సోమవారం, 23 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. పెరటి వైద్యం
Written By pnr
Last Updated : మంగళవారం, 26 డిశెంబరు 2017 (13:34 IST)

వీటిని ఆరగిస్తే గుండెపోటు దూరం

మంచి ఆరోగ్యం లేకుంటే పరిపూర్ణమైన సంతోషం ఉండదు. అందుకే ప్రతి మనిషి ఎంతో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. ఇందుకోసం తమ వంతు ప్రయత్నం చేస్తూ, కొన్ని రకాల ఆరోగ్య సూత్రాలు పాటిస్తుంటారు.

మంచి ఆరోగ్యం లేకుంటే పరిపూర్ణమైన సంతోషం ఉండదు. అందుకే ప్రతి మనిషి ఎంతో ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటారు. ఇందుకోసం తమ వంతు ప్రయత్నం చేస్తూ, కొన్ని రకాల ఆరోగ్య సూత్రాలు పాటిస్తుంటారు. అయితే, మనిషి శరీరంలోని ప్రధాన అవయవాల్లో గుండె, ఊపిరితిత్తులు, కాలేయం, మూత్రపిండాలు, మెదడు ఎంతో ముఖ్యమైనవి. వీటిలో ఏ ఒక్కటి పాడైనా లేక బలహీనంగా ఉన్నా, అవి గుండెపోటుకు దారితీస్తాయి. ఇటీవలికాలంలో కొందరు పరిశోధకులు చేసిన పరిశోధన ప్రకారం నట్స్(పప్పులు) రోజు తింటే గుండెపోటురాదని తెలిసింది.
 
గుండెపోటుకి పప్పుగింజలకి మధ్య ఉన్న సంబంధం, ఒక్కో రకం పప్పు గింజల్లో ఒక్కో రకమైన ఆరోగ్యానికి సంబంధించిన ప్రయోజనాలు ఉన్నాయని పరిశోధనలో తేలింది. ఇలాంటి పప్పుల్లో వేరుశెనగ పప్పులు, బాదం, జీడి పప్పులు, పిస్తా, అక్రోట్లను పప్పుల్లో ముఖ్యమైనవి. బాదం పప్పులు కండలు పెరగడంలో సహయపడితే, పిస్తా పప్పులు బరువు పెరగడంలో తోడ్పడుతుంది. 
 
పిస్తా, బాదం పప్పులు రెండూ శరీరంలో రోగనిరోధకశక్తిని పెంచి రోగాలకు దూరంగా ఉంచుతాయి. గుండెపోటు చాలా ప్రమాదకరమైనది. గుండెకి రక్తం, ఆక్సిజన్ లోపించి గుండె కొట్టుకోవడం ఆగిపోతుంది. చాలా సందర్భాల్లో గుండెపోటు హఠాత్తుగా మరణానికి దారితీస్తుంది. ఇలాంటి వాటికి చెక్ పెట్టాలంటే కొంచెం ధర ఎక్కువగా ఉన్నప్పటికీ ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా తమ రోజువారీ ఆహారంలో నట్స్‌ను చేర్చుకోవాలని ఆహారనిపుణులు సలహా ఇస్తున్నారు.