని ఆరాధించడం వలన జీవితంలో సమస్యలు, అడ్డంకులు తొలగిపోతాయి. గణపతి పూజ ఈ రోజున చేసేవారికి ఆనందం, శ్రేయస్సు లభిస్తుంది. నరదిష్టి వుండదు. జీవితంలో సంపద, శ్రేయస్సు పొందేందుకు సాయపడుతుంది. పాపాల నుండి ఉపశమనం, మోక్షం సిద్ధిస్తుంది.