శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఆధ్యాత్మికం
  2. భవిష్యవాణి
  3. పంచాంగం
Written By సెల్వి
Last Updated : శుక్రవారం, 22 నవంబరు 2024 (10:47 IST)

2025లో ఈ రెండు రాశులకు శనీశ్వరుడి యోగం..? కింగ్ అవుతారు..!

Shani Dev
2025లో మీనరాశిలోకి శనీశ్వరుడు ప్రవేశించనున్నాడు. ఈ ప్రభావంతో కొన్ని రోజులపాటు  ఆ రాశిలోనే వుండనున్నాడు. ఈ ప్రభావంతో రెండు రాశుల వారికి శుభఫలితాలున్నాయి. శని దయ వల్ల ఈ రాశులకు పెండింగ్‌లో ఉన్న పనులు కూడా పూర్తవుతాయి. ఈ రాశుల వారికి శుభసమయం ప్రారంభమైందనే చెప్పాలి. ఈ రాశుల వారు 2025 కింగ్ అవుతారు. 
mesham
mesham
 
ఇక ఆ రెండు రాశులేంటో చూద్దాం. మేషరాశి వారికి శనీశ్వరుని ప్రభావంతో విశేష యోగం కలుగుతుంది. కుటుంబంలో సఖ్యత పెరుగుతుంది. కొత్త ఉద్యోగాలకు కూడా అవకాశం ఉంది. మేష రాశివారికి సమాజంలో గౌరవం కూడా పెరుగుతుంది. వ్యాపారాభివృద్ధి ఉంటుంది. ముఖ్యంగా విదేశాలకు వెళ్లే అవకాశం కూడా ఉంది. ఈ సమయంలో ఏ పనిచేసినా మీది పైచేయి ఉంటుంది.    
 
అలాగే ధనస్సు రాశివారికి కూడా 2025 బాగా కలిసొస్తుంది. ఇంకా లక్ష్మీనారాయణ యోగం ఏర్పడటం ద్వారా ధనాదాయం వుంటుంది. కెరీర్‌ అభివృద్ధి పథంలో దూసుకుపోతుంది. 
Sagittarius
Sagittarius


ఉద్యోగులకు కూడా గురుదృష్టి వల్ల కోరుకున్న ఉద్యోగ అవకాశాలు లభిస్తుంది. శని, గురు దృష్టి వల్ల విదేశాలకు వెళ్తారు. వీరికి అదనపు ఆదాయం కూడా కలుగుతుంది.