కొబ్బరినూనెలో కరివేపాకును మరిగించి తలకు రాసుకుంటే?
కరివేపాకును కొబ్బరినూనెలో మరిగించి.. వడగట్టి ఆ నూనెను తలకు రాసుకుంటే వెంట్రుకలు ఒత్తుగా పెరుగుతాయి. కరివేపాకు, వేప పేస్టు ముద్దగా నూరి ఒక స్పూన్ ముద్దను అరకప్పు మజ్జిగలో కలిపి తీసుకుంటే చర్మసమస్యలు తగ్గిపోతాయి.
ఒళ్లంతా దురదలతో బాధపడేవారు కరివేపాకు, పసుపు సమానంగా తీసుకుని పొడిగొట్టుకుని రోజూ ఒక స్పూను మోతాదులో నెలరోజులపాటు తీసుకుంటే దురదలు తగ్గుతాయి. కరివేపాకు రసాన్ని పెరుగు లేదా వెన్నలో కలిపి కళ్లకింద పూస్తుంటే కంటికింది వలయాలు మాయమవుతాయి.
తేనెటీగ, తుమ్మెద వంటి కీటకాలు కుడితే కరివేపాకు రసాన్ని నిమ్మరసంతో కలిపి అవి కుట్టిన ప్రదేశంలో రాస్తే బాధ నుంచి వెంటనే ఉపశమనం కలుగుతుంది. మూత్రపిండాల సమస్యతో బాధపడేవారు ఒకస్పూన్ కరివేపాకు రసాన్ని రోజూ రెండుపూటలా తీసుకుంటూ వుంటే మంచి ఫలితం వుంటుంది.