శనివారం, 11 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By సెల్వి
Last Updated : శనివారం, 10 ఏప్రియల్ 2021 (23:17 IST)

మందారం టీ తాగితే.. కొలెస్ట్రాల్ పరార్.. ఒబిసిటీ మటాష్

మందారం టీ తాగడం వల్ల మధుమేహాన్ని నియంత్రించుకోవచ్చు. అలాగే మందారం టీని తాగడం వల్ల కొలెస్ట్రాల్ లెవెల్స్ కూడా తగ్గుతాయి. అలానే మందారంతో చేసిన టీ తాగడం వల్ల బరువు కూడా తగ్గవచ్చు. ఊబకాయం సమస్యతో బాధపడే వాళ్లకి ఇది బాగా ఉపయోగపడుతుంది. అధిక బరువుతో ఉన్నవారిపై జరిపిన పరిశోధనలో మందారం టీ తాగడం ద్వారా ఊబకాయం దూరమవుతుందని కనుగొనడం జరిగింది. 
 
అలాగే మందారం టీ క్యాన్సర్ వంటి వాటిని కూడా ఇది దరిచేరకుండా కాపాడుతుంది. నిమోనియా వంటి సమస్యలను కూడా వీటితో తరిమికొట్టొచ్చు. మందారం టీ లో యాంటీ ఆక్సిడెంట్ పుష్కలంగా ఉంటాయి.  
 
యాంటీ క్యాన్సర్ గుణాలు కూడా ఇందులో ఉంటాయి. మందార రేకులకు తీసుకుని తగినంత నీళ్ళు పోసి బాగా మరిగించండి. ఐదు నిమిషాల తర్వాత వడ కట్టేసి ఆ నీటిని టీలా తాగడం చేయాలి. కావాలంటే మీరు కొద్దిగా తేనెను కలుపుకోవచ్చునని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.