బుధవారం, 27 నవంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. ఆయుర్వేదం
Written By selvi
Last Updated : శుక్రవారం, 29 డిశెంబరు 2017 (18:33 IST)

నీరసంగా వుందా పుదీనా రసం తాగండి (video)

నీరసంగా వుంటే పుదీనా రసం తాగండి అంటున్నారు.. ఆయుర్వేద నిపుణులు. పుదీనా ఆకులు గుప్పెడు తీసుకుని మిక్సీలో రుబ్బుకుని.. దానిని వడగట్టి., రెండు స్పూన్ల నిమ్మరసం, ఒక స్పూనె తేనె కలిపి.. తగిన నీటిని చేర్చి

నీరసంగా వుంటే పుదీనా రసం తాగండి అంటున్నారు.. ఆయుర్వేద నిపుణులు. పుదీనా ఆకులు గుప్పెడు తీసుకుని మిక్సీలో రుబ్బుకుని.. దానిని వడగట్టి., రెండు స్పూన్ల నిమ్మరసం, ఒక స్పూనె తేనె కలిపి.. తగిన నీటిని చేర్చి తీసుకుంటే మంచి ఫలితం వుంటుంది. ఎసిడిటీతో బాధపడే వారికి ఈ జ్యూస్ ఎంతో మేలు చేస్తుంది. రోజుకో గ్లాసు పుదీనా రసం తీసుకుంటే అలసట, నీరసం దూరం అవుతుంది. 
 
కాళ్ళు, చేతులు మంటగా అనిపిస్తే పుదీనా ఆకులను ముద్దగా చేసి ఆ ప్రాంతంలో రాస్తే మంట తగ్గుతుంది. ఈ ముద్దను గాయాల తాలుకూ మచ్చలకు రాస్తే త్వరగా మాయమౌతాయి. కడుపు నొప్పితో బాధపడేవారు ఓ స్పూన్ డికాషన్‌లో రెండు గ్లాసుల నీరు చేర్చి... గుప్పెడు పుదీనా ఆకులు వేసి మరగించాక తాగితే కడుపునొప్పి నుంచి ఉపశమనం లభిస్తుంది.
 
పుదీనా రసం తయారీ..?
కావల్సిన పదార్థాలు: 
పుదీనా రసం- రెండు చెంచాలు, 
నిమ్మరసం- చెంచా, 
ఉప్పు- రుచికి తగినంత, 
వేయించిన జీలకర్ర పొడి- అర చెంచా
మిరియాల పొడి- అరచెంచా.
 
తయారీ విధానం : గ్లాసుడు నీళ్లలో, పుదీనా జ్యూస్ రెండు చెంచాలు, నిమ్మరసం, జీలకర్ర పొడి, మిరియాల పొడి చేర్చి.. కలిపి తాగితే బరువు తగ్గడంతో పాటు అనారోగ్య సమస్యలను దూరం చేసుకోవచ్చు. 
 
'