శుక్రవారం, 29 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By chj
Last Modified: బుధవారం, 3 అక్టోబరు 2018 (17:45 IST)

కరక్కాయ ఏం చేస్తుందో తెలుసా? అది మామూలుగా పనిచేయదు...

ప్రతిరోజు రకరకాల దినుసులను ఉపయోగిస్తుంటాము. మనం ఉపయోగించే వాటిలో కరక్కాయ చాలా ముఖ్యమైనది. ఇది మన ఆరోగ్యానికి చాలారకాలుగా ఉపయోగపడుతుంది.

ప్రతిరోజు రకరకాల దినుసులను ఉపయోగిస్తుంటాము. మనం ఉపయోగించే వాటిలో కరక్కాయ చాలా ముఖ్యమైనది. ఇది మన ఆరోగ్యానికి చాలారకాలుగా ఉపయోగపడుతుంది. దీని ప్రయోజనాలు ఏమిటో చూద్దాం.
 
1. కరక్కాయలో చలువ చేసే గుణం ఉంది. ఇది పైత్యాన్ని హరిస్తుంది.
2. దగ్గుతో బాధ పడేవారు కరక్కాయ బుగ్గన ఉంచుకుంటే మంచి ఉపశమనం లభిస్తుంది.
3. కరక్కాయ ముక్కలను నీళ్లలో నానబెట్టి, ఆ నీటిని తాగితే గుండెకు బలం చేకూరుతుంది. 
4. వాంతులవుతున్నప్పుడు కరక్కాయపొడిని మంచినీళ్లలో తీసుకుంటే  వాంతులు తగ్గుతాయి.
5. మలబద్దకంతో బాధపడేవారు కరక్కాయను వాడటం వలన విరోచనం సాఫీగా అవుతుంది. ఇది వాతాన్ని హరిస్తుంది.
6. తరచూ తలనొప్పితో బాధపడేవారు కరక్కాయను అరగదీసి ఆ గంధాన్ని నుదుటన పట్టిస్తే తలనొప్పి, కళ్లమంటలు తగ్గుతాయి.
7. కరక్కాయ పొడిలో మెత్తని ఉప్పుచేర్చి పండ్లు తోముకొనిన చిగుళ్లు దృఢపడి పంటివ్యాధులు రావు.  పిప్పి పన్నుపోటు కూడా తగ్గుతుంది.