శుక్రవారం, 24 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By
Last Updated : మంగళవారం, 9 జులై 2019 (14:32 IST)

చింతచిగురు చిన్నారులకు తినిపిస్తే...?

చింతచిగురు చిన్నారులకు తినిపిస్తే నులిపురుగుల సమస్య తొలగిపోతుంది. నులిపురుగుల సమస్యతో బాధపడుతున్న చిన్నారులకు చింతచిగురుతో చేసిన వంటలు తినిపిస్తే ఫలితం ఉంటుంది. చింతచిగురు కషాయం వల్ల బాలింతలకి పాలు పడతాయి. 
 
చింతచిగురులోని యాంటీఆక్సిడెంట్లు ఫ్రీరాడికల్స్‌ని అడ్డుకుంటాయి. తద్వారా గుండెజబ్బులు రాకుండా చూసుకోవచ్చు. రక్తాన్ని శుద్ధి చేయడంలోనూ, కీళ్ళనొప్పులకు ఇది మేలు చేస్తుంది. అదేసమయంలో చింతాకు ఎర్ర రక్తకణాల ఉత్పత్తికి దోహదపడుతుందని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. 
 
చింతచిగురుతో మరిగించిన కషాయం లేదా టీలో కాస్త తేనె వేసుకుని తాగడం వల్ల మధుమేహం నియంత్రణలో ఉంటుంది. కామెర్లకీ మందులా పనిచేస్తుంది. ఈ కషాయం గొంతునొప్పినీ మంటనీ తగ్గిస్తుంది. 
 
ఇందులోని విటమిన్‌-సి నోటిపుండ్లనీ చిగుళ్ల వ్యాధుల్నీ నివారిస్తుంది. జ్వరానికీ గ్యాస్‌ సంబంధిత సమస్యలకీ కూడా మందులా పనిచేస్తుందని ఆరోగ్య నిపుణులు తెలిపారు.