శుక్రవారం, 10 జనవరి 2025
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By
Last Updated : బుధవారం, 10 అక్టోబరు 2018 (13:54 IST)

నేరేడు గింజల పొడిని నీటిలో కలుపుకుని తాగితే? (video)

నేరేడు ఆకుల కషాయంతో బ్యాక్టీరియల్‌, వైరల్‌ ఇన్‌ఫెక్షన్ల నుంచి తప్పించుకోవచ్చు. నేరేడు ఆకులను మెత్తగా నూరి రోజుకు అర స్పూన్ తీసుకుంటే రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. అలాగే నేరేడు పండ్లను ఊబకాయులు, మధుమ

నేరేడు ఆకుల కషాయంతో బ్యాక్టీరియల్‌, వైరల్‌ ఇన్‌ఫెక్షన్ల నుంచి తప్పించుకోవచ్చు. నేరేడు ఆకులను మెత్తగా నూరి రోజుకు అర స్పూన్ తీసుకుంటే రక్తపోటు కూడా అదుపులో ఉంటుంది. అలాగే నేరేడు పండ్లను ఊబకాయులు, మధుమేహులు కూడా నిరభ్యంతరంగా తీసుకోవచ్చు. 
 
మధుమేహులు నేరేడు గింజల పొడిని నీటిలో కలుపుకుని తాగితే రక్తంలోని చక్కెర స్థాయిలు అదుపులోకి వస్తాయి. నేరేడు పండ్లు తింటే కాలేయ సంబంధిత సమస్యలు తొలగిపోయి కాలేయం పనితీరు మెరుగుపడుతుంది. అజీర్తితో ఇబ్బంది ఏర్పడితే నాలుగు పండిన నేరేడు పండ్లను తింటే ఉపశమనం కలుగుతుంది. 
 
నేరేడులోని యాంటీ ఆక్సిడెంట్లు మెదడు, గుండె ఆరోగ్యానికి రక్షగా నిలుస్తాయి. రక్తక్యాన్సర్‌ కారకాలను కూడా నిరోధిస్తాయి. అధిక జ్వర బాధితులు ధనియాల రసంలో నేరేడు రసం కలిపి తీసుకుంటే.. శరీర ఉష్ణోగ్రత అదుపులో ఉంటుంది. యూరినల్ ఇన్ఫెక్షన్లను దూరం చేసుకోవాలంటే.. నిమ్మ, నేరేడు రసాన్ని రెండేసి చెంచాల చొప్పున నీటిలో కలిపి తీసుకుంటే ఉపశమనం వుంటుంది.  
 
నేరేడు ఆకుల కషాయంతో నోరు పుక్కిలిస్తే పంటినొప్పి, చిగురువాపు, నోట్లో పుండ్లు, నోటి దుర్వాసన వంటి సమస్యలు దూరమవుతాయి. నెలసరి సమస్యలున్నవారు నేరేడు బెరడు కషాయాన్ని నెలరోజులు ఓ స్పూన్ మోతాదులో రెండుసార్లు తీసుకుంటే మంచి ఫలితం వుంటుందని ఆయుర్వేద నిపుణులు సూచిస్తున్నారు.