లవంగం తులసి ఆకుల రసం పురుషుల్లో వీర్యవృద్ధికి?

శుక్రవారం, 29 మార్చి 2019 (18:03 IST)
లవంగ తులసి గురించి మీరు ఎప్పుడైనా విన్నారా? ఈ మొక్కను ఆహారపానీయాలలో లేదా ఔషధంగా ఉపయోగించడం మనం చూసుంటాం. ఈ మొక్కలోని ప్రతి భాగంలో ఔషధ గుణాలు ఉన్నాయి. ఈ మొక్క నుంచి సుగంధాలు వెదజల్లుతాయి. దీనికి కారణం ఇందులో యూజెనాల్‌, మిథైల్‌ యూజెనాల్‌, కారియోఫిల్లీన్‌, సిట్రాల్‌, కేంఫర్‌, థైమాల్‌ వంటి ఎస్సెన్షియల్‌ ఆయిల్స్‌ ఉండటం. 
 
ఇలాంటి సుగంధ తైలాల మిశ్రమాలు యాంటిసెప్టిక్‌గా పనిచేస్తాయి. లవంగ తులసి మొక్కలను పెంచే చోట పరిసరాలు పరిశుభ్రంగా, కాలుష్యరహితంగా ఉంటాయి. దోమలు అక్కడికి రావు. ఈ ఔషధం చేకూర్చే ప్రయోజనాలను చూద్దాం. లవంగ తులసి ఆకులను కషాయంగా చేసుకుని తాగితే దగ్గు, జలుబు, ఇతర శ్వాస సంబంధ సమస్యల నుంచి ఉపశమనం పొందవచ్చు. 
 
జీర్ణశక్తిని పెంపొందించడానికి, శరీరానికి సత్తువ అందించడానికి ఉపయోగపడుతుంది. కీళ్ల సమస్యలను ఇట్టే నయం చేస్తుంది, రక్తస్రావాలను నిరోధించుటకు ఉపకరిస్తుంది. తలనొప్పి, పంటి నొప్పి, చెవిపోటుతో బాధపడేవారు ఇది తింటే ఉపశమనం కలుగుతుంది. చిన్న పిల్లల ఉదర సమస్యలకు దివ్యౌషధం. తేనెతో కలిపి తీసుకుంటే వాంతులు కావు. 
 
దీని విత్తన ఔషధం విరేచనాలు, నరాల బలహీనతలు, మూత్ర సమస్యల నివారణకు పనిచేస్తుంది. తులసి ఆకుల రసం పురుషుల్లో వీర్యవృద్ధికి, ఎర్రరక్తకణాల పెంపుకు తోడ్పడుతుంది. కాలేయ వ్యాధులు రాకుండా చూసుకుంటుంది. దోమలను పారద్రోలే శక్తి అధికంగా ఉండటం వల్ల రకరకాల ఉత్పత్తుల్లో దీనిని విస్తృతంగా వాడుతున్నారు. డయాబెటిస్ మందులు వాడే వారు ఇది తీసుకుంటే బాగా పనిచేస్తాయి.

అన్నీ చూడండి

నా బిడ్డను ఎత్తుకుపోయింది నా భర్త, ఇందులో పవన్ సర్‌కి ఏంటి సంబంధం?: డాక్టర్ గాయత్రి వీడియో

ఇస్రో శాస్త్రవేత్తలు ఎందుకు రాజీనామాలు చేస్తున్నారు : కేంద్రం ఆరా

ప్రధాని చేతుల మీదుగా తొలి హైడ్రోజన్ రైలు ప్రారంభం, ఏమిటి దీని ప్రత్యేకతలు?

బెంగాల్‌లో ఘోరం : స్కూలు వ్యానును ఢీకొట్టిన ప్యాసింజర్ రైలు

గల్లా జయదేవ్ గారూ క్షమించండి, మీకోసం ఏపీ తలుపులు తెరిచి వుంచాము: నారా లోకేష్

అన్నీ చూడండి

Khan Durrani :ఆకట్టుకున్న కళ్యాణం కమనీయం జీవితం సినిమా టీజర్

Varun Tej: కొరియన్ కనకరాజు లో దక్షా నాగర్కర్‌, వరుణ్ తేజ్ లపై స్పెషల్ సాంగ్

Kiran Abbavaram : తత్వం లోని పాట విడుదల చేసిన కిరణ్‌ అబ్బవరం

ముగ్గురు స్నేహితుల కథగా MRP – నీకెంత నాకెంత మూవీ రివ్యూ

Aishwarya Rajesh: హీరోయిన్ కి మూడేళ్ళ స్పాన్ అనే వారు. అదే నిజం అనుకున్నా : ఐశ్వర్య రాజేష్

తర్వాతి కథనం
Show comments