గురువారం, 26 డిశెంబరు 2024
  1. ఇతరాలు
  2. ఆరోగ్యం
  3. కథనాలు
Written By selvi
Last Updated : శుక్రవారం, 15 డిశెంబరు 2017 (14:54 IST)

ఉడికించిన వేరుశెనగలు.. మధుమేహ వ్యాధిగ్రస్థులకు మేలు చేస్తాయట.. (వీడియో)

వేరుశెనగలను వేయించి తినడం కంటే ఉడికించి తినడం ద్వారా ఆరోగ్యానికి మేలు చేసినవారమవుతామని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వేరుశెనగలను ఉప్పుతో వేయించి తినడం, కారం చల్లి తినడం వంటివి చేయకుండా ఉడికించి తీసు

వేరుశెనగలను వేయించి తినడం కంటే ఉడికించి తినడం ద్వారా ఆరోగ్యానికి మేలు చేసినవారమవుతామని ఆరోగ్య నిపుణులు సూచిస్తున్నారు. వేరుశెనగలను ఉప్పుతో వేయించి తినడం, కారం చల్లి తినడం వంటివి చేయకుండా ఉడికించి తీసుకోవడం ద్వారా గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తాయి. ఉడికించిన వేరుశెనగల్లో వుండే కొవ్వు పదార్థాలను మోనోశాటరైడ్లుగా పేర్కొంటారు.
 
ఇవి హృద్రోగ వ్యాధులను దూరం చేస్తాయి. అందుకే రోజూ సాయంత్రం పూట స్నాక్స్‌గా జంక్ ఫుడ్స్ తీసుకోవడం కంటే ఉడికించిన వేరు శెనగలు గుప్పెడు తీసుకోవడం మేలంటున్నారు న్యూట్రీషియన్లు. వేరుశెనగల్లో విటమిన్స్ పుష్కలంగా వుంటాయి. ఇందులో బీ విటమిన్ రక్తకణాల ఉత్పత్తికి తోడ్పడుతాయి. ఉడికించిన వేరుశెనగల్లో కెలోరీలు తక్కువగా వుంటాయి. ఫలితంగా బరువు తగ్గుతారు. 
 
అయితే వేయించిన వేరుశెనగల్లో కేలరీలు అధికంగా వుంటాయి. ఉడికించిన వేరుశెనగల్లో ఫైబర్ అధికంగా వుంటుంది. ఇది మధుమేహం వ్యాధిగ్రస్థులకు మేలు చేస్తుంది. ఉడికిన వేరుశెనగల్లో ఫ్లేవనాయిడ్స్, పాలిఫెనాల్స్, యాంటీ యాక్సిడెంట్స్ అనారోగ్య సమస్యలను దరిచేరనివ్వవు. ఇంకా క్యాన్సర్‌ కణాలపై పోరాడుతాయని ఆరోగ్య నిపుణులు అంటున్నారు.