గురువారం, 2 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By సెల్వి
Last Updated : బుధవారం, 22 ఏప్రియల్ 2020 (19:08 IST)

హనీ వాటర్‌ను ఎప్పుడు పడితే అప్పుడు తీసుకుంటే?

Honey Water
హనీ వాటర్‌ను ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకోవచ్చునని.. ఉదయం పరగడుపున మాత్రమే సేవించాలనే నియమం లేదంటున్నారు ఆయుర్వేద నిపుణులు. హనీ వాటర్ రోజూ తీసుకుంటే ఆరోగ్యంగా వుండొచ్చు. ఇంకా హానీ వాటర్ తయారు చేయడం చాలా తేలిక. గోరువెచ్చని నీటిలో చెంచా తేనె కలుపుకుంటే అంతే హనీ వాటర్ సిద్ధం అయినట్టే.
 
ఈ హనీ వాటర్‌ను ఎప్పుడు కావాల్సి వస్తే అప్పుడు టీ, కాఫీలకు బదులుగా తీసుకోవచ్చు. ఒబిసిటీతో ఇబ్బంది పడుతున్నవారు మాత్రం అప్పుడప్పుడు తీసుకుంటూనే ఉదయం ఒకసారి, రాత్రి పడుకోబోయే ముందు మరోసారి తీసుకోవాలి. అలాగే ఇందులో విటమిన్ సీ కోసం కాస్త లెమన్, ఆరెంజ్‌ను కూడా యాడ్ చేసుకోవచ్చు. రోగనిరోధక శక్తి పెంచేందుకు జింజర్‌ను కూడా కలుపుకోవచ్చు. క్రమం తప్పకుండా తీసుకుంటే వారం రోజుల్లోనే దాని ప్రభావం కనిపిస్తుంది. 
 
ఇలా రెగ్యులర్‌గా తీసుకునే ఆహారానికే తేనెను కలుపుకోవడం ద్వారా ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుతుంది. ప్రతిరోజూ ఉదయాన్నే గోరువెచ్చని నీరులో తేనెను కలిపి తీసుకోవడం ద్వారా అలర్జీలకు చెక్ పెట్టవచ్చు. తేనెలో యాంటీ బ్యాక్టీరియా, యాంటీ ఫంగల్, యాంటీ ఇన్ ఫ్లమేటరీ ప్రాపర్టీస్ పుష్కలంగా ఉన్నాయి. అంతేకాదు.. సహజసిద్ధమైన తేనెలో ఉన్న యాంటీ యాక్సిడెంట్స్ మన జీర్ణవ్యవస్థను మెరుగుపరుస్తాయని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.