శనివారం, 23 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By
Last Updated : మంగళవారం, 27 నవంబరు 2018 (17:43 IST)

బెండకాయలను నానబెట్టిన నీటిని తాగితే.. మధుమేహం..?

బెండకాయలతో నానబెట్టిన నీటిని.. ఉదయం పూట పరగడుపున తాగడం ద్వారా మధుమేహం పారిపోతుంది. రాత్రి నిద్రించేందుకు ముందు.. బెండకాయలను రెండుగా కట్ చేసి వాటిని తాగే నీటిలో వేసి మూతపెట్టాలి. ఉదయం పూట ఆ నీటిని తాగడం ద్వారా రక్తంలోని చక్కెర స్థాయిలు తగ్గుముఖం పడుతాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు. 
 
బెండకాయలోని యాంటీ-యాక్సిడెంట్లు, విటమిన్-సి వంటివి వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. తద్వారా జలుబు, జ్వరం, దగ్గు వంటి రుగ్మతల నుంచి తప్పించుకోవచ్చు. బెండలోని పీచు ఉదర సంబంధిత రుగ్మతలను దూరం చేస్తుంది. ఈ నీటిని సేవించడం ద్వారా ఎముకలు బలపడతాయి. 
 
శ్వాస సమస్యలతో ఇబ్బంది పడుతున్నవారు అంటే ఆస్తమాతో బాధపడేవారు.. బెండ ముక్కలను నానబెట్టిన నీటిని తాగడం ద్వారా ఉపశమనం లభిస్తుంది. బెండకాయలోని కరగని పీచు పదార్థాలు.. పెద్ద పేగు క్యాన్సర్‌ను నియంత్రిస్తుంది. ఇంకా శరీరంలోని ప్రమాదకర కొవ్వును కరిగిస్తుంది. హృద్రోగాలను దూరం చేస్తుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.