శుక్రవారం, 27 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 9 జులై 2019 (18:42 IST)

భోజనం తీసుకున్న అరగంట తర్వాతే పండ్లు తీసుకోవాలట?

భోజనం తర్వాత వెంటనే అవి అంతగా జీర్ణం కావని.. వాటిలోని పోషకాలు సరిగ్గా జీర్ణవ్యవస్థచేత పీల్చబడవని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. భోజనానికి పండ్లను తీసుకోవడానికి కనీసం 30 నిమిషాల వ్యవధి వుండాలి. లేదా భోజనానికి ఒక గంట ముందు లేదా ఎసిడిటీ, డయాబెటీస్ వంటి సమస్యలున్నవారైతే భోజనం తర్వాత రెండు గంటలకు తినాలి. ఎందుకంటే డయాబెటీస్‌తో కొన్ని జీర్ణక్రియ సమస్యలుంటాయి. 
 
అజీర్ణం, ఎసిడిటీ వంటివి లేకుంటే పండ్లను పెరుగుతో కలుపుకుని తీసుకోవచ్చు. ఆపిల్, ఆరెంజ్, పుచ్చకాయ, దానిమ్మ వంటివి పెరుగుతో కలుపుకోవచ్చు. బెర్రీలు, డ్రై ఫ్రూట్స్ కూడా పెరుగుతో తినవచ్చు. సాధారణంగా ఇతర ఉడికించిన ఆహారాలకంటే కూడా పండ్లు త్వరగా జీర్ణం అయిపోతాయి. వీలైనంతవరకు పండ్లను ఉడికించిన ఆహారాలతో పాటు తీసుకోకూడదు. పండ్లను మూడు రోజుల కంటే అధిక రోజులు ఫ్రిజ్‌ల్లో నిల్వ వుంచకూడదు.