ఆదివారం, 5 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By pnr
Last Updated : సోమవారం, 30 ఏప్రియల్ 2018 (18:00 IST)

పరగడుపునే ఐదారు తులసి ఆకులు ఆరగిస్తే...

తులసి.. హిందువులు పవిత్రంగా భావించి పూజించి మొక్క. ఆయుర్వేద శాస్త్రం మనకు అందించిన అద్భుతమైన ఔషధ మొక్కల్లో ఒకటి. ఈ తులసి మొక్క ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అలాంటి తులసి ఆకులను ప్రతి రోజూ పరగడుపున

తులసి.. హిందువులు పవిత్రంగా భావించి పూజించి మొక్క. ఆయుర్వేద శాస్త్రం మనకు అందించిన అద్భుతమైన ఔషధ మొక్కల్లో ఒకటి. ఈ తులసి మొక్క ఆకుల్లో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. అలాంటి తులసి ఆకులను ప్రతి రోజూ పరగడుపునే ఐదారు ఆకులను ఆరగించడం వల్ల కలిగే లాభాలేంటో తెలుసుకుందాం.
 
* తులసి ఆకులను తినడం వల్ల చర్మ సమస్యలు పోతాయి. చర్మం కాంతివంతంగా, మృదువుగా మారుతుంది. 
* ప్రతి రోజూ తులసి ఆకలు ఆరగించడం వల్ల లివర్‌లో ఉండే వ్యర్థ పదార్థాలు బయటకి వెళ్లిపోతాయి. లివర్ శుభ్రమవుతుంది. శరీర మెటబాలిజం మెరుగుపడుతుంది. 
 
* తులసి ఆకులను క్రమం తిప్పకుండా తినడం వల్ల జీర్ణ వ్యవస్థ పనితీరు మెరుగు పడుతుంది. అలాగే, అజీర్ణం, గ్యాస్, అసిడిటీ, మలబద్దకం వంటి సమస్యలు తగ్గుతాయి. తలనొప్పి, నిద్రలేమి నుంచి ఉపశమనం లభిస్తుంది. 
* జ్వరం, తలనొప్పి, గొంతు నొప్పి, దగ్గు, జలుబుల నుంచి ఉపశమనం లభిస్తుంది. గుండె సమస్యలు వచ్చే అవకాశం తగ్గుతుంది. కీళ్ల నొప్పులు ఉండవు. 
 
* తులసి ఆకుల్లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉండటం వల్ల శరీర రోగ నిరోధక వ్యవస్థను పటిష్టం చేస్తాయి. ఇన్‌ఫెక్షన్లు రాకుండా చూస్తాయి. క్యాన్సర్ కణాలకు వ్యతిరేకంగా పోరాడుతాయి. ఇంకా అనేక ఆరోగ్య లాభాలు చేకూరుతాయి.